Playstore Icon
Download Jar App
Personal Finance

పోర్ట్​ఫోలియోలో వైవిధ్యతే మీకు కావాల్సింది. మీ పోర్ట్​ఫోలియోను ఎలా వైవిధ్యభరితం చేసుకోవాలి?

December 28, 2022

ఎవరికైనా తమ పోర్ట్​ఫోలియో వైవిధ్యభరితంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ పోర్ట్​ఫోలియో వైవిధ్యానికి ఫార్ములా తెలుసా? ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.


పెట్టుబడిలో వైవిధ్యత అంటే ఏమిటి? మీ పోర్ట్​ఫోలియోను ఎలా వైవిధ్యభరితం చేయాలి?  

మీ డబ్బు అంతా ఒకేచోట పెట్టుబడి పెట్టడం సరైన పద్ధతి కానే కాదు. కాబట్టి పెట్టుబడుల విషయంలో వైవిధ్యం అవసరం.

మీరు మీ డబ్బు అంతా ఒకేచోట పెట్టుబడిగా పెట్టినట్లు అయితే ఆ షేరు బాగా కొనసాగినంత కాలం అంతా బాగానే ఉంటుంది.

కానీ మార్కెట్ ఒక్కసారిగా పడిపోతే.. మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది సరైన పద్ధతి కాదు.

మీ పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగేందుకు మీరు మీ పెట్టుబడులను వివిధ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మీ ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది.

ఇలా చేయడం వలన మీరు ఏ ఒక్క పెట్టుబడి వలన కూడా నష్టపోరు. దీని వలన మీ రాబడి తగ్గకుండా ఉంటుంది. కానీ రిస్క్ అనేది తగ్గుతుంది.

ఈ రేసులో ఎవరు గెలుస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి ఎక్కువ మంది మీద పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.


పెట్టుబడిలో వైవిధ్యత అంటే ఏమిటి?

సులభమైన మాటల్లో చెప్పాలంటే.. వైవిధ్యత అనేది కాలక్రమేణా ఒకే మార్కెట్ లేదా ఆర్థిక సంఘటనకు భిన్నంగా స్పందించే విభిన్న పెట్టుబడుల పోర్ట్​ఫోలియో.

విభిన్న స్టాకుల పోర్ట్​ఫోలియోలో 20-30 (లేదా ఎక్కువగా) భిన్నమైన స్టాకులు వివిధ ఇండస్ట్రీలు, బాండ్​లు, ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారం, ఎఫ్​డీలు, సేవింగ్స్ అకౌంట్స్ ఇలా ఉంటాయి.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నపుడు కానీ, నష్టాల్లో నడుస్తున్నపుడు కానీ ఒక్కో షేర్ ఒక్కోలా ప్రవర్తిస్తుంది. ప్రతి ఒక్కటి లాభ నష్టాల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

 

స్టాకులు – దీర్ఘకాలిక వృద్ధి కోసం ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కానీ స్వల్పకాలానికి మాత్రం అంతగా ప్రయోజనాలు అందించకపోవచ్చు.

బాండ్​లు – బాండ్ల వలన స్థిరమైన రాబడి వస్తుంది. వీటితో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కానీ వడ్డీ రేట్లలో అసమానతల వలన వీటి విలువ హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది.

ఫండ్స్ – వివిధ రకాల పెట్టుబడులు ఇందులో ఉంటాయి. కాబట్టి చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఫండ్ ఎలా మేనేజ్ చేయబడిందనే ఆంశం మీద ఆధారపడి స్థూలంగా లేదా సూక్ష్మంగా వైవిధ్యభరితం చేయబడతాయి.

రియల్ ఎస్టేట్ – ఇది ఆదాయ వనరుగా ఉన్నపుడు కాలక్రమేణా రాబడులను అందిస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇందులో కమీషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఎఫ్​డీలు, సేవింగ్స్ అకౌంట్లు – వీటి విలువలో ఎటువంటి మార్పు లేకపోయినా.. వడ్డీ రేటు, ఇతర కారణాల వలన కాలక్రమేణా మారుతూ ఉంటాయి.

బంగారం – మీ పోర్ట్​ఫోలియోలో కనీసం 5 నుంచి 15 శాతం వరకు బంగారం కలిగి ఉండాలని చాలా మంది నిపుణులు సూచిస్తారు. బంగారం మీద పెట్టుబడి అనేది చాలా సురక్షితమైనది. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో కూడా ఇది సురక్షితంగానే ఉంటుంది. బంగారం దీర్ఘకాలానికి ఒక సురక్షితమైన పెట్టుబడి.

పైన పేర్కొన్న వాటిలో కలిపి మీరు పెట్టుబడులు పెట్టడం వలన మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నపుడు మీరు అధిక నష్టాలకు గురయ్యే ప్రమాదాలను తగ్గించుకోగలుగుతారు. కాబట్టి పెట్టుబడులను ఇలా విభజించుకోవడం చాలా మంచిది.


పోర్ట్​ఫోలియోను వైవిధ్యభరితం చేయడం వలన ప్రయోజనాలు

పోర్ట్​ఫోలియోను వైవిధ్యభరితం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ సందర్భాల్లో వివిధ రకాల పెట్టుబడులు వేర్వేరుగా వ్యవహరించడం వలన మీరు ఎల్లప్పుడూ అత్యుత్తమ ఫలితాలనే పొందుతారు.

ఒకవేళ ఈక్విటీలు ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, బాండ్లు లాభాలను తీసుకురావొచ్చు. అదేవిధంగా బంగారం, ఎఫ్​డీలు కాలక్రమేణా పెరుగుతూనే ఉంటాయి.

కాబట్టి మీ పోర్ట్​ఫోలియోలో వివిధ రకాల పెట్టుబడులను కలిగి ఉండటం వలన సగటున మీకు ఎక్కువగా లాభాలు వస్తూ ఉంటాయి.

మీరు కేవలం ఒకే ఒక స్టాక్​లో పెట్టుబడి పెట్టడం వలన అధిక లాభాలను పొందలేరు. ఆ స్టాక్ హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. కావున మీరు అప్పుడప్పుడూ నష్టపోవడం జరగవచ్చు.

పెట్టుబడుల రిస్కును తగ్గించే పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి..

●     ఇలా చేయడం వలన మీ రాబడి పెరుగుతుంది. మీ ఫలితాలను మీరు స్థిరంగా ఉంచుకోవచ్చు.

●     మార్కెట్ ఒడిదుడుకుల వచ్చే రిస్కును ఇది తగ్గిస్తుంది.

●     పోర్ట్​ఫోలియోను పర్యవేక్షించే సమయాన్ని తగ్గిస్తుంది.

●     వివిధ రకాల పెట్టుబడి సాధనాల వలన కలిగే ప్రయోజనాలను మీకు అందిస్తుంది.

●     ఇది దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.

●     చక్రవడ్డీ వలన కలిగే ప్రయోజనాలను అందజేస్తుంది.

●     ఇది మీ పెట్టుబడులను చాలా సురక్షితంగా ఉంచుతుంది.

●     ఇది మీకు ప్రశాంతతను అందిస్తుంది.


మీ పోర్ట్​ఫోలియోను ఎలా వైవిధ్యపరచాలి?

ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. పోర్ట్​ఫోలియోను వైవిధ్యపరచడం అనేది సంఖ్యల ఆట కాదు. ఎక్కువ పెట్టుబడులను పెట్టే వ్యక్తే ప్రతీసారి గెలుస్తాడని చెప్పలేం.

ఒక క్రికెట్ టీమ్​లో వైవిధ్యత గురించి ఆలోచించడండి. కేవలం హిట్టర్లు మాత్రమే ఉంటే మీకు విజయం చేకూరదు కదా!

11 మందితో ఉండే ఒక జట్టులో మీకు 5గురు బ్యాటర్లు, 4గురు బౌలర్లు, 1 ఆల్​రౌండర్, 1 వికెట్ కీపర్ తప్పనిసరిగా కావాలి. అలాగే పోర్ట్​ఫోలియోలో కూడా వివిధ రకాల పెట్టుబడులు ఉండాలి.

మీ ఫోర్ట్​ఫోలియోను వైవిధ్యభరితం చేసేందుకు ఎన్నో రకాల వ్యూహాలు ఉన్నాయి. కానీ ప్రాథమిక సూత్రం మాత్రం మారకుండా అలాగే ఉంటుంది. ప్రతీ సందర్భంలోనూ మీ పోర్ట్​ఫోలియో బహుళ ఎంపికలను కలిగి ఉండాలి.

మీరు దానిని ఎలా అమలు చేయాలో ఇక్కడ ఉంది.

1. పెట్టుబడి పెట్టే ముందు పరిశోధించండి, ప్లాన్ చేసుకోండి

మేజర్ పెట్టుబడి తరగతులైన నగదు, ఫిక్స్​డ్​ డిపాజిట్లు, ఈక్విటీలలో మీరు పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి పెట్టుబడులను పెట్టండి. వాటికి పరిశోధన, ప్రణాళిక చాలా అవసరం.

మీరు ప్రతి ఆస్తిలో ఎంత శాతం పెట్టుబడులను ఉంచాలి?

మీ పరిస్థితులు, పెట్టుబడి ప్రాధాన్యతలను పరిగణనలోనికి తీసుకుని ఆలోచించుకోండి.

●     అసలు మీరు ఈ పెట్టుబడి ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? మీరు అందుకోవాలనుకుంటున్న లక్ష్యాలు ఏమిటి?

●     మీరు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు మీకు ఎంత సమయం ఉంది?

●     పెట్టుబడులు పెట్టాలనుకున్నపుడు మీరు ఏ స్థాయిలో భద్రతను కోరుకుంటున్నారు?

●     మీరు ఎంతమేర రిస్కు తీసుకోగలరు? మార్కెట్లు ఒక్కోసారి నష్టపోతుంటాయి. ఒక్కోసారి లాభపడుతుంటాయి. ఒకవేళ నష్టపోతే మీరు ప్రశాంతంగా ఉంటారా?

ఎందులో పెట్టుబడులు పెట్టాలో నిర్ణయించుకునే ముందు మీకు మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం చాలా అవసరం.

2. రిస్కును విస్తరించండి

మీరు మీ మొత్తం పెట్టుబడులను ఒకే కంపెనీలో పెడితే ఒకవేళ ఆ స్టాక్ పడిపోతే మీరు తీవ్రంగా నష్టపోతారు. అలాకాకుండా మీరు మీ మొత్తం పెట్టుబడిని ఒకే వ్యక్తి లేదా సంస్థ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడి పెడితే ఒకవేళ అతడు లేదా ఆ సంస్థ దివాళా తీస్తే మీరు మొత్తం పెట్టుబడులను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి పెట్టుబడులలో వైవిధ్యత అనేది చాలా అవసరం.

వైవిధ్యత అనేది మీకు వచ్చే నష్టాలను తగ్గిస్తుంది. అందుకే వివిధ స్టాకుల​లో పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం.

ఇది లాభాలకు ఎటువంటి హామీ ఇవ్వదు. నష్టాల నుంచి మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుందని చెప్పదు. కానీ మీ పోర్ట్​ఫోలియోను సురక్షితంగా మాత్రం ఉంచుతుంది.

3. వివిధ రకాల ఆస్తుల్లో వైవిధ్యత

బాగా వైవిధ్యపరిచిన పోర్ట్​ఫోలియోలో వివిధ రకాల రిస్కులు ఉండే పలు రకాల పెట్టుబడులు చేర్చబడతాయి. ఉదా.. స్టాకులు, బాండ్స్, నగదు, రియల్ ఎస్టేట్, ఎఫ్​డీలు, బంగారం మొదలగునవి.

పైన పేర్కొన్న వాటిలో స్టాక్స్ అన్నింటికంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెడతాయి. కానీ వాటిలో అస్థిరత చాలా ఎక్కువగా ఉంటుంది. బాండ్స్ అనేవి స్టాక్స్ కంటే చాలా తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. కానీ వీటి ద్వారా వచ్చే లాభాలు కూడా తక్కువగానే ఉంటాయి.

రియల్ ఎస్టేట్ రంగం చాలా ఖరీదైనది. ఇందులో కమీషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎఫ్​డీలు, బంగారం అనేవి తక్కువ ఖర్చు​తో కూడుకున్న పెట్టుబడులు. కానీ వీటిలో వచ్చే లాభాలు కూడా తక్కువగానే ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో ఈ పెట్టుబడులన్నీ వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కాబట్టి పెట్టుబడులలో వైవిధ్యత చాలా ముఖ్యం.

ఎంత రిస్కు తీసుకోగలరు, మీరు ఎప్పుడు పదవీ విరమణ పొందుతారనే విషయాల ఆధారంగా మీ పోర్ట్​ఫోలియోకు పెట్టుబడుల శాతాన్ని చేర్చండి.

 

4.  ఉన్న ఆస్తులలోనే వైవిధ్యపర్చడం

ఇప్పటికే మీకున్న పెట్టుబడులను వివిధ రకాలుగా విభజించండి. మరోసారి వైవిధ్యభరితం చేయండి.

ఉదాహరణకు స్టాక్స్​ను తీసుకుంటే.. స్టాక్స్​లో వైవిధ్యత అంతంత మాత్రంగానే ఉంటుంది. కేవలం కంపెనీ పరిమాణం (లార్జ్​ క్యాప్​, మీడియం క్యాప్​, లేదా స్మాల్ క్యాప్), ప్రాంతం (భారతదేశం లేదా విదేశాలు), ఇండస్ట్రీ, ఇంకా సెక్టార్​ను మాత్రమే వైవిధ్యభరితం చేసేందుకు వీలుంటుంది.

మీరు మీ స్టాక్ పోర్ట్​ఫోలియోను వైవిధ్యపరచాలని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్​ లేదా ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్​ (ETF) ల సహాయంతో చేసుకోవచ్చు. కానీ అలా చేసేందుకు తగిన సమయం లేకపోతే మానుకోవాలి.

బంగారానికి కూడా ఇదే వర్తిస్తుంది. భౌతిక బంగారం, గోల్డ్​ ఈటీఎఫ్​లు, ఎస్​జీబీలు, డిజిటల్ గోల్డ్​  వంటి వాటిలో మీరు పెట్టుబడి పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.

5. మీరు ఎప్పుడు ఆపేయాలో తెలుసుకోండి

పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు. వాటిని ఎప్పుడు ఉపసంహరించుకోవాలో కూడా మీకు తెలిసి ఉండాలి. పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్​లో ఇది కూడా బాగమే. మీరు పెట్టుబడి పెట్టిన ఆస్తి దీర్ఘకాలంలో పెద్దగా రాణించకపోతే.. మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు లేకపోతే మీరు ఉపసంహరించుకోవడమే చాలా మంచిది.

మీరు మార్కెట్ లింక్​డ్​ ప్రొడక్టుల​లో కనుక పెట్టుబడులు పెడితే.. స్వల్పకాలానికి మంచి రాబడులు రాకపోయినా కానీ మీరు బయటకు రావొద్దు.

మీ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు డైవర్సిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. కానీ మీరు నష్టపోకుండా ఉంటారని మాత్రం ఇది మీకు హామీ ఇవ్వదు.

మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత కూడా మీరు డబ్బును కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

పెట్టుబడి రిస్కులను పూర్తిగా నిరోధించే మార్గం లేదు. కానీ మార్కెట్ రిస్కుల స్థాయిని తగ్గించేందుకు ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.

మీరు పెట్టుబడిన పెట్టిన విధానం మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉందా? లేదా అని సంవత్సరానికి ఒకసారైనా చూసుకోండి.

మీ ఆర్థిక పరిస్థితులు మారినపుడు మీ పెట్టుబడులను మరోసారి తిరిగి చెక్ చేసుకోండి. మీరు ఆర్థిక నిపుణుడిని సంప్రదించి మీ పెట్టుబడుల మీద తగిన సలహాలను తీసుకోండి.

 

 

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.