Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అమ్మినప్పుడు భౌతిక, డిజిటల్ గోల్డ్ పై పన్ను ఎలా విధించబడుతుందో అర్థం చేసుకోవడం చాలా కీలకం. బంగారంపై విధించే పన్ను గురించి ఇక్కడ తెలుసుకోండి.
భారతీయులు సంప్రదాయంగా బంగారంలో పెట్టుబడి పెట్టేవారని మనకు బాగా తెలుసు.
ప్రస్తుతం భౌతిక రూపంలో లేని బంగారంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్ (ETF)లు, గోల్డ్ ఫండ్స్, గోల్డ్ బాండ్లు వంటి అవకాశాలు ఎక్కువవుతుండటంతో భారతదేశంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎంపికలు పెరిగాయి.
మీరు ఇప్పుడు భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయకుండానే బంగారంపై పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పై మా వివరణాత్మక గైడ్ ని చదవండి.
కానీ ఒక ఇన్వెస్టర్‌గా, మీరు బంగారం పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందినట్లయితే, మీరు వివిధ కేటగిరీల కింద మీ బంగారం పెట్టుబడులపై వచ్చే లాభాలపై కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
బంగారం లాభాలపై పన్ను ఎంత, బంగారం అమ్మకాల మూలధన లాభాలపై ఎలా పన్ను విధించబడుతుందో మీకు తెలుసా ?
మీరు బంగారం మీద పెట్టుబడి పెడుతున్నా లేదా ఇప్పటికే బంగారం కలిగి ఉన్నా, ఫిజికల్, డిజిటల్ గోల్డ్ అమ్మినప్పుడు పన్ను ఎలా విధిస్తున్నారనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
భారతీయ ఆదాయ పన్ను శాఖ బంగారాన్ని ఒక పెట్టుబడి కిందే లెక్కిస్తుంది. కాబట్టి బంగారం ఏ రూపంలో ఉన్నా దానిపై పన్ను విధించడం జరుగుతుంది.
డిజిటల్, ఫిజికల్ గోల్డ్‌పై ఆదాయపు పన్ను ఎలా విధించబడుతుందో జార్ (Jar) మీకు వివరిస్తుంది:
సాధారణంగా బంగారాన్ని నగల రూపంలో, గోల్డ్ బార్స్ రూపంలో, నాణేల రూపంలో, డిజిటల్ గోల్డ్ లా కొనుగోలు చేయవచ్చు.
భౌతిక బంగారం అమ్మకం నుంచి వచ్చే మూలధన లాభంపై అది స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా అన్న దాని ఆధారంగా పన్ను విధించబడుతుంది.
కొనుగోలు చేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాలలోపు మీరు మీ బంగారు ఆస్తులను (బంగారు ఆభరణాలు, డిజిటల్ గోల్డ్ లేదా నాణేలు కావొచ్చు) అమ్మినట్లయితే, ఆ అమ్మకం నుంచి వచ్చే ఏదైనా ఆదాయం స్వల్పకాలిక మూలధన లాభం (STCG)గా పరిగణించబడుతుంది.
ఇది ప్రాథమికంగా మీ వార్షిక ఆదాయానికి జోడించబడుతుంది. ఫలితంగా మీ ఆదాయం ఆదాయపు పన్ను శ్లాబులలో దేని కింద పడితే మీరు దానిలో పేర్కొన్న శాతంలో పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు, మీరు కొనుగోలు చేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తరువాత మీ ఆభరణాలు, బంగారు నాణేలు లేదా డిజిటల్ గోల్డ్ ని విక్రయిస్తే, అమ్మకం నుంచి వచ్చే ఆదాయం దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG)గా వర్గీకరించబడుతుంది.
బంగారు ఆస్తుల అమ్మకం నుండి వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలు వర్తించే సర్ఛార్జ్, ఎడ్యుకేషన్ సెస్‌తో కలిపి 20% పన్ను విధించబడుతుంది.
సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు ఇండెక్సేషన్‌తో పన్నులను లెక్కించాలి. ఇండెక్సేషన్ అనేది హోల్డింగ్ కాలంలో ద్రవ్యోల్బణం రేటు పెంచడం ద్వారా కొనుగోలు ఖర్చును ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసే ప్రక్రియ.
విలువ ఎంత ఎక్కువగా ఉంటే, లాభం ఎంత తక్కువగా ఉంటుంది. అందువల్ల మొత్తం పన్ను ఆదాయం తక్కువగా ఉంటుంది.