Buy Gold
Sell Gold
Daily Savings
Digital Gold
Instant Loan
Round-Off
Nek Jewellery
మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వచ్చే ప్రయోజనాలు, అది పొందే మార్గాలను మీకు తెలిపే ఒక చిన్నపాటి క్రెడిట్ స్కోర్ గైడ్ ఇది.
మీ క్రెడిట్ స్కోర్ ఏంటో మీకు తెలుసా?
మీ సమాధానం ఏదైనా, ప్రతీ ఒక్కరూ తమ క్రెడిట్ స్కోర్‌పై, క్రెడిట్ రిపోర్ట్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం.
క్రెడిట్ రిపోర్ట్ ఎందుకు? అంటే, మీకు క్రెడిట్ కార్డ్ లేదా లోన్ వస్తుందా లేదా అనే దాని గురించి మాత్రమే కాదు.
ఇది మీ ఫోన్ ఈఎంఐ, ప్రతీనెలా వాహనానికి ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్లు, ఇంకా ఇతర ఆర్థిక లావాదేవీలను కూడా ప్రభావితం చేయవచ్చు.
మంచి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ అంటే ఏమిటి? దాన్ని ఎలా లెక్కిస్తారో మీకు తెలియదా? ఏమీ ఫరవాలేదు, మీ వెనుక జార్ ఉంది.
క్రెడిట్ స్కోర్ అనేది సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య. ఈ స్కోర్ మీ పేమెంట్ హిస్టరీ, మీకున్న లోన్లు, మీకు ఎంతకాలం నుండి క్రెడిట్ ఉంది, అనే మీ క్రెడిట్ రిపోర్ట్‌లోని సమాచారంపై ఆధారపడి ఉంటుంది.
బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు, కారు డీలర్‌షిప్‌ల వాళ్ళు మీకు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి క్రెడిట్లు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకొనే క్రమంలో క్రెడిట్ స్కోర్లను కీలక అంశంగా తీసుకుంటారు.
మీరు అప్పుగా తీసుకున్న డబ్బును మీరు ఎంతవరకు తిరిగి చెల్లించగలరో అంచనా వేయడానికి వారు ఉపయోగించే అనేక అంశాలలో ఇది కూడా ఒకటి. మీరు ఎన్ని అప్లికేషన్లు చేశారు? మీకు ఎంత అప్పు ఉంది? మీకున్న క్రెడిట్ ప్రొడక్ట్స్ ఏమిటి? మీరు వాటిని సకాలంలో చెల్లించారా లేదా? ఇలా రకరకాల డేటాను వారు విశ్లేషిస్తారు.
భారతదేశంలో Equifax, CIBILTM, ExperianTM, CRIF High MarkTM ఇంకా మరికొన్ని క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్‌లను అందిస్తున్నాయి.
ప్రస్తుతం, ఒక్కో క్రెడిట్ ఏజెన్సీ క్రెడిట్ రేటింగ్‌లను లెక్కించడానికి ఒక్కో అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. కాబట్టి, క్రెడిట్ స్కోర్లు ఒకదానికొకటి కొంచెం భిన్నంగా ఉండవచ్చు.
క్రెడిట్ స్కోర్ గ్రేడింగ్ సిస్టమ్‌ను సులభంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాము:
ఒక్కటి గుర్తుంచుకోండి, ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు మంచి క్రెడిట్ యాక్టివిటీ ఉందని, మీకు లోన్ ఇవ్వవలసినవాళ్ళు మీ క్రెడిట్ అభ్యర్థనను సమీక్షించేటప్పుడు మీ మీద మంచి నమ్మకం కలుగుతుందని అర్థం.
మీరు బాధ్యతాయుతమైన క్రెడిట్ అలవాట్లను ఎలా అలవర్చుకోవచ్చో, మీరు మంచి క్రెడిట్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలో ఇక్కడ ఉంది:
క్రెడిట్ కార్డ్ బకాయిలు, లోన్ ఈఎంఐలను క్రమం తప్పకుండా, సకాలంలో తిరిగి చెల్లించడం సాధారణంగా క్రెడిట్ స్కోర్‌ను గణించేటప్పుడు క్రెడిట్ బ్యూరోలు సూచించే అన్ని విషయాలలో అత్యధిక వెయిటేజీని అందుకుంటుంది. కాబట్టి మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి మీ లోన్, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను సకాలంలో చెల్లించండి. మీకు బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది ఉంటే వెంటనే మీ రుణదాతకు తెలియజేయండి.
మీరు లోన్ కోసం గానీ, క్రెడిట్ కార్డ్ కోసం గానీ దరఖాస్తు చేసినప్పుడు, మీరు తిరిగి ఎలా చెల్లించగలరో అంచనా వేయడానికి రుణదాతకు క్రెడిట్ ఏజెన్సీ నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్ వస్తుంది. ప్రతీ లెండర్ ఇనీషియేటెడ్ క్రెడిట్ రిపోర్ట్‌ను హార్డ్ ఎంక్వైరీ అంటారు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరులో కొన్ని పాయింట్లు తగ్గుతాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే, తక్కువ సమయంలో ఒకటి కంటే ఎక్కువ లోన్లు లేదా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లను చేయడం మీ క్రెడిట్ స్కోర్‌ను బాగా తగ్గిస్తుంది.
క్రెడిట్ స్కోర్లను లెక్కించడానికి క్రెడిట్ బ్యూరోలు సాధారణంగా రుణదాతలు, క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు అందించిన సమాచారాన్ని ఉపయోగిస్తాయి. మీ వ్యక్తిగత సమాచారం సరైనదని, ఖాతా సమాచారం తప్పుగా లేదా అసంపూర్ణంగా లేదని నిర్ధారించుకోవడానికి, మీ క్రెడిట్ నివేదిక యొక్క ఉచిత కాపీని అభ్యర్థించడంతో పాటు దాన్ని సమీక్షించండి. మీ క్రెడిట్ రిపోర్టులను తరచూ గమనిస్తూ ఉండండి. మీరు ఆన్‌లైన్ ఫైనాన్షియల్ మార్కెట్ ప్లేస్‌లకు వెళ్లడం ద్వారా మీ ఉచిత క్రెడిట్ నివేదికలు, సాధారణ అప్‌డేట్లను కూడా పొందవచ్చు.
ఇది కనీస జ్ఞానం. మీ అప్పులన్నీ తీర్చుకోండి. క్రెడిట్ కార్డ్ పరిమితి కంటే గణనీయంగా తక్కువగా ఉన్న క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను నిర్వహించండి. మీరు మీ క్రెడిట్ పరిమితి కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉంటే మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం కావచ్చు.
మంచి క్రెడిట్ స్కోర్ వల్ల కలిగే కొన్ని ఉపయోగాలు:
తక్కువ వడ్డీకి లోన్ రావడం కోసం ప్రతి ఒక్కరూ మంచి క్రెడిట్ స్కోర్ ఉండేలా చూసుకుంటారు. ఇది మీ అప్పులను వేగంగా చెల్లించడంలోనూ, డబ్బు ఆదా చేయడంలోనూ మీకు సహాయపడుతుంది. హోమ్ లోన్ లేదా ఆస్తిపై లోన్ వంటి పెద్ద రుణాలలో చిన్న తగ్గింపు కూడా కాలక్రమేణా మీకు చాలా డబ్బును ఆదా చేస్తుంది.
మీరు లోన్ కోసం గానీ, క్రెడిట్ కార్డ్ కోసం గానీ దరఖాస్తు చేసినప్పుడు, ప్రతీ రుణదాత ముందుగా మీ క్రెడిట్ స్కోర్, రిపోర్ట్ చూస్తారు. బాగా విచారణ చేసిన తర్వాత అప్లికేషన్ తిరస్కరించబడితే, దానివల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోవచ్చు. అయితే, మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే, మీ అప్లికేషన్ తిరస్కరించడానికి రుణదాతలకు బలమైన కారణాలేమీ ఉండవు. కాబట్టి మీకు క్రెడిట్ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
మీ జీతాన్ని, మంచి క్రెడిట్ స్కోర్‌తో కలిసి చూసినప్పుడు, మీరు లోన్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ తీసుకున్నారా లేదా అనేది పెద్ద అంశం. ఇవి మీరు పెద్ద లోన్ తీసుకోవడానికి గానీ, మీ క్రెడిట్ కార్డ్‌లపై పెద్ద క్రెడిట్ పరిమితి పొందడానికి గానీ మీకు సహాయపడతాయి. ఈ రెండింటిని పరిగణనలోనికి తీసుకోవడం ద్వారా, రుణదాతలు మీరు లోన్ తీర్చే అవకాశాలను అంచనా వేస్తారు. మీరు బాధ్యతాయుతమైన రుణగ్రహీత అని నమ్ముతారు. మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ, మీకు లోన్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, అప్పుడు మీకు వడ్డీ రేట్లతో పాటు క్రెడిట్ పరిమితి ఎక్కువగా ఉండవచ్చు.
మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే, మీరు తీసుకునే లోన్‌కు వడ్డీ రేటు ఎక్కువగా ఉండవచ్చు. భవిష్యత్తులో ఈ లోన్లను తీర్చడం మీకు కష్టంగా మారవచ్చు. తక్కువ వడ్డీ రేటు కోసం అభ్యర్థించేటప్పుడు మీరు కొద్దిగా బేరమాడే అవకాశం కూడా ఉంటుంది.
మరోవైపు, మీకు అద్భుతమైన క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌ల కోసం ఆమోదం పొందేందుకు మెరుగైన అవకాశం ఉంటుంది. మీరు వేర్వేరు రుణదాతల ఆఫర్లను పోల్చుకొని రుణదాతలతో తక్కువ వడ్డీ రేట్ల కోసం బేరమాడవచ్చు.
మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం చాలా సులువు. ఆన్‌లైన్‌లో చేసే ఒక చిన్న ప్రక్రియతో మీరు నాలుగు క్రెడిట్ బ్యూరోల నుంచి సంవత్సరానికి ఒకసారి ఉచిత క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు.
మీ ప్రాథమిక సమాచారం, మీ పాన్ కార్డ్, ఓటరు గుర్తింపు నెంబరు, ఆధార్ కార్డ్ వంటి సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అంతే, క్రెడిట్ స్కోర్‌తో కూడిన మీ క్రెడిట్ రిపోర్ట్ మీ ముందు ఉంటుంది. దీనిలో మీ మునుపటి క్రెడిట్ హిస్టరీతో పాటు మీరు తీసుకున్న, తిరిగి చెల్లించిన ఏవైనా రుణాలు ఉంటే అవి కూడా ఉంటాయి.
క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ వినియోగానికి ఒక బెంచ్‌మార్క్‌గాను, రుణదాతలు మిమ్మల్ని అంచనా వేసేటప్పుడు కీలకమైన నిర్ణయాత్మక అంశంగానూ పనిచేస్తుంది. చాలామందికి వారి లోన్ దరఖాస్తు తిరస్కరించబడే వరకు దాని గురించి తెలియదు.
కాబట్టి మీరు కొత్త కారు గానీ, ఇల్లు గానీ కొనేటప్పుడు నిరాశ చెందడం కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి, ఆరోగ్యకరమైన క్రెడిట్ అలవాట్లు చేసుకోవడానికి మొదటి అడుగు వేయండి. మీ క్రెడిట్ స్కోర్ క్రమంగా పెరుగుతుంటే చూసి సంతోషించండి.