భారతీయులు ఎందుకని ఏదైనా పండుగ రోజునే బంగారంలో పెట్టుబడి పెడతారు? – జార్​ యాప్​

Author Team Jar
Date Apr 21, 2023
Read Time Calculating...
భారతీయులు ఎందుకని ఏదైనా పండుగ రోజునే బంగారంలో పెట్టుబడి పెడతారు? – జార్​ యాప్​

బంగారం లేకుండా జరిగే ఒక భారతీయ వివాహాన్ని మీరు ఊహించగలరా? ఖచ్చితంగా ఊహించుకోలేరు, కదా?

అక్షయ తృతీయ, ధంతేరస్ (ధన త్రయోదశి), కర్వా చౌత్, దీపావళి, మకర సంక్రాంతి, నవరాత్రి మొదలైన పండుగలు, శుభకార్యాలలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

మన భారతీయులకు, బంగారం కేవలం లోహం మాత్రమే కాదు - ఒక బలమైన సామాజిక, భావోద్వేగ పరమైన విలువలు కలిగిన 'ఫీల్ గుడ్' లోహం.

బంగారం పట్ల మనకు ఉండే కోరిక అనంతమైనది. ఇది మనకు ప్రతీ శుభ సందర్భంలోనూ ముఖ్యమైనదే. మీరు మీ డ్రైవర్ పెళ్లి నుంచి రాణి కిరీటం వరకు ప్రతిచోటా బంగారాన్ని చూస్తూ ఉండవచ్చు .

బంగారం ఎంతో అందమైన, అద్భుతమైన, ఖరీదైన లోహం. అందుకే, ఇప్పుడు అతి ఎక్కువగా బంగారాన్ని ఉపయోగించే దేశాలలో భారతదేశం ఒకటిగా ఉండటంలో ఆశ్చర్యమే లేదు.

నిజానికి, బంగారాన్ని బహుమతిగా ఇవ్వడం కూడా పవిత్రమైన రోజులలో ముఖ్యమైన అలవాటు. పెళ్ళిళ్ళలో వధూవరులు ధరించడమే గాక వారికి బహుమతిగా ఇవ్వడానికి దాదాపు 50% మంది బంగారాన్ని ఎంచుకుంటున్నారని ఒక అంచనా.

భారతీయులకు బంగారమంటే ఎందుకంత ఇష్టం?

బంగారం అదృష్టాన్ని కలిగించేదని, స్వచ్ఛమైన లోహమని అంతా భావిస్తారు. మతపరమైన ఆచారాలలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. దీనిని దేవుళ్లను అలంకరించడానికి ఉపయోగిస్తారు. ఇది భారతీయ దేవాలయాలను ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలలో ఒకటిగా మార్చింది.

బంగారు ఆభరణాలైనా లేదా బంగారు నాణేలతో నిండిన పెట్టె కూడా ఎప్పటికీ ఉపయోగపడకుండా ఉండవు. చాలా మంది దానిని కొనడానికి ఇష్టపడుతూ ఉన్నందువల్ల దాని విలువ పెరుగుతుంది. బంగారాన్ని కొన్నవాళ్ళకు ఒకరకంగా ఆస్తి పెరిగినట్టే.

వజ్రాలు, ప్లాటినం, ముత్యాలు, సింథటిక్ బంగారం కూడా ఆభరణాల పరిశ్రమలోకి వచ్చినప్పటికీ, బంగారం సర్వోన్నతంగా కొనసాగుతోంది - పొరుగువారిలో అసూయను, దాన్ని కొన్నవారికి గర్వాన్ని అందిస్తోంది.

పండుగ రోజుల్లో జనాలు బంగారం ఎందుకు కొంటారో చూద్దాం:

 

1. స్టేటస్ సింబల్: భారతదేశంలోని వ్యక్తులు తమ డబ్బును ప్రదర్శించడాన్ని ఆనందిస్తారు. బంగారం, ముఖ్యంగా బంగారు ఆభరణాలు స్టేటస్ సింబల్‌గా మారాయి. మనం దానిని సంపద, అధికారం, హోదాగా తీసుకుంటాము. అది ధరలు పెరిగినప్పుడు కూడా బంగారాన్ని కొనగల వ్యక్తి యొక్క లేదా కుటుంబం యొక్క సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది.

 

2. కుటుంబ వారసత్వం: చాలా భారతీయ కుటుంబాలకు బంగారు నగలు ముఖ్యమైన కుటుంబ వారసత్వం. చాలామంది కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికి బంగారాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి ఇస్తూ ఉంటారు.

3. పవిత్రతకు, శ్రేయస్సుకు చిహ్నం: హిందూ పురాణాలను బట్టి, బంగారం ఎంతో పవిత్రమైనది, స్వచ్ఛమైనది. ఇదంటే అందరికీ ఎంతో ఇష్టం, విలువ. ఇది మనుషులను మరింత దగ్గర చేసి, వారి మధ్య బంధాలను బలపరుస్తుంది. బంగారాన్ని లక్ష్మీ దేవిగా, కుబేరుడిగా, సంపదకు సంబంధించిన దేవతగా కొలిచి పూజించడం ఒక సంప్రదాయం. అందుకే, బంగారాన్ని కొనడం అంటే దేవుళ్లను ఇంటికి ఆహ్వానించినట్లే.

4. మంచి పెట్టుబడి: పెట్టుబడికి సాధనంగా బంగారంపై భారతీయులకు ఉన్న విశ్వాసం మరువలేనిది. ద్రవ్యోల్బణానికి ధీటుగా పనిచేయగలిగే సామర్థ్యం ఉండటం వల్ల బంగారం ఎప్పటి నుంచో సురక్షితమైన పెట్టుబడిగా (భూమి, ఆస్తి, మ్యూచువల్ ఫండ్‌ల కంటే కూడా సురక్షితమైనది) పరిగణించబడుతోంది. రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాల్లో ఆర్థిక భద్రతను అందించగల విలువైన వస్తువు ఇది. అంతేగాక, ఇది మీ ఇన్వెస్ట్​మెంట్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితం చేస్తుంది. బంగారం ఎల్లప్పుడూ దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించబడుతుంది.

5. బహుమతులు: భారతదేశంలో బంగారాన్ని బహుమతిగా ఇవ్వడాన్ని శుభప్రదంగా భావిస్తారు. బంగారాన్ని ఎవరికైనా ఇవ్వడం వల్ల వారు దానిని ఉపయోగించుకోవడమే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే, ఆ సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు. మన దేశంలో దీన్ని అత్యున్నత బహుమతిగా భావిస్తారు, ఇది ఒక వ్యక్తి యొక్క విలువ, ఉద్దేశం యొక్క స్వచ్ఛతను హైలైట్ చేస్తుంది.

6. మతపరమైన అర్థాలు: మన దేశంలో ఏ మతం వారికైనా వారి వారి మతపరమైన వేడుకలో బంగారం ఒక ముఖ్యమైన వస్తువు. ఆలయాలకు బంగారం సమర్పించే విషయంలో భక్తులు ధరలు పెరుగుతున్నాయనే విషయాన్ని కన్నెత్తి కూడా చూడటం లేదనే విషయం అందరికీ తెలిసిందే.

7. లిక్విడిటీ: బంగారానికి ఉన్న లిక్విడిటీ కారణంగా అది ఒక మంచి పెట్టుబడి అవడమే గాక పొదుపు చేసేందుకు ఒక మంచి ఎంపిక కూడా అవుతుంది. బంగారం, స్టాక్‌లు, బాండ్‌లు, రియల్ ఎస్టేట్ లాంటి ఆస్తుల మాదిరిగా కాకుండా, దీన్ని ఎంతో త్వరగా నగదుగా మార్చుకోవచ్చు. ఇది ఏ సామాజిక, ఆర్థిక నేపథ్యాల వారికైనా మంచి ఆస్తి.

బంగారం అనేది ఒక సులువైన పెట్టుబడి - అన్ని ఆర్థిక స్థాయుల వారు కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఒక గ్రాము బంగారాన్ని కొనుగోలు చేసినా కూడా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు! మరేరకంగా పొదుపు చేసినా అదే స్థాయి సౌలభ్యం ఉండదు.

ఈ రోజులలో బంగారాన్ని కొనడం, బహుమతిగా ఇవ్వడం చాలా సులువు - మార్కెట్​లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. సులువైన, సురక్షితమైన, అత్యంత అనుకూలమైన ఎంపిక డిజిటల్ గోల్డ్. బంగారాన్ని కొనడానికి మీరు మీ ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లవలసిన అవసరం లేదు. జార్ యాప్‌ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే కొనండి, బహుమతిగా ఇవ్వండి, పెట్టుబడి పెట్టండి.

బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు డిజిటల్‌ గోల్డ్‌ తెలివైన ఎంపిక. ఎందుకో, ఎలాగో దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.

సెకన్లలో బంగారం కొనండి. మీకు ఇష్టమైనవాళ్లకు పంపించండి. మన సమాజంలో లోతుగా పాతుకుపోయిన, రాబడి పరంగా ఎటువంటి ఇబ్బందులూ లేని ఈ అందమైన లోహంపై పెట్టుబడి పెట్టండి.

జార్ యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఎలా ఉంటుందో తెలుసుకోండి. జార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఈరోజే మీ పొదుపు, పెట్టుబడి ప్రయాణాన్ని మొదలు పెట్టండి!

Team Jar

Author

Team Jar

ChangeJar is a platform that helps you save money and invest in gold.

download-nudge

Save Money In Digital Gold

Join 4 Cr+ Indians on Jar, India’s Most Trusted Savings App.

Download App Now