Playstore Icon
Download Jar App
Financial Education

మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు 7 గోల్డెన్ టిప్స్

December 28, 2022

మహిళలారా.. ఈ 7 ఆర్థిక చిట్కాలతో మీ ఆర్థిక ప్రయాణాన్ని సులభం చేసుకోండి. వాటి అవసరాన్ని గ్రహించండి.

మీరు ఇంటిపట్టునే ఉండే గృహిణి అయినా లేదా ఉద్యోగం చేసే మహిళ అయినా కానీ మీకు ఆర్థిక ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉండాలి.

ఇది ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరం.

మీ ఆర్థిక స్థితి సక్రమంగా ఉంటే మీకు అత్యంత ఇష్టమయిన వారిని జాగ్రత్తగా చూసుకోవచ్చు. మీ ఇష్టాఇష్టాలను నెరవేర్చుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది.

స్త్రీలకు ఆర్థిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ఇప్పటికీ అనేకమంది మహిళలు... ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు వారి తండ్రులు లేదా భర్తల మీద ఆధారపడుతున్నారు.

అందుకే మొదట ఆర్థిక పరిజ్ఞానం గురించి అర్థం చేసుకోండి.

మహిళలు ఎందుకు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండాలి?

 

సరే వారు ఎందుకు చేయకూడదు? యువకులు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి. ఎందుకంటే వారు అన్నీ సాధించగలరు.

స్త్రీలకు కూడా ఇది చాలా అవసరం.. ఎందుకంటే..

 

●     స్త్రీలకు పురుషుల కంటే చాలా తక్కువగా జీతాలు వస్తాయి.

 

పురుషులు, మహిళల మధ్య ఆదాయ వ్యత్యాసాలు ఉన్నాయి. మహిళలు తమ సహోద్యోగులైన పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు.

వారి ఆదాయాలు పురుషుల కంటే తక్కువగా ఉంటాయి. వారి పొదుపు కూడా తక్కువగానే ఉంటోంది.

 

●     పిల్లలు, కుటుంబ బాధ్యతలు వారి కెరీర్​కు అంతరాయం కలిగించవచ్చు.

 

క్వార్డ్జ్ నివేదిక ప్రకారం.. పిల్లలు, కుటుంబ భాద్యతలు నెరవేర్చేందుకు ఉద్యోగాలు వదిలిపెట్టిన దాదాపు 70 శాతం మంది భారతీయ మహిళలు తిరిగి ఉద్యోగాలు పొందేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలిసింది.

 

●     మహిళలకు ఆర్థిక అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది.

 

మహిళలకు ఆర్థిక పరిజ్ఞానం చాలా తక్కువగా ఉండటం వలన వారికి ఆర్థిక అంశాల మీద పట్టు తక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగం చేసేందుకు కూడా తక్కువ మంది మహిళలు మాత్రమే కోర్సులు చేస్తారు.

 

●     పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ రోజులు జీవిస్తారు.

 

స్త్రీల సగటు జీవిత కాలం పురుషుల కంటే 8 శాతం ఎక్కువ.

మహిళలు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో సొంత నిర్ణయాలను తీసుకుంటూ ఆర్థిక ప్రణాళికలను చక్కబెడుతూ ఉంటారు. ఎక్కువగా మహిళల ఇంట్లో మగవారు మరణించిన తర్వాత ఇది సంభవిస్తూ ఉంటుంది.

 

దీనికి పరిష్కారం ఏమిటి?

 

మీరు ఆర్థికంగా స్వతంత్రులు కావడానికి 7 మార్గాలు:

 

1. మీకు వీలైనంత వరకు సొంతంగానే నేర్చుకోండి...

 

మనీ మేనేజ్​మెంట్, పెట్టుబడుల గురించి తెలుసుకునేందుకు సమయం వెచ్చించండి.

పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల గురించి మహిళలు చాలా తక్కువగా ఆలోచిస్తారు. పురుషుల కంటే చాలా తక్కువ ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉంటారు. ఇవన్నీ వారిపై వారికి నమ్మకం లేకపోవడం వలన కలుగుతాయి.

అలా పొదుపు చేయని వారిలో మీరు కూడా ఒకరైతే మీకు మీరే చెప్పుకోవడం వలన పెట్టుబడులను త్వరగా ప్రారంభించవచ్చు.

ఇందుకోసం పుస్తకాలు, వ్యాసాలను చదవండి. ఇంటర్​నెట్​లో శోధించండి. మీ బ్యాంకు లేదా ఎన్జీవోల ద్వారా అందిచబడుతున్న ఉచిత ఆర్థిక శిక్షణా కార్యక్రమాలను గురించి తెలుసుకోండి.

మీరు ఆర్థిక అక్షరాస్యతను మెరుగు పరుచుకునేందుకు సోషల్ మీడియాలో కూడా చేరవచ్చు. అక్కడ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్​కు సంబంధించిన అనేక గ్రూపులు ఉంటాయి.

ఆర్థిక విషయాలను నేర్చుకునేటప్పుడు మీరు ఎటువంటి గందరగోళానికి గురైనా కానీ ఆర్థిక నిపుణుడి సలహాను తీసుకోవాలి.

2. జీవితాన్ని మార్చే సంఘటనల కోసం సిద్ధంగా ఉండండి..

ఎక్కువ మంది మహిళలు విషయాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నప్పటికీ డబ్బు విషయానికి వచ్చే సరికి పురుషులకు ఉన్న ఆత్మస్థైర్యం స్థాయులు మహిళల్లో తక్కువగా కనిపిస్తాయి.

మహిళలు తరుచూ తమ జీవితాన్ని మార్చేసే సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటారు. వారు ఆ మార్పుల కోసం సంసిద్ధంగా ఉండరు. మార్పు అనివార్యమని తెలిసినప్పుడు దానికోసం ముందుగా సిద్ధమై ఉండటం చాలా ముఖ్యం.

పెళ్లి తర్వాత జరిగే అవకాశం ఉన్న అనేక సందర్భాలను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఉదా.. కుటుంబాన్ని ప్రారంభించడం, ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకోవడం, పిల్లలను దత్తత తీసుకోవడం, ఒంటరి తల్లిగా జీవించడం, విడాకులు తీసుకోవడం, కెరీర్​ను కోల్పోవడం వంటివి..

మీకు అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చే భర్త దొరికినప్పటికీ ఆర్థిక విషయాలు క్లిష్టం కావొచ్చు. అటువంటి సందర్భాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోవడం అవసరం.

3. పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి

డబ్బును ఆదా చేయడం చాలా గొప్ప విషయం. కానీ పెట్టుబడులు పెట్టకుండా డబ్బును ఆదా చేయడం ప్రతీసారి ఉత్తమం కాకపోవచ్చు.

రోజురోజుకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా మీరు పొదుపు చేసిన దాని విలువ తగ్గే అవకాశం ఉంటుంది.

వస్తువులు మరింత ఖరీదైనవి అయితే, మీ ఆదాయం ద్రవ్యోల్బణంతో పాటుగా పెరగకపోతే మీరు కొనుగోలు శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.

పెట్టుబడులు అనేవి ద్రవ్యోల్బణాన్ని నిరోధించడంలో సహాయం చేస్తాయి. పొదుపులు అనేవి క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఇవి స్థిరమైన ఆదాయాన్ని మీకు అందిస్తాయి.

చాలామంది మహిళలకు ఈ విషయం గురించి తెలుసు. కానీ పూర్తిస్థాయి డివిడెండ్ల గురించి వారికి అంతగా అవగాహన లేదు.

అంతేకాకుండా కొంత మందికి సరిగ్గా పెట్టుబడి పెట్టే సామర్థ్యం గురించి కూడా పెద్దగా తెలియదు.

ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. పెట్టుబడుల విషయానికి వస్తే స్త్రీలు కూడా మగవారిలాగే చాలా సమర్థవంతంగా ఉంటారు. వారి అంచనాలు ఎక్కువ నిజమవుతాయి. కావున అటువైపుగా ఆలోచించండి.

4. మీ ఖర్చులను లెక్క వేయండి.. బడ్జెట్​ను రూపొందించండి..

బడ్జెట్​ను రూపొందించడం అనేది మంచి ఆర్థిక వ్యూహానికి మొదటి అడుగు.

నెలవారీగా కిరాణా సామగ్రి, బిల్లులు, నిత్యావసరాలు, స్కూలు ఫీజులు, అద్దె వంటి అవసరాలకు ఎంత డబ్బు అవసరమో ఒకసారి చూసుకోండి. క్రితం నెలల్లో వీటికి ఎంత ఖర్చయిందో చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

నెలవారీ కాస్ట్ షీట్​ను రూపొందించి, దాని ప్రకారమే ఖర్చు చేయడం అలవాటు చేసుకోండి.

మీ అవసరాలను బట్టి మీకు మిగిలిన డబ్బును అత్యవసర నిధి, ట్రావెల్​ ఫండ్, సేవింగ్స్​గా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి.

మీ బడ్జెట్​ను ఎల్లప్పుడూ ట్రాక్ చేస్తూ ఉండండి. మీ ఖర్చులు మించిపోతున్నాయో లేదో చూసుకుంటూ ఉండండి.

అవసరమైన ఖర్చులను ప్రతి రోజు సర్దుబాటు చేసుకోవడం వలన నెలాఖరుకు వచ్చేసరికి మీరు 15 శాతం డబ్బును సులభంగా ఆదా చేయగలుగుతారు.

5. ఆదా చేయడం, అత్యవసర నిధులను ఏర్పాటు చేసుకోవడం, క్రెడిట్​ ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించండి..

మీ నెలవారీ బడ్జెట్​ను రూపొందించేటప్పుడు పొదుపు కోసం ప్రత్యేక అమౌంట్​ను పక్కన పెట్టండి.

3 నుంచి 6 నెలల వరకు అత్యవసరాలకు సరిపడే మొత్తాన్ని సమకూర్చుకోవాలని చాలామంది ఆర్థిక నిపుణులు సిఫారసు చేస్తారు.

ఆర్థిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగాన్ని కోల్పోవడం, కుటుంబ అత్యవసర అవసరాల వంటి సందర్భాల్లో ఈ నిధులు మీకు ఉపయోగపడతాయి.

క్రెడిట్​ను నిర్మించుకోవడం అనేది మీ ఆర్థిక స్థితి, క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకునేందుకు ఉన్న అవకాశం.

మీరు మీ క్రెడిట్ కార్డు మొత్తాలను నెలవారీగా చెల్లించడంతో ప్రారంభించవచ్చు.

6. మీ కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బును పక్కన పెట్టండి..

మీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక సహాయం అవసరమైతే మీరు చేయాల్సిన సహాయం మొత్తం చేస్తారు. అవునా? కాదా? మీ రిటైర్​మెంట్ సేవింగ్స్​ను కూడా ఖర్చు చేసేందుకు వెనుకాడరు.

మీరు లాంగ్​ టర్మ్ కోసం త్వరలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. తర్వాతి రోజుల్లో మీరు అధికంగా డబ్బులను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

మీరు పెట్టుబడులను ముందుగానే ఉపయోగించుకుంటే.. వచ్చే అన్ని ప్రయోజనాలను కోల్పోతారు. అది మీకు ఎప్పటికీ మంచిది కాదు.

మీ రిటైర్​మెంట్ సేవింగ్స్​ను ఖర్చు పెట్టే బదులు... కొంత నిధిని కుటుంబ అవసరాల కోసం పక్కకు పెట్టుకోండి. అత్యవసరాల కోసం మీ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎటువంటి అంతరాయం కలిగించకండి.

7. పదవీ విరమణ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం స్త్రీలు పురుషుల కంటే సగటున 6 నుంచి 8 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తున్నారు.

కానీ కొన్ని సందర్భాలలో స్త్రీలు పురుషుల కంటే తక్కువ పొదుపు చేస్తూ ఉంటారు.

మీరు పదవీ విరమణ పొందిన తర్వాత జీవితాన్ని ఆనందంగా గడపడం కోసం పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. మీ అన్ని అవసరాలను తీర్చే ప్లాన్ కోసం ఆలోచించండి.

పెట్టుబడుల విషయంలో మీ పిల్లలతో సహా ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి. మీ పిల్లలు సహాయం చేస్తే చాలా బాగుంటుంది. కానీ వారు సహాయం చేయకపోయినా మీ వద్ద మరో ప్లాన్ ఉందనే విషయం మర్చిపోకండి.

వెంటనే మీ ఇంటిని, విలువైన వస్తువులను మీ పిల్లలకు ఇవ్వకండి. మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని మీ పిల్లలకు ఇవ్వవచ్చనే విషయం గుర్తుంచుకోండి.

మీ పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు ఇప్పటి నుంచే నెలవారీగా పొదుపు చేయడం ప్రారంభించండి.

ఇది రాబోయే 40 ఏళ్ల పాటు మిమ్మల్ని ఆర్థికంగా బలంగా ఉండేలా చేస్తుంది. మీకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.

మహిళలు స్వతంత్రంగా జీవిస్తున్నా, లేదా జీవిత భాగస్వామితో కలిసి జీవిస్తున్నా కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్​లో చాలా చురుగ్గా పాల్గొనాలి.

సంప్రదాయ ఆలోచనలకు విరుద్ధంగా వారు... సొంత ఆర్థిక ఆర్థిక ప్రణాళికతో నమ్మశక్యం కాకుండా వ్యవహరిస్తుంటారు.

మీరు ఇంకా నమ్మడం లేదా? మీ కుటుంబ ఖర్చుల కోసం మీ అమ్మ బడ్జెట్ ప్లాన్ చేయడం ఎప్పుడైనా చూశారా? అవి చిన్న అవసరాలైనా? లేక పెద్ద అవసరాలైనా అన్ని ఖర్చులను నిర్వహించడం ముఖ్యం.

ప్లానింగ్, అమలు చేసే విధానం చాలా బాగుంటుంది. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ కలగకుండా ఉండేందుకు వెంటనే ఈ ఆర్థిక చిట్కాలను అమలు చేయడం ప్రారంభించండి.

 

 

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.