Playstore Icon
Download Jar App
Financial Education

ఫ్రీలాన్సర్లు ఐటీ రిటర్నులను (ITR) ఎలా దాఖలు చేయాలి - దీనికి సంబందించిన మార్గదర్శకాలు

December 28, 2022

మీరు ఒక ఫ్రీలాన్సర్​గా ఉంటూ ఐటీ రిటర్నులను (ITR) దాఖలు చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు సరైన చోటులోనే ఉన్నారు. ఫ్రీలాన్సర్‌ల కోసం ఐటీ రిటర్నులను (ITR) దాఖలు చేయడానికి సంబందించిన మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి.

మీరు ఒక ఫ్రీలాన్సరా? 9 నుంచి 5 గంటల వరకు పని చేస్తూ జీతాన్ని తీసుకునే సాధారణ ఉద్యోగి కాదా? కానీ మీ సంపాదన ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి కన్నా ఎక్కువగా ఉందా?

అయితే మీరు తప్పనిసరిగా ఆదాయ పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలి. ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ఇతర జీతాలు పొందేవారు లేదా కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులాల మాదిరిగా ఫ్రీలాన్సర్లు కూడా ఆదాయాలపై తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాలి.

మీరు సకాలంలో మీ పన్నులను చెల్లించే ప్రక్రియలో సహాయం చేయడానికి మేము జార్​ వద్ద సిద్ధంగా ఉన్నాము. 

ఫ్రీలాన్సర్లు అంటే ఎవరు? వారు ఐటీ రిటర్నులను (ITR) దాఖలు చేయాలా?

తమ సొంత ఇల్లు, పార్క్ లేదా కేఫ్ ఇలా ఎక్కడినుంచైనా అనేకమంది క్లయింట్ల కోసం వివిధ రకాల ప్రాజెక్ట్‌లలో పని చేసే స్వయం ఉపాధి కలిగిన వారే ఫ్రీలాన్సర్లు.

మార్కెటింగ్ కన్సల్టెంట్లు, వెబ్‌సైట్ డిజైనర్లు, కన్సల్టెన్సీలు, సాఫ్ట్‌వేర్ డిజైనర్లు, సోషల్ మీడియా మేనేజర్లు, కంటెంట్ రైటర్లు - ఇవన్నీ ఫ్రీలాన్స్‌గా పనిచేయగలిగే కొన్ని ఉద్యోగాలు, ఈ ఫ్రీలాన్సర్లు తమ క్లయింట్లకు మాన్యువల్, ఇంటెలెక్చువల్ సర్వీసులను అందించడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. 

అయితే, ఈ ప్రయోజనాలు ఎటువంటి ఖర్చు లేకుండా పొందలేరు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ఫ్రీలాన్సర్లు కూడా ఇతర వ్యాపారవేత్తలు లేదా జీతం పొందే ఉద్యోగిలాగానే, వారి సంపాదనపై ప్రభుత్వానికి పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్రీలాన్సర్ల కోసం ఐటీ రిటర్నుల (ITR) ఫైలింగ్ - అకౌంటింగ్ విధానాలు

ఒక ఫ్రీలాన్సర్‌గా, మీకు ఫారమ్–16ని అందించి, ఐటీ రిటర్నుల (ITR) దాఖలు ప్రక్రియలో మీకు సహాయం చేయడానికి హెచ్​ఆర్​ విభాగం లేనందున మీ ఐటీ రిటర్నులను (ITR) సబ్మిట్ చేయడం కొంచెం కష్టంగా ఉండవచ్చు.

పైగా, ఎక్కువ మంది క్లయింట్లు, వివిధ రకాల ఆదాయాలు, ఖర్చులను కలిగి ఉన్నందున మరిన్ని లెక్కలు, రికార్డ్ కీపింగ్ అవసరం.

ఆదాయం, ఖర్చులకు సంబంధించి ఇతర ఉద్యోగం లేదా సంస్థ కోసం ఎలా అయితే ఐటీ రిటర్నుల (ITR) ని దాఖలు చేస్తాయో అదే విధానాన్ని ఒక ఫ్రీలాన్సర్‌గా మీరు కూడా అనుసరించాలి. 

ప్రాజెక్ట్ ఆధారంగా, నెలవారీ రిటైనర్లు మొదలైన వివిధ రకాల పేమెంట్లు మీరు కలిగి ఉండవచ్చు. కానీ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 44ఏఏ ప్రకారం, రాబడి, ఖర్చులకు సంబందించిన సరైన రికార్డుల కోసం మీరు తప్పనిసరిగా అకౌంటింగ్ బుక్​ను పెట్టుకోవాలి.

అలా చేయడానికి అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్, క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకోండి.

ఫ్రీలాన్సర్లకు వర్తించే పన్నులు, ఐటీ రిటర్నుల (ITR) ఫైలింగ్ 

భారతదేశంలో ఫ్రీలాన్సర్లు ఆదాయ పన్ను, జీఎస్టీకి లోబడి ఉంటారు. ఒక ఫ్రీలాన్సర్ వార్షిక ఆదాయం రూ. 20 లక్షలు (ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలలో రూ. 10 లక్షలు) మించి ఉంటే, అతను/ఆమె తప్పనిసరిగా జీఎస్టీ కోసం రిజిస్టర్ చేసుకోవాలి.

మెజారిటీ సర్వీసులకు జీఎస్టీ రేటు 18% అయితే ఫ్రీలాన్సర్ అందించే గూడ్స్, సర్వీసులను అనుసరించి కొంత మార్పు ఉండవచ్చు.

ఫ్రీలాన్సర్లు అదనంగా ప్రస్తుత రేటు ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాలి. 60 ఏళ్లలోపు ఫ్రీలాన్సర్లకు వర్తించే ఆదాయ పన్ను రేట్లు కింది విధంగా ఉన్నాయి:

పాత ట్యాక్స్ విధానం ప్రకారం:

కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం:

మీరు ఫ్రీలాన్సర్‌గా ఏ ఐటీ రిటర్న్​ (ITR) ఫారాన్ని ఉపయోగించాలి?

ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫ్రీలాన్సర్ ఫారమ్ ఐటీఆర్​ 4ను ఉపయోగించాల్సి ఉంటుంది. మీ సంపాదన రూ. 1 కోటి దాటినట్లయితే మీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేయాలి. 

మీ టర్నోవర్ రూ. 1 కోటి కంటే తక్కువ ఉంటే ఆడిట్ అవసరం లేదు. ప్రీజెంటివ్ మెథడ్ ఆఫ్ టాక్సేషన్‌ను ఎంచుకుంటే ఫ్రీలాన్సర్ ఐటీఆర్​ ఫారం 4Sను ఉపయోగించాలి.

ఫ్రీలాన్సర్ల కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్

ఫ్రీలాన్సర్ల కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేయడానికి సులభమైన స్టెప్పులు:

⦁స్టెప్ 1:  ఇన్‌కమ్ ట్యాక్స్ కోసం ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి.

⦁స్టెప్ 2: ఐటీఆర్​-4 'డౌన్‌లోడ్' పేజీలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

⦁స్టెప్ 3: ఐటీఆర్​-4 ఫారమ్‌ను మీ అన్ని వివరాలతో పూర్తి చేయండి.

సాధారణ వివరాలు, స్థూల మొత్తం ఆదాయం, మినహాయింపులు, పన్ను వర్తించగల మొత్తం ఆదాయం, వ్యాపారం, వృత్తిలో పొందే ఆదాయ వివరాలు, టీడీఎస్​ (సోర్స్ వద్ద పన్ను మినహాయించబడింది) వివరాలు, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్-అసెస్‌మెంట్ ట్యాక్స్ వివరాలను పూరించండి.

⦁స్టెప్ 4: మీ ట్యాక్స్‌లను లెక్కించడానికి ఫారమ్ 26ఏఎస్​ ఉపయోగించండి.

ట్యాక్స్‌లపై డబ్బు ఆదా చేయడానికి, మీరు అనేక సెక్షన్ల కింద ట్యాక్స్ డిడక్షన్, మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఫ్రీలాన్స్ పని కోసం ఆస్తిపై అద్దె, మరమ్మతు ఛార్జీలు, ప్రయాణ ఖర్చులు, కంపెనీ ఆస్తిపై మున్సిపల్ పన్నులు, డొమైన్ రిజిస్ట్రేషన్ ఖర్చులు వంటి ఒక ట్యాక్స్ ఇయర్‌లో చేసే పూర్తి ఖర్చులను కూడా క్లెయిమ్ చేయవచ్చు.

ఐటీఆర్​ సబ్మిట్ చేసే ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు:

⦁ స్థూల రశీదులు తప్పనిసరిగా జాబితాలో ఉంచాలి- ఫ్రీలాన్సర్లు తప్పనిసరిగా ఆర్థిక సంవత్సరంలో ఫ్రీలాన్సింగ్ పని కోసం చేసిన ఖర్చుల యొక్క అన్ని రశీదులను ట్రాక్ చేయాలి.

⦁ ఖర్చులను క్లెయిమ్ చేయాలి - ఖర్చులను క్లెయిమ్ చేసేటప్పుడు, ఫ్రీలాన్సర్లు ఈ కింది అంశాలను గుర్తుంచుకోవాలి:

⦁ ఫ్రీలాన్స్ పనికిగాను అయ్యే  ఖర్చు.

⦁ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖర్చు అయ్యే మొత్తం, ఉదాహరణకు, ఏవై 2021-22 కోసం 2020-21లో ఎఫ్​వై 

⦁ వ్యక్తిగతమైన, మూలధనంపై చేసిన వ్యయాలను ఖర్చులుగా పేర్కొనకూడదు. 

⦁ ఇతర కారణల కోసం ఖర్చు పెట్టబడినది ఉండకూడదు. అది క్రిమినల్ నేరం లేదా చట్టం ద్వారా నిషేధించబడింది.

⦁ నగదు రూపంలో చెల్లించినట్లయితే, రోజుకు రూ. 10,000 కంటే ఎక్కువ ఖర్చులు మినహాయింపుగా గుర్తించబడవు.

⦁ మూలధన వ్యయాన్ని ఖర్చుగా క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. ల్యాప్‌టాప్, ఫర్నిచర్ మొదలైనవాటిని కొనుగోలు చేయడం వంటివి.

ఖర్చులను మినహాయించండి

మీ క్లయింట్లకు ఫ్రీలాన్స్ సర్వీసులను అందించే పనిలో మీరు అనేక ఖర్చులను భరించి ఉండవచ్చు. ఇంటర్నెట్ ఫీజులు, అద్దె, ప్రయాణ ఖర్చులు, హాస్పిటాలిటీ, వినోద ఖర్చులు, తరుగుదల, నిర్వహణ, సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు, ఆఫీసు ఫర్నిచర్ ఖర్చులు, ఇతర యుటిలిటీ బిల్లులు అలాంటివాటికి కొన్ని ఉదాహరణలు.

మీ ఫ్రీలాన్సింగ్ పనిలో మీరు ఇతరుల సహాయాన్ని కూడా తీసుకొని ఉండవచ్చు. ఇది మీ ఖర్చును లెక్కించేటప్పుడు పరిగణించవలసిన మరొక ఖర్చు.

ఇచ్చిన అసెస్‌మెంట్ సంవత్సరానికి మీరు సంపాదించిన ఆదాయంపై విధించదగిన నికర ట్యాక్స్ చేరుకోవడానికి, మీరు మీ స్థూల ఆదాయం నుండి మీ ఫ్రీలాన్సింగ్ ఆదాయాన్ని పొందడానికి చేసిన ఈ ఖర్చులన్నింటినీ తప్పనిసరిగా తీసివేయాలి.

కొన్ని ఖర్చులు మినహాయించబడవచ్చు:

⦁ మీరు మీ ఉద్యోగాన్ని నిర్వహించడానికి ఆస్తిని అద్దెకు తీసుకుంటే చెల్లించిన అద్దె.

⦁ అంగీకరించినట్లుగా అద్దెకు తీసుకున్న ఆస్తిపై మరమ్మతుల కోసం చెల్లించిన ఖర్చులు. 

⦁ మీసొంత వ్యాపార ఆస్థి మరమ్మతుల కోసం చేసిన ఖర్చు. 

⦁ మీ ల్యాప్‌టాప్, ప్రింటర్ లేదా ఇతర పరికరాల మరమ్మతులు.

⦁ ప్రింటర్ కొనుగోలు, కార్యాలయ సామగ్రి, నెలవారీ ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, రవాణా ఖర్చుల వంటి మీ పని సమయంలో అయ్యే ఖర్చులన్నీ.

⦁ భారతదేశం లోపల లేదా వెలుపల ఉన్న క్లయింట్లను కలవడానికి చేసే ప్రయాణ ఖర్చులు.

⦁ భోజనం, వినోదం లేదా ఆతిథ్యం కోసం అయ్యే ఖర్చులు.

⦁ మీరు క్లయింట్ మీటింగులను నిర్వహించినప్పుడు, మీ క్లయింట్లను భోజనానికి తీసుకెళ్లినప్పుడు లేదా కొత్త వ్యాపారాన్ని పొందడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత పెంచడానికి చేసే ఇతర విహారయాత్రలకు వెళ్లినప్పుడు అవి క్లెయిమ్ చేయబడతాయి.

⦁ మీ ప్రాంతంలోని మీ సొంత కంపెనీ ఆస్తిపై ట్యాక్స్, ఇన్సూరెన్స్.

⦁ డొమైన్ రిజిస్ట్రేషన్, మీ ప్రోడక్ట్ పరీక్షించడానికి సాఫ్ట్‌వేర్ కొనుగోలు కూడా అనుమతించదగిన ఛార్జీలు.

టీడీఎస్​ (TDS) సర్దుబాట్లు

సోర్స్ (TDS) నుండి మినహాయించబడిన పన్నుగా మీరు ఫ్రీలాన్స్ (ఐటీ చట్టంలోని సెక్షన్ 194జే ప్రకారం) ఖాతాదారుల కోసం మీ మొత్తం చెల్లింపు నుండి 10% పన్నును మినహాయించండి.

మీరు మీ ట్యాక్స్ శ్లాబును బట్టి ఐటీ విభాగం నుండి రిటర్న్‌కు అర్హులు కావచ్చు. ఇంకా, మీరు మీ ఫ్రీలాన్స్ పనిలో సహాయం చేయడానికి ఎవరినైనా నియమించుకుంటే, మీరు దానిని వారికి పంపే ముందు వారి డబ్బు నుండి 10% పన్నుగా మినహాయిచాలి. మీ రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు, మీరు ఈ మొత్తాన్ని తప్పనిసరిగా టీడీఎస్​గా తీసివేయాలి.


జీఎస్టీ

సంవత్సరానికి మీ మొత్తం ఆదాయం రూ. 20 లక్షలకు చేరుకుంటే, మీరు తప్పనిసరిగా జీఎస్టీ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. మీ వార్షిక ఆదాయం రూ. 20,000 కంటే తక్కువగా ఉంటే, మీరు జీఎస్టీ నుండి మినహాయించబడతారు.

మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు అర్హత కలిగి ఉన్నట్లయితే లేదా ఇప్పటికే జీఎస్టీ నంబర్‌ను కలిగి ఉన్నట్లయితే మీరు మీ ఖాతాదారుల నుండి తప్పనిసరిగా జీఎస్టీని వసూలు చేయాలి. మీరు అందించే ఫ్రీలాన్స్ సర్వీసుపై ఆధారపడి జీఎస్టీ రేటు మారుతుంది, కానీ జీఎస్టీ పరిధిలోకి వచ్చే చాలా సర్వీసులకు 18% ట్యాక్స్ ఉంటుంది.

అడ్వాన్స్ ట్యాక్స్

పేర్కొన్న సంవత్సరానికి మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ రూ. 10,000 మించి ఉంటే, మీరు ఫ్రీలాన్సర్‌గా ట్యాక్స్‌లను చెల్లించాల్సి ఉంటుంది.

ముందస్తుగా చెల్లించినందున ఈ రకమైన పన్నును 'అడ్వాన్స్ ట్యాక్స్' అంటారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి త్రైమాసికం ముగిసేలోపు మీరు మీ ట్యాక్స్‌లో పేర్కొన్న సదరు మొతాన్ని చెల్లించవలసి ఉంటుంది. 

ఐటీ శాఖ యొక్క చలాన్ 280ని ఉపయోగించి అడ్వాన్స్ ట్యాక్స్‌లను చెల్లించవచ్చు. మీరు ఈ చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీకు రశీదు ఇవ్వబడుతుంది.

మీ ఐటీ రిటర్నులను (ITR) దాఖలు చేసేటప్పుడు ఈ రశీదు అవసరమవుతుంది. మీరు అడ్వాన్స్ ట్యాక్స్‌కు అర్హులు అయితే సెక్షన్లు 234బీ, 234సీ కింద చెల్లించకుండా ఉంటే మీపై జరిమానా విధించబడుతుంది.

నేను నా ట్యాక్స్ రిటర్న్‌ను ఎప్పుడు ఫైల్ చేయాలి?

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31 (ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత దానిని దాఖలు చేయాలి). ఈ గడువును పొడిగించే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉంటుంది.

మీరు చివరి తేదీ మిస్​ అయినా లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువు ముగిసిన తర్వాత పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలనుకుంటే ఏమి చేయాలి?

మీరు చివరితేదీ మర్చిపోయినప్పటికి రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరానికి మూడు నెలల ముందు, ఆలస్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మీ ఐటీ రిటర్నును (ITR) దాఖలు చేయడానికి మీకు డిసెంబర్ 31, 2021 వరకు గడువు ఉంది, అది మార్చి 31, 2022 వరకు పొడిగించబడింది.

మీరు ఐటీ రిటర్నును (ITR) ఎలా, ఎప్పుడు దాఖలు చేయవలసి ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు, మీరు ప్రతీ సంవత్సరం చివరి తేదీకి ముందే ఈ ప్రాసెస్‌ను పూర్తి చేసేలా నిర్ధారించుకోవాలి.

(మీరు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలి అనుకోవడంలేదు, కదా?) మీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైళ్లను నీట్‌గా, స్ట్రాంగ్‌గా చేయడం ప్రారంభించండి.

ఫ్రీలాన్సర్‌గా, అకౌంట్​ బుక్, ప్రతీదాని రికార్డులను అందుబాటులో ఉంచుకోండి. సరైన ఫారాన్ని ఎంచుకోండి.

ఖచ్చితమైన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను ఫైల్ చేయండి; మీకు ఏదైనా సహాయం అవసరమైతే, నిపుణుడిని సంప్రదించడానికి సంకోచించకండి.

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.