Playstore Icon
Download Jar App
Digital Gold

ఈ పండుగ సీజన్​లో బహుమతిగా బంగారం కొనడానికి 5 కారణాలు - జార్ యాప్

December 28, 2022

ప్రతి ఒక్కరూ బంగారాన్ని బహుమతిగా కొనుగోలు చేస్తున్నారు లేదా డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెడుతున్నారు. వారంతా అలా ఎందుకు చేస్తున్నారని మీరు ఆశ్చర్యపోతున్నారా? FOMO (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) జోన్ లోనికి మాత్రం పోవద్దు. ఈ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి మేము మీకు సహాయపడగలం.

ఇది మరో కొత్త సంవత్సరం యొక్క సమయం - సాయంత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంది, బాణసంచా శబ్దం ఆనందాన్ని తెస్తుంది, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.

పువ్వులు, ఆహారం, పార్టీలు, కొత్త దుస్తులు - పండుగ సీజన్ వస్తూ వస్తూ తనతోపాటు కొత్త రకమైన ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.

 

మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో మనది అన్న భావన, మనకు సంబంధం ఉన్నట్లుగా భావిస్తాము.

 

నవరాత్రి, దసరా, కర్వాచౌత్, ధంతేరాస్, దీపావళి వంటి శుభసందర్భాల వేళ ప్రజలు బంగారం కొనడానికి మార్కెట్లకు వస్తారు.

 

బంగారం అనేది – బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, బంగారు కడ్డీలు ఇలా అనేక రూపాల్లో ఉంటుంది. ఇటీవలి దశాబ్దాల్లో బంగారంలో - గోల్డ్ ఈట​ఎఫ్​లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు, డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెట్టడానికి మరిన్ని ఆప్షన్లు ఉన్నాయి.

 

మనం బంగారాన్ని ధరించడంతో పాటు నలుగురిలో మన దర్పాన్ని ప్రదర్శిస్తాము. బహుమతిగా ఇస్తాము, దాచుకుంటాము, దానిపై కన్ను వేస్తాము. ఈ 24 క్యారెట్ల లోహం మనల్ని తన బానిసలుగా మార్చుకుంది.

 

ప్రత్యేకించి ప్రసవం, వివాహాలు లేదా పండుగలు వంటి సందర్భాల్లో మనం దీనిని విలువైన, యోగ్యమైన, ప్రముఖ బహుమతి ఆప్షన్​గా కూడా పరిగణిస్తాము.

 

కానీ ప్రజలు మంగళకరమైన సందర్భాల్లో బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తారు?‍

 

భారతదేశంలో బంగారానికి గొప్ప సాంస్కృతిక, ధార్మిక ప్రాముఖ్యత ఉంది - ఇది అన్ని లోహాలలోకెల్లా అగ్రస్థానాన్ని కలిగి ఉంది.

 

ఎన్నో ఏళ్లుగా మనకు బంగారం అంటే ఎడతెగని వ్యామోహం. ప్రపంచంలోనే ఎక్కువగా బంగారాన్ని వినియోగించేది భారతదేశంలోనే. ఇది మనకు ఏమాత్రమూ ఆశ్చర్యం కలిగించదు, కాదా?

 

ఎందుకంటే బంగారం మన జీవితంలో అంతర్భాగంగా మారడమే గాక సంపదకు చిహ్నంగా కూడా అయిపోయింది.

  • పవిత్రమైనది, స్వచ్ఛమైనది - హిందూ పురాణాల ప్రకారం బంగారం ఎంతో పవిత్రమైనది, స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. ఇది అధిక భావోద్వేగాలతో కూడినదేగాక అధిక విలువను కూడా కలిగి ఉంటుంది. ఇది మనల్ని మరింత దగ్గరగా చేస్తుంది. వ్యక్తుల మధ్య బంధాలను బలోపేతం చేస్తుంది.
  • సానుకూల శక్తినిచ్చే రంగు - బంగారం యొక్క ఆహ్లాదకరమైన రంగు సానుకూల శక్తిని ప్రసరిస్తుంది, నయం చేయడంలో సహాయపడుతుంది.
  • సమృద్ధికి సంకేతం - ధంతేరాస్, దీపావళి సమయంలో బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం, ఇంట్లో సంపద, శ్రేయస్సు దేవతలైన లక్ష్మి, కుబేరులను ఆహ్వానించడంతో సమానం.

సాంస్కృతిక, భావోద్వేగంతో కూడినదే కాకుండా, భారతీయులమైన మనం బంగారం గురించి క్రేజీగా పరిగణించబడడానికి వివిధ ఇతర కారణాలు కూడా ఉన్నాయి:

  • ‍‍‍‍లిక్విడ్ క్యాష్​కు సమానం - సెక్యూరిటీ లేదా అసెట్​ల మాదిరిగానే, బంగారం కూడా చాలా లిక్విడ్, పోర్టబుల్. అత్యవసర పరిస్థితుల్లో దీనిని ఏ సమయంలోనైనా నగదుగా మార్చవచ్చు. చాలామందికి ఇది సహాయం చేసే స్నేహితుడిగా కనబడుతుంది.
  • మంచి పెట్టుబడి - బంగారం అనేది ఒక విలువైన ఆస్తి. దీని విలువ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఇది సురక్షితమైన పెట్టుబడిగా మారింది. గత ఐదేళ్లలో ప్రతీ ఏటా బంగారం 20% కంటే ఎక్కువ రాబడిని అందించింది. పోర్ట్‎ఫోలియోలో రిస్క్ తగ్గించడానికి సహాయపడే మంచి వైవిధ్యాకారిగా ఇది భావించబడుతుంది. ఇన్వెస్ట్​మెంట్​ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి యొక్క పెట్టుబడి పోర్ట్‎ఫోలియోలో బంగారంపై పెట్టుబడులు కనీసం 5% నుండి 10% వరకు ఉండాలి.
  • బహుమతి ఇవ్వడానికి మంచి ఎంపిక - చాలా వేడుకలు, సంప్రదాయాలలో బంగారాన్ని బహుమతిగా ఇవ్వడం అనేది అంతర్భాగం. ఇది డబ్బు యొక్క కీలక వనరుగానే కాకుండా, అదృష్టంగా కూడా పరిగణించబడుతుంది. బంగారం బహుమతిగా ఇవ్వడం అనేది మన దేశంలో బహుమతి యొక్క అత్యున్నత రూపంగా పరిగణించబడుతుంది, ఇది ఒక వ్యక్తి యొక్క విలువ, ఉద్దేశ్యం యొక్క స్వచ్ఛతను వ్యక్తం చేస్తుంది. 

 

ఇంకా ఏంటో ఊహించండి? డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‎మెంట్ యాప్ ద్వారా బంగారాన్ని బహూకరించడం ఇప్పుడు సులభం, చిరాకు లేకుండా మారింది.

 

జార్ యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెట్టండి. మీరు మీ ఇంటి నుంచే హాయిగా బంగారాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, మీ ప్రియమైనవారికి ఊహించని ధరకు బహుమతిగా కూడా పంపవచ్చు.

 

డిజిటల్ గోల్డ్ ద్వారా మీ ప్రేమలో కొంత భాగాన్ని వారితో పంచుకోండి. డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెట్టడం గురించి ప్రతిదీ తెలుసుకోవడం కొరకు ఈ డిజిటల్ గోల్డ్ గైడ్ ను చూడండి.

 

ఈ పండుగ సీజన్​లో మీరు డిజిటల్ గోల్డ్​ను ఎందుకు కొని బహుమతిగా ఇవ్వాలి?

 

మీరు ఎందుకు జార్ ద్వారా డిజిటల్ గోల్డ్​ను కొని బహూకరించాలంటే:

‍‍

●     డిజిటల్ గోల్డ్​ అత్యంత లిక్విడిటి కలిగి ఉంటుంది

 

డిజిటల్ గోల్డ్​ను ఎక్కడైనా, ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. భవిష్యత్తులో బంగారం యొక్క పూర్తి రీసేల్ విలువను పొందడం కొరకు మీరు డీలర్​ను సందర్శించాల్సిన అవసరం ఉండదు లేదా అనేక సంవత్సరాల పాటు సురక్షితమైన బంగారం కొనుగోలు అకౌంట్​ను ఉంచాల్సిన అవసరం రాదు.

 

●     సులభంగా కొనుగోలు చేయగల బంగారం - తక్కువలో తక్కువ ₹1 నుంచే

 

ఈ పండుగ సీజన్​లో ప్రజలు గుమిగూడిన, ఫుల్ రష్​గా ఉన్న మార్కెట్లకు వెళ్లి చిరాకు పడాల్సిన పని లేదు. భౌతిక బంగారంలో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనుగోలు చేయాలి, పైగా దీని ధర ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతుంది.

అయితే, డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెట్టడం చాలా సరసమైనది. తక్కువలో తక్కువ ₹1 నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. ఇది సరసమైనదే కాక పరిమిత ఆదాయంతో కూడా మీరు డిజిటల్ గోల్డ్​లో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.

‍‍

●     24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం, మార్కెట్ కంటే చౌక

 

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, మీరు బంగారం ధరను చెల్లించడమే కాకుండా ఛార్జీలు, అదనపు పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

 

మీ ఆభరణాల డిజైన్ ఆధారంగా ఆభరణాల వర్తకులు 7% నుంచి 25% వరకు వసూలు చేస్తారు. ఎంచుకున్న ఆభరణాలలో విలువైన రాళ్లు, రత్నాలు ఉన్నట్లయితే ఖర్చు పెరుగుతుంది. దాని విలువ కూడా బంగారం ధరలో చేర్చబడుతుంది.

 

మీరు బంగారు ఆభరణాలతో వ్యవహరించేటప్పుడు, మీరు ఎన్నడూ ఆ పొదిగిన నగల విలువను సేకరించాల్సిన అవసరం లేదు లేదా పునరుద్ధరించాల్సిన అవసరం లేదు.

 

డిజిటల్ గోల్డ్​తో, మీరు స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే ట్రేడ్​ చేస్తారు. ఇది 24 క్యారెట్ల బంగారం. మీరు ఖర్చు చేసే మొత్తం బంగారంలో మాత్రమే పెట్టుబడి పెట్టబడుతుంది. కొనుగోలు చేసే సమయంలో మీరు కేవలం 3% జీఎస్టీ మాత్రమే చెల్లించాలి.

‍‍

●     ‍సురక్షితం, భద్రమైనది

 

డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది విముఖత చూపుతారు. ఎందుకంటే, ఇది ఒక కొత్త కాన్సెప్ట్. పైగా ఈ విషయంలో వారికి అంత పరిజ్ఞానం లేదు. కానీ ఆందోళన చెందకండి. డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి సురక్షితమైన ఆప్షనే.

 

మీ అకౌంట్​లో పేరుకుపోయిన ప్రతి గ్రాము బంగారానికి నిజమైన భౌతిక బంగారం మద్దతు ఉంటుంది. అంటే మీకు ఏ సమయంలోనూ ఎలాంటి ప్రమాదం లేదు.

‍‍

●     ‍స్టోరేజ్ చింత లేదు

 

మన భారతీయ కుటుంబాల్లో పెద్దలు భౌతిక రూపంలోని బంగారాన్ని లాకర్లలో ఉంచడం మనం చూసే ఉంటాం. ఇది దొంగిలించబడుతుందనే భయం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి అది చాలా ప్రమాదకరం.

 

అలాంటి పరిణామాలను నివారించేందుకు చాలామంది బంగారాన్ని ఎక్కువ కాలం పాటు బ్యాంకు లాకర్​లో ఉంచుతారు. తరువాత రిజిస్ట్రేషన్ ఫీజులు, వార్షిక ఫీజులు, సర్వీస్ ఫీజులు మొదలైన వాటి రూపంలో స్టోరేజీ ఖర్చులను చెల్లిస్తారు.

 

డిజిటల్ గోల్డ్ దీర్ఘకాలిక ఖర్చులు, స్టోరేజీ సమస్యలను వదిలించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సురక్షితంగా ఉంటుంది, ముఖ విలువ వద్ద బీమా చేయబడుతుంది.

 

బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు డిజిటల్​కు వెళ్లడం తెలివైన ఎంపిక ఎలా అవుతుంది అనే దానిపై మరింత తెలుసుకోండి

 

జార్ యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్​ను బహుమతిగా ఇచ్చి ఈ పండుగ సీజన్​లో మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని ప్రత్యేకంగా భావించేలా చేయండి.

 

మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన, హద్దులు లేని రాబడులు ఇచ్చే ఈ పెట్టుబడి ఎంపికలో మీరు కూడా ఇన్వెస్ట్​ చేయండి.

 

జార్ యాప్ ద్వారా చిరాకు లేకుండా డిజిటల్ గోల్డ్​లో ఇన్వెస్ట్​ చేయండి. మరియు జార్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని ఈరోజే మీ సేవింగ్స్​, ఇన్వెస్ట్​మెంట్ ప్రయాణాన్ని ప్రారంభించండి!

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.