Buy Gold
Sell Gold
Daily Savings
Digital Gold
Instant Loan
Round-Off
Nek Jewellery
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏంటి? వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడం, అంతేకదా?
మన వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం ఇది ఎంతగానో అవసరం. భవిష్యత్ కోసం డబ్బును కూడబెట్టడం, పై చదువులు, ఆస్తుల కొనుగోలు, విదేశాలకు ప్రయాణించడం, రిటైర్మెంట్ ప్రణాళికలు తదితరాల కోసం.
ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది తరచూ మారే ప్రక్రియ. ఇది ప్రతి సందర్భంలో పర్యవేక్షణను కోరుతుంది. దీని విషయంలో నిరంతర పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. కానీ, అవసరమైన సమయాల్లో మీకు కావాల్సిన రిస్కు తగ్గించగల ప్రయోజనాలను, అవసరమైన డబ్బును అందిస్తుంది.
డబ్బును ఖర్చు చేయడం కోసం, పెట్టుబడిగా పెట్టడం కోసం తగిన ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించడం చాలా అవసరం.
దీని కోసం సమర్థవంతమైన ఆలోచన అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా పరిశోధనతో పాటు, బడ్జెటింగ్ చాలా అవసరం.
భారతదేశంలో కూడా విజయవంతమైన, సురక్షితమైన భవిష్యత్తును పొందాలని అనుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది తప్పనిసరిగా చాలా అవసరం.
మీరు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే మీ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలి, ఎలా పెట్టుబడులు పెట్టాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను మేనేజ్ చేసుకోవడం కేవలం ధనవంతులు, అధిక సంపాదన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని మీరు నమ్మితే అది చాలా తప్పు.
మీరు వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక వేసుకునేందుకు ధనవంతులు అయి ఉండాల్సిన పని లేదు. అయితే, మీరు ఆర్థిక ప్రణాళికను వేసుకున్న తర్వాత ధనవంతులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నెలవారీ భత్యం లభించే కాలేజీ విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, ఒంటరి వ్యక్తి అయినా, కొన్ని ఆస్తులు మాత్రమే ఉన్న గృహస్తులు అయినా, ఎవరైనా కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం చాలా అవసరం.
మీకు ఇంకా నమ్మకం కుదరలేదా..? మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగా నిర్వహించుకుంటే కింద పేర్కొన్న అంశాల్లో మీకు బాగా సహాయకారిగా ఉంటుంది. ఆ అంశాలు:
1. ఆదాయ నిర్వహణ (మేనేజ్మెంట్)
2. క్యాపిటల్ (మూలధన పెట్టుబడి)
3. బెటర్ క్యాష్ ఫ్లో (మంచి నగదు ప్రవాహం)
4. పెట్టుబడులు
5. కుటుంబ భద్రత
6. విలువైన పరిజ్ఞానం
7. అత్యవస పరిస్థితుల కోసం చేసే పొదుపులు
8. ఆన్‌గోయింగ్ సపోర్ట్
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మొదటి దశ ప్రణాళిక వేసుకోవడం. ఇక్కడ మీరు కింద పేర్కొన్న విషయాలపై అధిక దృష్టి పెట్టాలి:
భవిష్యత్‌లో మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూసుకోవడం కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం.
ఇది మీరు ఎలా ఖర్చు చేయాలనే విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకునేలా చేస్తుంది. అంతేకాకుండా మీ బంగారు భవిత కోసం బాధ్యత వహిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడం వలన మీరు అనుకున్న దాని కంటే ముందుగానే మీరు నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.
మీకు ఎటువంటి ఆర్థిక లక్ష్యాలు లేకపోతే మీ ఖర్చులు బడ్జెట్‌ను మించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు మొదటగా చేయాల్సింది మీ ఆర్థిక స్థితిని బట్టి మీ ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకోండి. అలా చేసినపుడు మీ ఖర్చులు తగ్గుతాయి. మీకు అవసరమైనపుడు డబ్బు లభిస్తుంది.
మీరు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత మీ ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారో అంచనా వేసుకోగలుగుతారు.
ప్రస్తుత రోజుల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అనేక సాఫ్ట్వేర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ ఆర్థిక వివరాలను అప్లోడ్ చేయడానికి కూడా అనుమతిస్తాయి. దీని ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక నిపుణుడిని కూడా నియమించుకోవచ్చు.
ఆదాయపు పన్ను అనేది ఒక ముఖ్యమైన విషయం. ఒక ఇన్వెస్టర్ అతడు లేదా ఆమె పన్ను గురించి అంచనా వేయకుండా సరైన ఆర్థిక ప్రణాళికను ఏర్పాటు చేసుకోలేరు.
మీరు మీ ఆదాయపు పన్నులను గురించి ప్లాన్ చేస్తున్నపుడు వాటి గురించి బాగా ఆలోచించాలి. ట్యాక్స్ ఎఫీషియెంట్ పద్ధతులపై పరిశోధన చేయాలి.
భారతీయులకు వారి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా అనేక ఆంశాల్లో పన్ను మినహాయింపులు, ప్రయోజనాలు ఉన్నాయి.
మీరు మీ ఖర్చులను, పెట్టుబడి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినపుడు పన్నులను కూడా తగ్గించుకోవచ్చు. దీని ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు.
మీ పదవీ విరమణ అనంతర జీవితం గురించి ఇప్పుడే ప్లాన్ చేయడం చాలా తొందరగా అనిపించవచ్చు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పడం ఎవరి వల్లా సాధ్యం కాదు.
పదవీ విరమణ ప్రణాళిక విషయానికి వస్తే ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఏదైనా ఫండ్ లో పెట్టుబడులు పెట్టడం అనేది మీకు, మీ కుటుంబానికి ఆర్థిక పరమైన సంరక్షణతో పాటు మానసిక ప్రశాంతతను అందజేస్తుంది.
పెన్షన్ ప్లానింగ్‌లో మొదటి దశ.. మీరు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారో నిర్ణయించుకోవడం. దాని ప్రకారం మీ డబ్బును ఆదా చేసుకోవడం.
మీరు దాని గురించి అంతగా ఆలోచించనపుడు అంతగా చింతించాల్సిన అవసరం లేదు. ముందుగా ప్రారంభించడం అవసరం. ఆలస్యం చేయడం మంచిది కాదు. ఆలస్యం చేస్తే మీరు మీ లక్ష్యాలను చేరుకోలేరు.
పెట్టుబడి ప్రణాళిక అనేది మీ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు, టార్గెట్లకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను పోల్చుకోవడం.
తెలివిగా పెట్టుబడులు పెట్టడం వలన మన భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవచ్చు. చాలా రిచ్ లైఫ్ మెయింటేయిన్ చేయొచ్చు.
అంతేగాక, ఆదాయం, అప్పులు, ఖర్చులు, పన్నులు మొదలైన వాటిని నిర్వహించడానికి సరైన విధానాన్ని కూడా అందిస్తుంది.
మీ పెట్టుబడి ప్రణాళికకు మద్దతు ఇవ్వడానికి మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. ఇది మంచి ఆర్థిక లక్ష్యాలను స్థాపించడంతో ప్రారంభమవుతుంది.
వివాహం, విద్య, కుటుంబం, హాలిడే ట్రిప్, ఎమర్జెన్సీ ఇలా ప్రతి దాని కోసం ఓ కొత్త పెట్టుబడి ప్రణాళిక అవసరం.
డబ్బును పొదుపు చేయడానికి ఉన్న ముఖ్య మార్గం ఏమిటంటే.. పొదుపును మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం. డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలిపే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి:
మీరు ఎంత సంపాదించినా కానీ మీ సంపాదన కంటే ఎక్కువగా ఖర్చు చేస్తే జీవితంలో సాఫీగా ముందుకు సాగడం చాలా కష్టం.
మీరు చేసే ఖర్చులను ఎలా నియంత్రించాలో తెలుసుకోండి. మీకు ఇప్పటికే ఉన్న విషయాలను అర్థం చేసుకోండి. మీరు ఖర్చులను తగ్గించడం ద్వారా ఎక్కువ డబ్బును తొందరగా ఆదా చేయగల్గుతారు.
మీ బడ్జెట్ ప్రోగ్రాములను మేనేజ్ చేసేందుకు నేడు ఆన్లైన్లో అనేక యాప్‌లు, టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడం చాలా సులభం.
మీ అన్ని ఖాతాల నుంచి డెబిట్, క్రెడిట్ అయ్యే లావాదేవీలన్నీ బడ్జెట్లో తప్పకుండా చేర్చాలి.
మీ ఖర్చులను తగ్గించుకోవడానికి, మీరు ఏ ఏ కేటగిరీల మీద ఎంత ఖర్చు చేస్తున్నారో వర్గీకరించే అనేక సాఫ్ట్వేర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
మీ వద్ద సరైన బడ్జెట్ స్కీమ్ కనుక లేకపోతే మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో, అనవసర ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
మీకు కనుక బడ్జెట్‌ను పాటించడం ఇబ్బందిగా ఉండి పొదుపు చేయలేకపోతున్నట్లు అయితే 50/30/20 రూల్‌ని పాటించండి. ఈ రూల్ లక్ష్యం మీ పొదుపును పెంచడమే.
1. మీ ఆదాయంలో 50 శాతాన్ని రోజువారీ అవసరాలైన ఆహారం, ఇల్లు, పబ్లిక్ సర్వీస్, హెల్త్ ఇన్సూరెన్స్ మొదలయిన వాటికి వినియోగించుకోవాలి.
2. మీ ఆదాయంలో 30% డబ్బును ఆహారం, షాపింగ్, ఇతర హాబీల కొరకు వాడండి.
3. మీ ఆదాయంలోని మరో 20% డబ్బును కాలేజీ ఫీజులు, పెన్షన్ స్కీమ్స్, అత్యవసర అవసరాల కోసం పొదుపు చేయండి.
సోషల్ మీడియా మన ఎంపికలను నియంత్రించినప్పుడు మనలో ప్రతి ఒక్కరూ హై క్వాలిటీ లైఫ్ స్టైల్లో జీవిస్తారు.
మనం అత్యుత్తమ బంగారు ఆభరణాలు, దుస్తులు ధరిస్తాం. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో భోజనం చేస్తాం. పెద్ద పెద్ద హోటళ్లలో బస చేస్తాం, ఎస్ యూ వీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) కార్లలో పయనిస్తాం.
కొంత మంది ఇటువంటి జీవనశైలిని భరించలేని వారు కూడా ఉంటారు. అటువంటి వారు ఎలాగోలా సర్దుకుపోతూ ఉంటారు. కానీ కొంత మంది అనవసరంగా గొప్పలకు పోయి అప్పులు మీద వేసుకుంటారు.
మీరు చేయగలిగినంత కాలం రుణాన్ని మేనేజ్ చేయడానికి ఇది ఉత్తమమైన విధానం. కానీ మీరు అనుకోకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లయితే ఆర్థిక సలహాదారు సాయంతో సులభంగా రుణ విముక్తులు కావొచ్చు. ఇది మీకు చాలా ప్రశాంతతనిస్తుంది. వారి మద్దతు మీకు చాలా సాయం చేస్తుంది.
నేటి ఆర్థిక సామ్రాజ్యంలో ఒక ఇన్వెస్టర్ యొక్క విజయాన్ని అంచనా వేయడానికి ప్రస్తుత ఫైనాన్షియల్ ఇండస్ట్రీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని రిస్క్ చేసే ఏ పెట్టుబడిదారుడైనా తనకు భవిష్యత్‌లో మూలధనం కోసం ఎటువంటి ఇబ్బంది లేదని గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.
మీ పెట్టుబడి వ్యూహాలకు అనుగుణంగా మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం చాలా అవసరం. మీరు పెట్టిన పెట్టుబడులు నిరంతరం వృద్ధి చెందేందుకు క్రమబద్ధమైన పద్ధతిని అనుసరించండి.
మన దేశంలో ప్రస్తుతం చాలా రకాల పెట్టుబడి విధానాలు అందుబాటులో ఉన్నాయి. మీరు అవసరమైతే డబ్బులను ఇంటిలోనే ఉంచుకోవచ్చు. లేదా మీకు నచ్చిన విధానంలో పెట్టుబడులు పెట్టవచ్చు.
● మ్యూచువల్ ఫండ్స్
● ఇన్సూరెన్స్ ప్లాన్స్
● ఈక్విటీ, స్టాక్స్
● సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు
● భూమి, ప్రాపర్టీ, ఎక్విప్మెంట్ వంటి స్థిర ఆస్తులు
● ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్, స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్
● కమోడిటీలు
వీటిలో ప్రతీ దానిలో సూటబిలిటీ, పెట్టుబడికి అయ్యే ఖర్చు, ఎదురయ్యే రిస్కు, రాబడి అవకాశం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు కింది వాటిని మనసులో ఉంచుకోండి:
● సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడులను ఎంచుకోండి.
● తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్ల పట్ల మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి.
● మీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉండండి.
● మీకు వచ్చే లాభాల యొక్క ఆదాయపు పన్ను ప్రభావాలను లెక్కలోకి తీసుకోండి.
● అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని పెట్టుబడులకు దూరంగా ఉండండి.
వివరంగా చెప్పాలంటే... ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక వ్యక్తి తన ఆదాయాన్ని, పెట్టుబడులను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం. దీనినే ఆర్థిక ప్రణాళిక అని అంటారు.
ఇది మీరు సౌకర్యవంతంగా జీవించడానికి, మీపై ఆధారపడిన వారు మంచి పరిస్థితుల్లో బతకడానికి తోడ్పడుతుంది. వారు ఎలాంటి బాదర బందీ లేని పదవీ విరమణ జీవితం కోసం పొదుపు చేస్తూనే జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది.