గమనించండి: డిజిటల్ గోల్డ్ ఎలా అభివృద్ధి చెందుతోందో, దానితో ఏమి చేయాలో.. – జార్

Author Team Jar
Date Apr 21, 2023
Read Time Calculating...
గమనించండి: డిజిటల్ గోల్డ్ ఎలా అభివృద్ధి చెందుతోందో, దానితో ఏమి చేయాలో.. – జార్

ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం.

‘‘రామన్, 1950లలో నివసించిన ఒక ధనవంతుడు. అతని దగ్గర చాలా బంగారం ఉండేది. అతను దానిని తన మంచం కింద దాచేవాడు.

తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి తనకు కావాల్సిన వస్తువులు, ఏదైనా పనులను చేయించుకునేవాడు. ఒకరోజు తన బంగారం దొంగిలించబడినదని గుర్తించి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు.

అతని కొడుకు రతన్, 1980లో చాలా బంగారాన్ని సంపాదించాడు. కానీ దానిని పోగొట్టుకుంటానేమో అన్న భయంతోనే ఉండేవాడు.

అందుకే అతను గోల్డ్ లోన్ తీసుకుని బ్యాంకులో భద్రపరిచాడు. బంగారం భద్రంగానే ఉంది. కానీ వడ్డీతో కలిపి బ్యాంకు సొమ్మును తిరిగి చెల్లించడం అతనికి కష్టంగా మారింది.

రామన్ మనవడు రాకేష్, ఇతను 2010లో చాలా డబ్బును సంపాదించాడు. 

అతను తన తండ్రి, తాత లాగా డబ్బును పోగొట్టుకోకూడదని అనుకున్నాడు, అందుకే అతను డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేశాడు. బంగారం ధర పెరిగేవరకు ఎదురు చూశాడు.

దాన్ని అమ్మేసి చాలా లాభాలు గడించాడు.”

కాబట్టి మీరు గమనించే ఉంటారు, మారుతున్న సమయంతో పాటు పొదుపు చేసే పద్ధతులు కూడా మారుతున్నాయి. ఈ మూడు సందర్భాలలో కాలక్రమేణా ప్రతీ ఒక్కరు తమ పాఠాలు నేర్చుకొని తమ మార్గాలను ఎలా మార్చుకున్నారో మనం చూడవచ్చు.

పెద్దలు తప్పుల నుండి నేర్చుకోమన్నారు. అందుకని తప్పులన్నీ మనమే చేయనక్కరలేదు, ఇతరుల నుండి కూడా నేర్చుకోవాలి. కాబట్టి మనం ఆ పని చేయాల్సిన సమయం వచ్చింది. 

మనం కాలంతో పాటు పరిణామం చెందుతున్నప్పుడు, ఇంకా 1900 కాలం నాటి ఆలోచనలనే ఎందుకు అంటిపెట్టుకొని ఉండాలి? డిజిటల్‌ వైపు అడుగులు వేయండి. అందులో పెట్టుబడి పెట్టండి. మీరు నమ్మినా నమ్మకపోయినా..

డిజిటల్ గోల్డ్ అభివృద్ధి చెందుతుంది!

అది కూడా చాలా వేగంగా. బ్లాక్‌చెయిన్ సమయంలో, అసలు బంగారాన్ని క్లెయిమ్ చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారిస్తూ, నేరుగా బంగారంపై పెట్టుబడి పెట్టే అవకాశంగా డిజిటల్ గోల్డ్‌ నిలిచింది. ఈరోజు 10 కోట్లకు పైగా మంది వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌ను కలిగి ఉన్నారు.

డిజిటల్ గోల్డ్‌ అంటే ఏమిటి?

డిజిటల్ గోల్డ్, సులభంగా చెప్పాలంటే, ఆన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే ఆధునిక యుగపు కొత్త పద్ధతి.

ఇది రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులూ అందుబాటులో ఉంటుంది. దీనిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్యాలయం, నివాసం లేదా మరి ఎక్కడినుంచైనా యాక్సెస్ చేయవచ్చు, కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు, ఇంకా రీడీమ్ చేయవచ్చు.

డిజిటల్ గోల్డ్ అనేది క్రిప్టో-కరెన్సీ వంటి బ్లాక్‌చెయిన్ ఆధారిత అధునాతన టోకెన్ టెక్నాలజీ.

అయితే, క్రిప్టో కరెన్సీలా కాకుండా, ఈ టోకెన్ నిజమైన విలువతో పాటు అదే మొత్తంలో నిజమైన బంగారు నిల్వలను కలిగి ఉంటుంది.

"నకిలీ" డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసే అవకాశమే లేదు.

డిజిటల్ గోల్డ్ విషయంలో ఏం చేయాలి?

దానికి సరైన సమాధానం, పెట్టుబడి పెట్టడమే.

ఎందుకు?

  • కల్తీతో ఉండే అసలు బంగారం లాగా కాకుండా డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు 24 క్యారెట్ల బంగారంలో చేయబడతాయి.
  • డిజిటల్ గోల్డ్ ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్‌లో పూర్తిగా పారదర్శకమైన మార్కెట్ ధరలకు బంగారం కొనుగోలు, విక్రయం సులభం అవుతుంది.
  • ధర పరంగా డిజిటల్ గోల్డ్ ఇతర రకాల బంగారం కంటే భిన్నంగా ఉంటుంది. ఒకసారి 3% జీఎస్టీ మినహా పునరావృతమయ్యే వార్షిక ఛార్జీలు ఉండవు.
  • అంతేకాకుండా, డిజిటల్ గోల్డ్‌తో, మీరు ₹1తో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు; ఇది సులభమైన పెట్టుబడి ప్రణాళికగా మాత్రమే కాకుండా సులభమైన పొదుపు ప్రణాళికగా కూడా కనిపిస్తుంది.

బంగారాన్ని భౌతిక రూపంలో కలిగి ఉండటం వల్ల కలిగే నష్టాలు

  • సాదరణంగా భౌతిక రూపంలోని బంగారాన్ని 1 గ్రాము (దాదాపు ₹4,500కి సమానం) నుంచి ప్రారంభించి వస్తువు రూపంలో కొనుగోలు చేస్తారు. కానీ డిజిటల్ గోల్డ్​ను రూ. 1 నుంచి కొనుగోలు చేయవచ్చు. 

  • ఇంకా, రత్నాలు, డిజైన్లు వంటివి అధిక తయారీ ఖర్చులతో ఉంటాయి, వీటిని దొంగిలిస్తారేమో అనే భయం కూడా ఉంటుంది. 

  • భౌతిక రూపంలోని బంగారాన్ని అమ్మాలి అంటే మనం కంసాలి వద్దకు వెళ్ళాలి. కానీ డిజిటల్ గోల్డ్​ను ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఆ వెంటనే మీ అకౌంట్‌కు బ్యాలెన్స్‌ జమ చేయబడుతుంది. 

  • మీకు కావలసిందల్లా ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్, యూపీఐ లేదా బ్యాంక్ అకౌంట్ అంతే. ఇది కొన్ని ఇతర వస్తువుల కోసం వెబ్‌లో షాపింగ్ చేసినంత సులభంగా ఉంటుంది.

  • భౌతిక రూపంలోని బంగారాన్ని కొనుగోలు చేసే ముందు, కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. దాని కోసం చాలా పేపర్ వర్క్ చేయవలసి ఉంది. అయితే డిజిటల్ గోల్డ్ అనేది ఈ రోజుల్లో ప్రజలలో బాగా అభివృద్ధి చెందుతున్న విధానం. ఎందుకంటే పొదుపు చేసి పెట్టుబడి పెట్టడానికి ఇది సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గం. అంతేకాదు, ఇది సురక్షితమైన, బీమా చేయబడిన బంగారం.

భౌతిక రూపంలోని బంగారం, డిజిటల్ గోల్డ్ మధ్య వ్యత్యాసం గురించి ఇక్కడ మరింత చదవండి.

ముగింపు 

ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారం ఒక దృఢమైన రక్షణను ఇస్తుందని అనేక సందర్భాలలో మనం గమనించాం.

వాస్తవానికి ద్రవ్యోల్బణం సమయంలో బంగారం ధరలు ప్రభావితం కాలేదు. అందువల్ల, ద్రవ్యోల్బణంలో, గ్లోబల్ మార్కెట్‌లో డబ్బు రేట్లు తగ్గినప్పుడు మీరు నష్టానికి గురికావాల్సిన అవసరం ఉండదు.

మార్కెట్ పరిస్థితి అనిశ్చితిగా ఉన్నప్పుడు, బంగారం ఖచ్చితంగా నిలదొక్కుకోగలదు అని భావిస్తారు. ఎందుకంటే మీ పోర్ట్‌ఫోలియోకు బంగారాన్ని జోడించడం వలన కొన్ని ఇతర ఆస్తుల విలువ సున్నా నుండి తక్కువ పడిపోయినా మీ మొత్తం పోర్ట్​ఫోలియోలో నష్టపోయే రిస్కు తగ్గుతుందని నిపుణులు అంగీకరించారు.

వేగంగా పరుగెత్తే ప్రపంచంలో, ఎక్కడైతే ఎవరూ ఊపిరి పీల్చుకోలేని లేదా ఎవరికీ విరామం ఇవ్వని, రెప్పపాటుతో ట్రెండ్లు మారే చోట, ముఖ్యంగా మార్కెట్లు ఎవరికీ చెందని, ఎవరి మాట వినని చోట, మాకు భరోసా, భద్రత, స్థిరత్వం అవసరం. అది డిజిటల్ గోల్డ్‌తోనే సాధ్యం. 

డిజిటల్ గోల్డ్ చుట్టూ ఇంత ఆసక్తి ఎందుకు ఉందో తెలుసుకోండి.

ఇంకా మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? ఇప్పుడే జార్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, కేవలం రూ. 1 నుంచి ఈరోజే డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.

Team Jar

Author

Team Jar

ChangeJar is a platform that helps you save money and invest in gold.

download-nudge

Save Money In Digital Gold

Join 4 Cr+ Indians on Jar, India’s Most Trusted Savings App.

Download App Now