Buy Gold
Sell Gold
Daily Savings
Digital Gold
Instant Loan
Round-Off
Nek Jewellery
మీ శాలరీ స్లిప్ గురించి మీరు తెలుసుకోవలసిన వాటన్నింటికి గైడ్ – అసలు శాలరీ స్లిప్ ఏమిటి, దానిలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ఇంకా మరెన్నో..
మీ మొదటి శాలరీ స్లిప్ వచ్చిందా? లేదా మీకది ప్రతి నెలా వస్తున్నా అదేంటనేది అర్థం కావట్లేదా? బాధపడకండి, మీకు మేము తోడుగా ఉన్నాము.
శాలరీ స్లిప్ అర్థం కాని భాష, వివరాలతో ఎవరూ పరిష్కరించడానికి ఇష్టపడని పజిల్ లాగా ఉంటుంది.
కానీ, ముందుకు వెళ్లే ముందు పొదుపు చేయడాన్ని అలవాటుగా చేసుకోవడం ఇప్పుడు చాలా సులువు, ఉపయోగకరం అని మీరు తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాము.
ముఖ్యంగా మీరు లోన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు, కొత్త కంపెనీకి అప్లై చేస్తున్నప్పుడు లేదా క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఇది మీకు పిచ్చెక్కిచ్చేస్తుంది.
చాలా మంది ఉద్యోగులు ఇదే సమస్యతో పోరాడుతున్నారు. జార్ ద్వారా మీ కోసం అన్నింటినీ విడమర్చి చెప్పడానికి మేము వచ్చాము.
శాలరీ స్లిప్పునే పేస్లిప్ అని కూడా అంటాము, ఇది ఒక యజమాని తన ఉద్యోగులకు ప్రతి నెలా ఇచ్ఛే చట్టబద్ధమైన డాక్యుమెంట్.
ఇది ఉద్యోగి జీతంలో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయనేది వివరస్తూ ఒక సమగ్ర విభజనను కలిగి ఉంటుంది. ఇందులో ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో కంపెనీ మీకు అదనంగా ఇచ్ఛేవి, మినహాయింపులు, డిడక్షన్లు మొదలైనవి ఉంటాయి.
చాలా వరకు జీతం ఉన్న ఉద్యోగులందరికీ శాలరీ స్లిప్ ఉంటుంది. కొంతమందికి టాంజిబుల్ కాపీ ఇవ్వవచ్చు లేదా దానిని పీడీఎఫ్ ఫార్మాట్‌లో మార్చి వారికి మెయిల్ చేయవచ్చు, కావాలనుకుంటే వాళ్ళు చూసుకోవచ్చు లేదంటే ప్రింట్ చేసుకోవచ్చు.
కంపెనీలు మీ శాలరీ స్లిప్‌ను వివరమైన బ్రేక్‌డౌన్‌తో చేయడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నాయని మీకు తెలుసా? కాబట్టి ఈ పేస్లిప్‌లకి నిజంగానే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకనేది ఇక్కడ మీ కోసం ఇస్తున్నాము:
● ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయిమెంట్: అవును, ఈ డాక్యుమెంట్ చట్టం దృష్టిలో ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయిమెంట్. మీరు వీసా కోసం గానీ వేరువేరు కాలేజీల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కోసం అప్లై చేస్తున్నట్లయితే, వాళ్ళు మీ లేటెస్ట్ శాలరీ జీతం, డిజిగ్నేషన్లను తెలుపుతూ మీ పేస్లిప్ కాపీలను కూడా సమర్పించమని మిమ్మల్ని అడగవచ్చు.
●ఇన్‌కం ట్యాక్స్ ప్లానింగ్: మీ జీతంలో బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ, కన్వేయన్స్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, లీవ్ కన్వేయన్స్ అలవెన్స్ మొదలైన ఎన్నో కాంపోనెంట్స్ ఉంటాయి. వీటన్నింటికీ విడివిడిగా ట్యాక్స్ పడుతుంది. కాబట్టి శాలరీ స్లిప్‌ను ఎలా చదవాలో తెలుసుకోవడం, దానిలోని భాగాలను అర్థం చేసుకోవడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సాధ్యమయ్యే పన్ను మినహాయింపుల ప్రయోజనాలను పొందడంలో ఇది మీకు నిజంగా సహాయపడుతుంది. ఇంకా మీరు మీ పన్నులను సమర్థవంతంగా ప్లాన్ చేయగలుగుతారు.
● లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందేందుకు: బ్యాంకులు మీ శాలరీ పేస్లిప్‌ను (ఎందుకంటే అందులో మీ నెలవారీ ఆదాయం గురించిన మొత్తం సమాచారం ఉంటుంది) మీ అప్పులను తిరిగి మీరు ఎలా చెల్లించగలరో, మీ సామర్థ్యమేమిటో నిర్ణయించడంలో కీలకమైన అంశంగా అడుగుతాయి. కాబట్టి, క్రెడిట్ కార్డ్, లోన్, తనఖా లేదా ఇతర రకాల లోన్ల కోసం అప్లై చేసేటప్పుడు మీ శాలరీ స్లిప్ ఎంతో కీలకమైన డాక్యుమెంట్ అవుతుంది.
● కొత్త ఉద్యోగాన్నివెతుక్కోవడానికి: ఉద్యోగాలు మారేటప్పుడు, అనేక కంపెనీల నుండి తెలివిగా పొజిషన్‌లను ఎంచుకోవడానికి శాలరీ స్లిప్ మీకు సహాయపడుతుంది. ఇది ఉద్యోగాలు మారేటప్పుడు జీతాల కోసం బేరమాడేటప్పుడు కూడా బాగా పనిచేస్తుంది. వాస్తవానికి, కంపెనీలు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో మీ మునుపటి శాలరీ స్లిప్‌ను జతచేయమని మిమ్మల్ని అడుగుతాయి.
● మెరుగైన అవగాహన కోసం: మీ శాలరీ స్లిప్‌లో ఒక విధంగా తప్పనిసరి పొదుపు భాగాలు ఉంటాయి. ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటివి. మీరు ఈ తప్పనిసరి సేవింగ్స్ లో కొన్నింటిని వద్దనుకోవచ్చు. మీ డబ్బును ఎక్కువ లాభాలిచ్చే పెట్టుబడులలో పెట్టవచ్చు. అందువల్ల, శాలరీ స్లిప్ ని దానిలోని భాగాలను అర్థం చేసుకోవడం, మీకోసం మీరు ఎలాంటి పొజిషన్స్ వెతుక్కోవాలో తెలుసుకోవడంలో మీకు సహాయపడవచ్చు.
ఇప్పుడు చాలా కామన్ గా అడిగే ప్రశ్నను చూద్దాం, ఇది చాలా మందికి అయోమయంగా కూడా ఉంటుంది. అదే CTC, ఇన్-హ్యాండ్ శాలరీ.
కంపెనీ ఒక ఉద్యోగికి చెల్లించే మొత్తం సొమ్మును కంపెనీకి అయ్యే ఖర్చు (CTC) గా సూచిస్తారు.
దీనిలో అన్నీ ఉంటాయి - హౌసింగ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ), కన్వేయన్స్ అలవెన్స్, గ్రాట్యుటీ, వైద్య ఖర్చులు, ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్,) ఇంకా అన్ని అలవెన్సులు.
ఇన్-హ్యాండ్ శాలరీ ఏ డిడక్షన్లూ చేయక ముందు ఉద్యోగికి వచ్చే డబ్బు. అయితే, నెట్ పే అంటే డిడక్షన్ల తర్వాత ఉద్యోగికి వచ్చే మొత్తం డబ్బు.
మరో మాటలో చెప్పాలంటే, ఇన్-హ్యాండ్ శాలరీ అనేది ఒక ఉద్యోగికి ఆ కంపెనీ నెలనెలా ఇచ్చే పేమెంట్. ఇందులో పీఎఫ్ గ్రాట్యుటీ ఉండవు.
ఇంకా లోతుగా అధ్యయనం చేసి మీ గ్రాస్ శాలరీని లెక్కగట్టడం నేర్చుకోండి. చివరికి మనం కీలకమైన భాగం దగ్గరకి వచ్చాము.
ప్రతి శాలరీ స్లిప్‌లోనూ కంపెనీ పేరు, ఉద్యోగి పేరు, డిజిగ్నేషన్, ఎంప్లాయి కోడ్ తదితర పలు వివరాలు ఉంటాయి.
ఆ తర్వాత ఇన్‌కం లేదా ఎర్నింగ్స్, డిడక్షన్లు ఉంటాయి, ఇవి శాలరీలోని రెండు ప్రధాన కాంపోనెంట్లు. ఆ పదాల అర్థాలు:
బేసిక్ కాంపన్సేషన్: ఇది మీ జీతంలో అత్యంత ముఖ్యమైన భాగం, మీకొచ్చే మొత్తం పేమెంట్‌లో 35 నుండి 40% వరకు ఉంటుంది. ఇది జీతంలోని ఇతర అంశాలను లెక్కించడానికి పునాదిగా కూడా పనిచేస్తుంది.
జూనియర్ స్థాయిలలో ఉన్నప్పుడు బేసిక్ కాంపన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. కంపెనీలో మీరు ఎదిగేకొద్దీ, మిగతా అలవెన్సులు పెరుగుతాయి.
డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ): ఇది ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలను తగ్గించడంలో సహాయపడటానికి మీకు జీతంలో ఇచ్చే ఒక భాగం. దీనికి ట్యాక్స్ ఖచ్చితంగా పడుతుంది. ఐటీ రిటర్నుల దాఖలు చేసేటప్పుడు తప్పనిసరిగా దీన్ని ప్రకటించాలి.
హౌసింగ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ): ఇది ఇంటి అద్దె కట్టడం కోసం ఇచ్చే అలవెన్స్. హెచ్ఆర్ఏ ఎంత ఉంటుంది అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఇది ఉద్యోగి మూల వేతనంలో 40 నుండి 50 శాతం వరకు ఉంటుంది. హెచ్ఆర్ఏ మీకు పన్ను డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. మినహాయింపులలో తప్పనిసరిగా కింది వాటిలో కనీసం ఏదో ఒకటి ఉండాలి:
1.ఏడాదికి కట్టే అద్దె, మైనస్ 10% (బేసిక్ + డీఏ).
2. పొందిన అసలు హెచ్ఆర్ఏ
3. మీరు ఉండే ప్రాంతం (ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) అయితే 50% (బేసిక్ + డియర్‌నెస్ అలవెన్స్). అదే మీరు మరో నగరంలో ఉంటున్నట్లయితే 40% (బేసిక్ + డియర్‌నెస్ అలవెన్స్)
కన్వేయన్స్ అలవెన్స్: ఒక ఉద్యోగికి వెళ్ళడానికి, రావడానికి ఎంప్లాయర్ చెల్లించే డబ్బును కన్వేయన్స్ అలవెన్స్ అంటారు. ఇది ఒక రాయితీ లాంటిది.
ఫలితంగా, ఇది ఒక స్థాయి వరకు ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. కన్వేయన్స్ అలవెన్స్ కూడా ట్యాక్స్ డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయపడవచ్చు.
మినహాయింపులో తప్పనిసరిగా కింది వాటిలో కనీసం ఒకటి ఉండాలి:
1. నెలవారీ ఆదాయం రూ. 1600
2. పొందిన అసలు కన్వేయన్స్ అలవెన్స్
పర్ఫార్మెన్స్ అలవెన్స్, స్పెషల్ అలవెన్సులు: ఉద్యోగులు బాగా పనిచేయడం కోసం వారికి పర్ఫార్మెన్స్ అలవెన్స్, స్పెషల్ అలవెన్సులు ఇస్తారు. దీనికి కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది.
ఇతర అలవెన్సులు: ఈ కేటగిరీలో కారణంతో సంబంధం లేకుండా ఎంప్లాయర్ ఇచ్చే అన్ని అదనపు అలవెన్సులు ఉంటాయి. అటువంటి అలవెన్సులకు ఏదైనా పేరు ఉండవచ్చు లేదా "ఇతర అలవెన్సులు"గా కూడా చూపవచ్చు.
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్): ఇది మీ పే చెక్ నుండి ఖచ్చితంగా జరిగే డిడక్షన్. మీరు పదవీ విరమణ పొందేనాటి కోసం ఇప్పటి నుంచే దాచే డబ్బు. మీ పే స్లిప్‌లో మీ మూల వేతనంలో కనీసం 12% ఉన్నట్టు ఉంటుంది. ఇది ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. ముఖ్యంగా, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ని బట్టి, ఈపీఎఫ్ పేమెంట్‌కు పన్ను వర్తించదు.
ప్రొఫెషనల్ ట్యాక్స్: జీతం పొందే కార్మికులు, నిపుణులు, వ్యాపారులతో సహా ఆదాయం ఉన్న వాళ్ళందరికీ ఇది విధించబడుతుంది. అయితే, ఇది కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, కేరళ, మేఘాలయ, ఒరిస్సా, త్రిపుర, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉంది. ఈ డబ్బును మీ ట్యాక్సబుల్ అమౌంట్ నుండి తీసుకుంటారు. దీనికోసం ప్రతీ నెలా మీరు చెల్లించేది కొన్ని వందల రూపాయలు మాత్రమే. దీనితో ఆ వ్యక్తి ట్యాక్స్ బ్రాకెట్ ఏంటో తెలుస్తుంది.
టీడీఎస్ (ట్యాక్స్ డిడిక్టెడ్ ఎట్ సోర్స్): టీడీఎస్ అనేది ఆదాయపన్ను శాఖ తరఫున మీ యజమాని డిడక్ట్ చేసే పన్ను మొత్తం. ఇది ఆ ఉద్యోగి యొక్క గ్రాస్ ట్యాక్స్ బ్రాకెట్ ద్వారా నిర్ణయించబడుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ELSS), పీపీఎఫ్, ఎన్పీఎస్, పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి పన్ను వర్తించని వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీ యజమానికి అవసరమైన పేపర్లను ఇవ్వడం ద్వారా ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు.
ఇది మీ శాలరీ స్లిప్‌కి మీ మినీ-గైడ్. ఈసారి మీకు మీ కంపెనీ పే స్లిప్ వచ్చినప్పుడు, మీరేం చేయాలో మీకు తెలుసు. దీన్ని చదవండి, అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా ట్యాక్స్ ఆదా ఎలా చేయగలరో చెక్ చేసుకోండి.
ఇప్పుడు, మీరు పే స్లిప్ లోని అన్ని అంశాలను అర్థం చేసుకున్నాక, మీ సేవింగ్ ప్లాన్‌లతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. మీరు జార్ యాప్‌ని ఉపయోగించి ఖర్చు చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ఆదా చేసుకోవచ్చు, ఇది మీకు డబ్బును ఆదా చేయడంలో సహాయపడటమే కాకుండా డిజిటల్ గోల్డ్‌లో కూడా పెట్టుబడి పెడుతుంది.