జార్ (Jar) యాప్ అంటే ఏమిటి?

December 27, 2022

పొదుపు చేయడం ఇప్పుడు సులభతరమైంది! జార్ (Jar) యాప్‌తో ప్రతిరోజూ పొదుపు చేయడం ప్రారంభించండి. అంతేగాక, ప్రతిరోజూ మీరు పొదుపు చేసుకున్నదానిని రెట్టింపు చేసుకునే అవకాశం పొందండి!

జార్​ (Jar) అనేది మీరు ఆన్​లైన్​లో డబ్బులు ఖర్చు చేసిన ప్రతీసారి చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ డబ్బు పొదుపును మీకు ఒక సరదా అలవాటుగా మార్చే రోజువారీ గోల్డ్​ సేవింగ్స్​ యాప్​.

‍ 

‍జార్ (Jar) యాప్ ఒక డిజిటల్ పిగ్గీ బ్యాంక్ లాంటిది. ఇది మీ మొబైల్ ఫోన్‌లోని ఎస్​ఎంఎస్​ ఫోల్డర్ నుండి మీరు ఏం ఖర్చులు చేస్తున్నారనే దానిని గుర్తిస్తుంది. మీ ప్రతీ ఖర్చుకు ఎంతో కొంత చిల్లరను మిగిల్చేందుకు మీ ఖర్చును దానికి సమీపంలోని 10కి రౌండ్ ఆఫ్​ చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఆన్‌లైన్‌లో 98 రూపాయలకు మొబైల్ రీఛార్జ్ చేసినట్లయితే, జార్ (Jar) యాప్ మీ ఎస్​ఎంఎస్​ ఫోల్డర్‌లోని రీఛార్జ్ నిర్ధారణ సందేశాన్ని గుర్తించి, దానిని సమీపంలోని 10కి అంటే 100 రూపాయలకు రౌండ్​ ఆఫ్​ చేస్తుంది. అప్పుడు ఎక్కువగా ఉన్న ఆ 2 రూపాయల (100-98) చిల్లరను మీ బ్యాంక్ ఖాతా నుండి తీసుకుంటుంది (మీ యూపీఐ ఐడీకి జోడించబడిన బ్యాంక్​ ఖాతా). ఆ చిల్లరను ఆటోమేటిక్‌గా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంది.

 

మీ ‍ఆ చిల్లరను జార్ యాప్ 99.9% స్వచ్ఛమైన బంగారంలో ఆటోమేటిక్​గా పెట్టుబడి పెడుతుంది. ఆ బంగారం ప్రపంచ స్థాయి వాల్ట్‌లలో పూర్తిగా భద్రంగా ఉంటుంది. అంతేగాక, భారతదేశంలోని టాప్​ బ్యాంకులచే బీమా చేయబడి ఉంటుంది.

 

‍లక్షలాది మంది భారతీయులు పొదుపు, పెట్టుబడిని ఆటోమేటిక్​గా చేసేసుకోవడానికి యూపీఐ ఆటోపే సౌలభ్యాన్ని ఉపయోగించే భారతదేశంలోనే మొట్టమొదటి, ఏకైక యాప్ జార్ (Jar). భారతదేశంలోని జనాభాకు మైక్రో-సేవింగ్స్, ప్రజాస్వామ్యబద్ధమైన పెట్టుబడులలో సాయం చేసేందుకు జార్ (Jar) యాప్ ఎన్​పీసీఐ (NPCI), ప్రధాన యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల ఆశీస్సులతో, పూర్తిగా ఆటోమేటెడ్ సొల్యూషన్స్‌తో మన ముందుకు వచ్చింది.

 

కింది ఫీచర్లు ఉన్నందున యూజర్లు జార్ (Jar) యాప్‌ని ఇష్టపడుతున్నారు:

 

●  మీరు కేవలం 45 సెకన్లలోనే జార్ (Jar) యాప్ అకౌంట్​ను రూపొందించుకోవచ్చు. ఇది పేపర్‌లెస్ ప్రక్రియ. అంతేగాక, జార్ (Jar) యాప్‌లో పొదుపు చేయడం ప్రారంభించడానికి కేవైసీ అవసరం కూడా లేదు.

●  మీరు ఎప్పుడైనా మీ బంగారాన్ని విక్రయించవచ్చు. మీ ఇంటి నుండే మీ బ్యాంక్ అకౌంట్​కు మీ డబ్బును విత్​డ్రా చేసుకోవచ్చు. పైగా, ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ లేదు.

●  దీనిలో మీరు గేమ్‌లను ఆడటంతో పాటు మీ సేవింగ్స్​ను ఉచితంగా రెట్టింపు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు.

●  జార్ (Jar) యాప్ మీ సేవింగ్స్​ను ఆటోమేట్ చేస్తుంది. తద్వారా ప్రతీరోజు క్రమశిక్షణతో పొదుపు చేసేలా మీకు సహకరిస్తుంది.

● సెబీ (SEBI) గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా ఉన్న ఏ భారతీయ పౌరుడైనా జార్‌ (Jar) తో పెట్టుబడి పెట్టవచ్చు.

●  భౌతిక బంగారంలా కాకుండా, మీరు దొంగతనం గురించో లేదా ఖరీదైన లాకర్ ఫీజుల గురించో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ బంగారం బ్యాంక్-గ్రేడ్ ప్రపంచ స్థాయి లాకర్లలో ఉచితంగా నిల్వ చేయబడుతుంది.

 జార్ (Jar) యాప్ పురాతన పిగ్మీ డిపాజిట్ స్కీమ్‌ను కూడా డిజిటలైజ్ చేసింది, ఇది బ్యాంకు ఖాతా ఉన్న ప్రతీ భారతీయుడు ప్రతీరోజు రూ. 1 నుంచి మొదలుకొని నిర్దిష్ట మొత్తాన్ని ఆదా చేసేలా, దాన్న ఆటోమేటిక్​గా బంగారంలో పెట్టుబడి పెట్టేలా అనుమతిస్తుంది.

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.