Playstore Icon
Download Jar App
Digital Gold

బంగారం ధరలను ప్రభావితం చేసే వివిధ అంశాలు ఏంటి? - జార్ యాప్

December 28, 2022

బంగారం ధరను ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి? బంగారం ధరలు పెరగడానికి కారణం ఏంటి? బంగారం ధరల గురించి చాాలా విషయాలు తెలుసుకోవడానికి దీన్ని చదవండి.

మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి, యువరాణులు, సముద్రపు దొంగల కథల ద్వారా బంగారం ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా..

పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతిలో బంగారం ఒక ముఖ్యమైన భాగం. చరిత్ర మొత్తంలో బంగారం అనేది ప్రముఖమైనదిగా గుర్తించబడింది.

బంగారం ఎంతో విలువైనదే కాకుండా అందరకీ అవసరమైన వస్తువుగా గుర్తింపు పొందింది. అందుకే బంగారం ప్రపంచంలోని ప్రముఖ వస్తువుల్లో ఒకటి.

అయితే మీరు ఈ విలువైన లోహంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే బంగారం విలువ అనేక అంశాల ద్వారా నిర్ణయించబడుతుందనే విషయం మీరు తెలుసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు దాని గురించి తెలుసుకోవాలి:‍

బంగారం ధరలను ఏది ప్రభావితం చేస్తుంది?

1. డిమాండ్, సరఫరా

కనీసం 5,000 సంవత్సరాలుగా బంగారాన్ని తవ్వి తీసి వాడుకుంటున్నారని నమ్ముతుంటారు. ఈ విలువైన లోహం ధర తరచుగా మారుతూ ఉన్నప్పటికీ దాని విలువ మాత్రం అలాగే ఉంటుంది.

మీరు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, తయారీ ఖర్చులు, మనీ సప్లయ్, ఆర్థిక లేదా రాజకీయ స్థిరత్వం అలాగే ఆభరణాలు, పరిశ్రమల డిమాండ్ తదితర అంశాల ద్వారా బంగారం ధర ప్రభావితమవుతుందని తెలుసుకోవాలి.

ఇంకోలా చెప్పాలంటే బంగారం అనేది చాలా పరిమితమైనది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దాన్ని మరింత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మార్చడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల బంగారం ధరలు పెరుగుతుంటాయి.

అయితే, దీర్ఘకాలంలో బంగారం వాస్తవ విలువ చాలా స్థిరంగా ఉంటుంది. ధరలు కూడా కేవలం తాత్కాలిక అనిశ్చితి లేదా సాధారణ కరెన్సీ మార్పులనే  సూచిస్తాయి.

బంగారం డిమాండ్, ధర విషయంలో మత విశ్వాసాలు కీలక పాత్ర పోషిస్తాయి. ధంతేరాస్, దీపావళి, వినాయక చవితి, అక్షయ తృతీయ వంటి ప్రధాన పండుగల సమయంలో దేశవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.

పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ మరింత పెరుగుతుంది. ప్రజలు ఈ ముఖ్యమైన రోజులను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజుల్లో బంగారు ఆభరణాలు లేదా నాణేలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం ధరలు పెరుగుతాయి.

ప్రజలు శుభ సందర్భాల్లో బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసుకోండి.

బంగారాన్ని ఆభరణాల తయారీకి మాత్రమే ఉపయోగించరు. ఇది ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి కూడా వాడుతుంటారు. సీజన్, తయారీ సామర్థ్యంపై ఆధారపడి డిమాండ్ హెచ్చుతగ్గులకు కారణమయ్యే అంశాలన్నీ కలిసి పనిచేస్తాయి.

2. ద్రవ్యోల్బణం

బంగారం అనేది ఎంతో విలువైన పెట్టుబడిగా చాలా కాలంగా గుర్తింపు పొందింది. ఇది డబ్బులాగా ముద్రణ కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యక్షమైన వస్తువు. బంగారం విలువ ప్రభుత్వ వడ్డీ రేటు నిర్ణయాల ద్వారా ప్రభావితం కాదు. బంగారం విలువ అలాగే ఉంటుంది. కాబట్టి ఆదాయ నష్టాలకు వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ రూపంలో కూడా వాడుకోవచ్చు.

ద్రవ్యోల్బణంతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కాబట్టి భారతీయులు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి అలాగే ఆదా చేయడానికి ఇష్టపడుతుంటారు. ద్రవ్యోల్బణం పెరగడంతో కరెన్సీ విలువ పడిపోతుంది. ఎక్కువ కాలం పాటు బంగారం ఎక్కువ మొత్తంలో ఉంటే అది ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుంది. అలాగే దీర్ఘకాలంలో స్థిరంగా ఉంటుంది.

ఫలితంగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం బంగారం డిమాండ్‌ను పెంచుతుందని భావించవచ్చు. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతాయి.

సులువుగా చెప్పాలంటే.. రూపాయి విలువ పడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంటే బంగారం ధరలు పెరగడం అన్నట్లే. ఉదాహరణకు, మీ బ్యాంక్ అకౌంట్​లో రూ. 70 లక్షలు ఉన్నాయనుకోండి. ద్రవ్యోల్బణం మీ కొనుగోలు శక్తిని తగ్గించినప్పుడు, బంగారం కొనుగోలు శక్తి మాత్రం రూపాయి పరంగా స్థిరంగా ఉంటుంది.

మీ పెట్టుబడులపై ద్రవ్యోల్బణం ప్రభావం గురించి ఇక్కడ పూర్తిగా చదవండి.

3. వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లకు, బంగారం ధరలకు విలోమానుపాత సంబంధం ఉంటుంది. ప్రస్తుత బంగారం ధరలు దేశ వడ్డీ రేటు ట్రెండ్​కు నమ్మకమైన సూచిక.

వడ్డీ రేట్లు పెరిగినప్పుడు క్లయింట్లు ఎక్కువ డబ్బు పొందేందుకు బంగారాన్ని విక్రయించే అవకాశం ఉంది. దీంతో బంగారం సరఫరా పెరగడం, దాని ధర తగ్గడం జరుగుతుంది.

ఇంటర్నెట్‌లో బంగారాన్ని కొనడం, అమ్మడం అంత సులువు కాదు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ప్రజల వద్ద ఎక్కువ నగదు ఉంటుంది. ఇది బంగారానికి డిమాండ్ పెరగడానికి దారి తీస్తుంది. ఫలితంగా పసిడి ధర పెరుగుతుంది.

4. రుతుపవనాలు

గ్రామీణ ప్రాంతాల్లోని డిమాండ్ ద్వారా బంగారం డిమాండ్ ప్రభావితమవుతుంది. భారతదేశంలో అధిక భాగం బంగారం కొనుగోళ్లలో గ్రామీణ మార్కెట్లలో జరుగుతుంది. వార్షిక బంగారం వినియోగంలో 60 శాతం బంగారాన్ని గ్రామీణ భారతదేశమే వినియోగిస్తున్నది. ఇది 800-850 టన్నులు ఉంటుందని అంచనా.

రుతుపవనాలు బాగుండి పంట బాగా పండితే వచ్చిన డబ్బును బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. ఈ బంగారాన్ని రుతుపవనాలు సరిగా రానప్పుడు వాడుకుంటారు.

5. దిగుమతి సుంకం

భారతదేశంలో బంగారం ఉత్పత్తి కాదు. తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిందే. అందువల్ల బంగారం ధరలపై దిగుమతి సుంకం గణనీయమైన ప్రభావం చూపుతుంది.

బంగారం భారతదేశంలో ఉత్పత్తి కానందున విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ధర హెచ్చుతగ్గులపై దిగుమతి టారిఫ్​లు గణనీయ ప్రభావాన్ని చూపుతాయి.

సెంట్రల్ బ్యాంకు బంగారాన్ని కొనుగోలు చేయడం లేదా విక్రయించడంపై తీసుకునే నిర్ణయం ఎక్కువ లావాదేవీల కారణంగా మార్కెట్‌పై ప్రభావం పడవచ్చు.

6. కరెన్సీలో హెచ్చుతగ్గులు

మారకం విలువ లేదా మరొకదానితో పోలిస్తే కరెన్సీ ధర కాలక్రమేణా హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. కొన్నిసార్లు అస్థిరంగా కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్​ విలువ పెరగడంతో బంగారం ధర అమెరికన్ డాలర్ పరంగా పడిపోతుంది.

ఇతర కరెన్సీల్లో బంగారం ఖరీదైనది కాబట్టే ఇలా జరిగింది. మరోవైపు అమెరికన్ డాలర్ విలువ క్షీణించి, వేరే కరెన్సీలతో పోలిస్తే విలువ తగ్గితే అప్పడు బంగారం ధర పెరుగుతుంది. అందుకే చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టే వారు అమెరికన్ డాలర్, కరెన్సీ మారకంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు.

7. ఇతర ఆస్తులతో సంబంధం

సెన్సెక్స్, బంగారం ధరల మధ్య విలోమ సంబంధం ఉంది. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో బుల్ (పెరుగుదల) ధోరణిని గుర్తించినప్పుడు పెరిగే స్టాక్ ధరల నుంచి ప్రయోజనం పొందేందుకు తమ స్టాక్ పెట్టుబడులను పెంచుకునేందుకు చూస్తారు. అప్పుడు బంగారం డిమాండ్ తగ్గుతుంది. తద్వారా బంగారం ధరలు తగ్గుతాయి.

స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు, ఇన్వెస్టర్లు బేర్ (తగ్గుదల) ట్రెండ్ కొంతకాలం కొనసాగుతుందని నమ్మినప్పుడు, వారు తమ అదనపు నిధులను బంగారం వంటి వాటిల్లో పెట్టేందుకు ముందుకొస్తారు. దీనివల్ల బంగారం డిమాండ్, ధరలు పెరుగుతాయి.

8. ముడి చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు చాలా అస్థిరంగా ఉంటుంది. ముడి చమురు ధర తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. అమెరికన్ డాలర్ విలువలో హెచ్చు తగ్గుల కారణంగా బంగారం, ముడి చమురు రెండూ ప్రభావితమవుతాయి. బలహీనమైన డాలర్ ముడి చమురు, బంగారం ధరల పెరుగుదలకు దారితీయవచ్చు.

బంగారం డిమాండ్ మన దేశంలో సంస్కృతి, సంప్రదాయం, అందం, ఆర్థిక భద్రత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. బంగారంలో పెట్టుబడి చాలా ప్రముఖమైంది. ఇదో రివార్డుగా పరిగణించబడుతోంది. గోల్డ్ మెడల్‌తో కూడిన గౌరవం వంటిదన్న మాట.

లేదా ఎక్కువ శాతం హై–ఎండ్ క్రెడిట్ కార్డులపై బంగారపు ట్యాగ్‌ ఉంటుంది. చాలా మందికి బంగారాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యం పొందడం, దాన్ని దాచుకోవడం, తరాలకు అందించడం కూడా అదో గొప్పగా భావిస్తుంటారు. ఇక వివాహాల గురించి మనం ఎలా మరచిపోగలం, చెప్పండి?

పైన పేర్కొన్న విషయాల గురించి ఓసారి ఆలోచించండి. మీ ఆస్తులు రిస్కుకు తగ్గట్టుగా ఉండేలా, పెట్టుబడి వ్యూహానికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. మీరు పెట్టుబడి పెట్టే ముందు బంగారం గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోండి.

మీరు కిందిస్థాయి నుంచి ప్రారంభించాలనుకుంటే, డిజిటల్ గోల్డ్​ను ఎంచుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా సులువుగా అందుబాటులో ఉండటం, ఖర్చు, భద్రత వంటి కారణాలతొో కస్టమర్లు డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు ఒకే క్లిక్‌తో 24 క్యారట్ల బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయొచ్చు.

మీరు యాప్‌లను తెరవడం, ప్రతిసారి డబ్బును పెట్టుబడి పెట్టడం వంటి వాటి జోలికి వెళ్లకూడదనుకుంటే, జార్ యాప్‌లో మీ పెట్టుబడిని ఆటోమేటిక్​గా పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది.

ఆన్‌లైన్ లావాదేవీల నుంచి మీరు చేసిన మార్పుల ఆధారంగా జార్ యాప్ ఆటోమేటిక్‌గా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంది. సురక్షితమైన భవిష్యత్తు కోసం డిజిటల్ గోల్డ్ సంపాదించడంలో మీకు సాయపడుతుంది. మీరు మీ ఖాతా నుంచి ఎంత తీయాలో కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ పెట్టుబడి పెట్టవచ్చు.

వేరే పెట్టుబడుల్లోని రిస్కుల మధ్య కూడా స్థిరత్వం పొందేందుకు మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో డిజిటల్ గోల్డ్‌ను కూడా చేర్చండి. జార్ యాప్​ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.