Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
ఆన్‌లైన్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా చేయాలో అర్థం కావడం లేదా? అయితే చింతించకండి. మీ కోసం జార్ ఉంది. మీ గందరగోళాన్ని పోగొట్టేందుకు మా దగ్గర ఒక గైడ్ ఉంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-పైలింగ్ - ఆ పేరులోనే ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తూ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అని ఉంది. ఇప్పుడిది గతంలో మాదిరిగా చికాకు కలిగించే వ్యవహారం, చాలా సమయం తీసుకునే ప్రక్రియ కానే కాదు.
పొడవాటి లైన్లు, గడువులోపు ట్యాక్స్ ఫైల్ చేయలేమేమో అనే చింత ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి లేదా మీరు పని చేసుకునే చోటి నుంచే అతి తక్కువ సమయంలోనే ఆన్‌లైన్‌లో మీ రిటర్న్స్‌ను సులభంగా ఫైల్ చేయవచ్చు.
పదండి ప్రారంభిద్దాం:
భారతదేశంలో జీతం సంపాదించే వారు లేదా పొందే ప్రతీ ఒక్కరికీ ఆదాయ పన్ను వర్తిస్తుంది (మీరు భారతదేశ శాశ్వత నివాసి కావచ్చు లేదా ఎన్ఆర్ఐ కూడా కావచ్చు)
అయితే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ:
1. మీ వయస్సు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండటమే గాక మీ వార్షిక ఆదాయం కూడా రూ. 2,50,000 కంటే తక్కువగా ఉంటే
2. మీ వయస్సు 60 నుంచి 80 సంవత్సరాల (సీనియర్ సిటిజన్) మధ్యన ఉండి మీ వార్షిక ఆదాయం రూ. 3,00,000 కంటే తక్కువగా ఉంటే
3. మీ వయస్సు 80 ఏళ్లకు పైబడి ఉండి మీ వార్షిక ఆదాయం రూ. 5,00,000 కంటే తక్కువగా ఉంటే.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు ఎందుకు సకాలంలో ఫైల్ చేయాలనే దానికి అనేక కారణాలు ఉన్నాయి:
అర్హులైన ప్రతీ భారతీయ పౌరులు ప్రతీ ఆర్థిక సంవత్సరం ఖచ్చితంగా పన్నులు చెల్లించాలి. పన్నులు చెల్లించకపోతే రూ. 50,000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది.
ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించినట్టు అయితే దానిని తిరిగి చెల్లించమని పన్ను చెల్లింపుదారుడు కోరవచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మీరు చెల్లించిన అదనపు మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
మీ చిరునామా, ఆదాయాన్ని వెరిఫై చేసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఒక డాక్యుమెంట్‌గా ప్రభుత్వం అంగీకరిస్తుంది. అలాంటి అవసరం ఏర్పడిన చోట ఇది ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుంది. మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఒక చోటు నుంచే ట్రాక్ చేసేందుకు ఈ-ఫైలింగ్ సైట్ మీకు ఉపయోగపడుతుంది. ఇది సురక్షితమే గాక, సులభంగా నేర్చుకోవచ్చు. బ్యాంకింగ్ లేదా అలాంటి అవసరాల కోసం మీరు ఈ-ఫైలింగ్ రికార్డును ఇన్‌కమ్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు.
వాహన రుణం (2 వీలర్ లేదా 4 వీలర్ ) లేదా గృహ రుణ: కోసం మీరు దరఖాస్తు చేసినప్పుడు చాలా పెద్ద బ్యాంకులు, రుణాలిచ్చే సంస్థలు మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాపీ అడగవచ్చు. వీటి ద్వారా మీ లోన్ అప్లికేషన్‌కు సులభంగా ఆమోదం లభిస్తుంది.
గత సంవత్సరంలోని మీ వ్యాపార నష్టాలను మీరు భర్తీ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఆ పని చేసుకోవచ్చు.
మీరు వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు చాలా ఎంబసీలు, కాన్సులేట్స్ గడిచిన రెండు సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్స్ చూపించమని అడుగుతాయి. మీ వీసా అప్లికేషన్ ప్రక్రియ సులభంగా పూర్తయ్యేందుకు మీ ట్యాక్స్ రిటర్న్స్ దగ్గర పెట్టుకోండి.
వెంచర్ క్యాపిటలిస్టులు లేదా ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి మీరు నిధులు సమీకరించాలని అనుకుంటున్నారా? మీ దగ్గర అప్--టూ--డేట్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి. మీ వ్యాపార పురోగతి, లాభం, ఇతర ఖర్చుల అంశాలు పరిశీలించేందుకు చాలా మంది ఇన్వెస్టర్లు మీ వ్యాపార ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూస్తారు.
మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. పేపర్ ఫైలింగ్ ప్రక్రియతో పోల్చితే ఈ-ఫైలింగ్ చాలా సులభతరమే గాక వేగవంతం కూడా. పేపర్లు ఉపయోగించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడమనేది చాలా సమయం తీసుకుంటుంది, పైగా విసుగనిపిస్తుంది.
ఈ-ఫైలింగ్ అనేది పన్నుచెల్లింపుదారులకు ఒక వరం లాంటిది. అంతేకాదు ట్యాక్స్ రీఫండ్స్ కూడా చాలా వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి. వీటిని ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఫైల్ చేయవచ్చు.
మీ పన్నులు ఆన్‌లైన్‌లో చెల్లించడం వలన కలిగే ప్రయోజనాల్లో కొన్ని:
● బ్యాంకు లోన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రతీ వ్యక్తి అర్హులై ఉంటారు.
● థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిములు ప్రాసెస్ చేసేందుకు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఉపయోగపడుతుంది.
● భారతదేశం వెలుపల వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు సదరు వ్యక్తి ఇమిగ్రేషన్ ప్రొఫైల్‌కు ప్రాధాన్యత ఏర్పడుతుంది.
● ఎల్ఐసీ/జీఐసీ లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు లేదా ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల నుంచి పొందేందుకు
● ఎవరైనా వ్యక్తి ఐటీ రిటర్న్స్ ఫైల్స్ చేసినట్టు అయితే వారు సులభంగా స్టార్టప్ కోసం ఫైనాన్స్ పొందవచ్చు.
● ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు, ప్యానెల్స్‌లో స్థానం పొందేందుకు అర్హత లభిస్తుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పూర్తి చేసేందుకు మీ శాలరీ స్లిప్స్, బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటు దిగువ పేర్కొన్న పేపర్లు కూడా అవసరం:
1. ఫామ్ 16: దీన్ని మీకు మీరు పనిచేస్తున్న సంస్థ అందిస్తుంది. ఇందులో మీ జీతం వివరాలు, మినహాయించిన టీడీఎస్ వివరాలు ఉంటాయి.
2. ఫామ్ 16A: బ్యాంకుల్లో చేసే ఫిక్స్‌డ్ లేదా రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై టీడీఎస్ మినహాయింపు వివరాలు ఉంటాయి.
3. ఫామ్ 16B: మీరు ఏదైనా ఆస్తి అమ్మితే మీ నుంచి అందుకునే మొత్తానికి కొనుగోలుదారుడికి టీడీఎస్ వర్తిస్తుంది. ఆ వివరాలు ఈ ఫామ్‌లో ఉంటాయి.
4. ఫామ్ 18C: మీ అద్దెదారుడు మీకు చెల్లించిన అద్దెకు సంబంధించిన టీడీఎస్ వివరాలు ఈ ఫామ్‌లో ఉంటాయి.
5. ఫామ్ 26AS: ఇది పాన్ నెంబర్‌కు సంబంధించిన సమగ్ర ట్యాక్స్ స్టేట్‌మెంట్. మీరు పనిచేసే సంస్థ మినహాయించిన టీడీఎస్ బ్యాంకులు లేదా ఇతర సంస్థలు మీకు జరిపిన చెల్లింపుల వివరాలు ఇందులో ఉంటాయి.
ముందస్తు పన్ను చెల్లింపులు లేదా చెల్లించిన సెల్ఫ్ అసెస్‌మెంట్ పన్నులతో పాటు సెక్షన్ 80C నుంచి 80U వరకు ఉండే మినహాయింపులు అంటే జీవిత బీమా పాలసీ లేదా టర్మ్ ప్లాన్స్, పన్ను పొదుపు పెట్టుబడుల రుజువులు చూపాలి.
వివిధ వర్గాల వ్యక్తులు, ఆదాయ వనరులను బట్టి ఏడు రకాల ఐటీఆర్ ఫామ్స్ ఉన్నాయి. ఏ రూపేణా ఆదాయం వస్తుందనే దాన్ని బట్టి ప్రతి పన్ను చెల్లింపుదారునికి ఆదాయపు పన్ను శాఖ వివిధ ఫామ్స్ సూచిస్తోంది:
1. ITR – 1: ఇది మొత్తం ఆదాయం రూ. 50 లక్షలుగా ఉన్న నివాసితులకు (ఎన్ఆర్ఐ, హిందూ అవిభాజ్య కుటుంబాలు లేదా ఇతర సంస్థలకు కాదు) మాత్రమే. ఆ ఆదాయం ఈ దిగువ శ్రేణుల నుంచి రావాలి:
a) శాలరీ/పెన్షన్ నుంచి ఆదాయం; లేదా
b) ఒక ఇంటి ఆస్తి నుంచి ఆదాయం
c) ఇతర మార్గాల ద్వారా ఆదాయం
2. ITR – 2: ITR – 1 సమర్పించేందుకు అర్హులు కానటువంటి వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాల (HUFలు) కోసం ఇది ఉద్దేశించబడినంది. వ్యాపారం లేదా వృత్తి కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం కలిగిన వారు ITR – 2 ఫామ్ ఉపయోగించాలి.
3. ITR – 3: వ్యాపారం లేదా వృత్తి ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (HUFలు) కోసం ఈ ఫామ్ ఉద్దేశించబడినది.
4. ITR – 4: దిగువ తెలిపిన శ్రేణుల నుంచి రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన నివాసిత వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), సంస్థలు ( LLPలు కానటువంటివి) కోసం ఈ ఫామ్ ఉద్దేశించబడినది.
a) వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని సెక్షన్ 44AD లేదా 44AE లేదా 44ADA ద్వారా అంచనా వేసి లెక్కించబడినది
b) శాలరీ/పెన్షన్ నుంచి ఆదాయం
c) ఒక ఇంటి ఆస్తి నుంచి ఆదాయం
d) ఇతర మార్గాల ద్వారా ఆదాయం
5. ITR – 5: ITR – 7 ఫామ్ నింపే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), కంపెనీలు ITR – 5 ఫామ్ నింపాల్సిన అవసరం లేదు.
అన్ని రకాల భాగస్వామ్య సంస్థలు, LLPలు, AOPలు, BOIలు, AIJPలు, సహకార సంస్థలు, స్థానిక సంస్థలు, పెట్టుబడి ఫండ్స్, వ్యాపార ట్రస్టులు, చనిపోయిన వారి ఆస్తులు, దివాలా తీసిన వారు ఈ ఫామ్ ఉపయోగించాలి.
6. ITR – 6: సెక్షన్ 11 కింద మినహాయింపు కోరే కంపెనీలు మినహా మిగిలిన అన్ని రకాల కంపెనీలకు ఈ ఫామ్ ఉద్దేశించబడినది.
7. ITR – 7: సెక్షన్ 139(4A), 139(4B), 139(4C), 139(4D), 139(4E), or 139(4F) (4F) కింద రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన వ్యక్తులు, వ్యాపారాల కోసం ఈ ఫామ్ ఉద్దేశించబడినది. మతపరమైన, దాతృత్వ సంస్థలు, రాజకీయ సంస్థలు, శాస్త్రీయ పరిశోధనా సంఘాలు, విశ్వవిద్యాలయాలు, కాలేజీలన్ని కూడా దీని పరిధిలోకి వస్తాయి.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఉండే వివిధ అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జీతం అందుకునే ఉద్యోగి ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. దానికోసం కింద పేర్కొన్న సూచనలను అనుసరించండి:
స్టెప్ 1: ఆదాయ పన్ను శాఖ వారి ఈ-పైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2: ఈ వేదికను ఉపయోగించేందుకు మీ ఐడీ (PAN) పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ నమోదు చేయండి. ఒకవేళ మీరు రిజిస్టర్ కాకపోతే మీ పాన్ నెంబర్ ఉపయోగించి మీ అకౌంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. పాన్ నెంబర్ మీ యూజర్ ఐడీలా పనిచేస్తుంది.
స్టెప్ 3: ఈ-ఫైల్ సెక్షన్‌లో కనిపించే డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి సరైన అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకొని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌పై క్లిక్ చేయాలి. ఈ దశలో మీరు సరైన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫామ్ ఎంచుకోవాలి. ITR-1, ITR-2, ITR-3 అనే మూడు ఆప్షన్లు వేతనం అందుకునే ఉద్యోగులకు ఉన్నాయి.
స్టెప్ 4: మీరు ఒకవేళ సవరించిన రిటర్న్ ఫైల్ చేయనట్టు అయితే ఫైలింగ్ రకాన్ని'Original' అని ఎంచుకోవాలి.
స్టెప్ 5: సబ్మిషన్ మోడ్‌లో 'Prepare and Submit Online' ఎంచుకొని 'Continue' పై క్లిక్ చేయాలి.
స్టెప్ 6: మీ సంపాదన, కోతలు, మినహాయింపులు, పెట్టుబడులకు సంబంధించిన పూర్తి సమాచారంతో సరైన ఐటీఆర్ ఫామ్ పూర్తి చేయండి. ఆ తర్వాత మీరు జరిపిన టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ పన్ను చెల్లింపుల సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. మొత్తం సమాచారం సరైనదేనని నిర్ధారించుకోండి.
స్టెప్ 7: లెక్కించి పన్ను బకాయి ఉంటే చెల్లించండి. ఆ తర్వాత మీ ట్యాక్స్ రిటర్న్‌లో చలాన్ సమాచారం నింపండి. (పన్ను రూపంలో మీరు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోతే ఈ స్టెప్‌ను వదిలిపెట్టవచ్చు)
స్టెప్ 8: ఫామ్‌లో మీరు నింపిన సమాచారాన్ని మరోసారి పూర్తిగా చెక్ చేయండి. ఆ తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేయండి. అంతే.
జీతం అందుకునే ఉద్యోగి ఈ విధంగా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ -ఫైలింగ్ విజయవంతమైందని సూచిస్తూ ఈ సమయంలో మీ కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక సందేశం కనిపిస్తుంది. దాన్ని అనుసరిస్తూ ఒక అక్నాలెడ్డ్‌మెంట్ ఫామ్ అందుతుంది.
వీటిల్లో దేన్నైనా ఉపయోగించి మీరు మీ రిట్నర్స్ ఇప్పుడు పరిశీలన చేయించుకోవాలి:
● ఆధార్ ఓటీపీ (OTP)
● బ్యాంక్ అకౌంట్ నెంబర్
● డీమ్యాట్ అకౌంట్ నెంబర్
● రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్
● నెట్ బ్యాంకింగ్
● బ్యాంక్ ఏటీఎం
● అక్నాలెడ్జ్మెంట్ కాపీని పోస్ట్ ద్వారా బెంగుళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC) కి పంపి
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు జూలై 31 (ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత దీనిని ఫైల్ చేయాలి). ఈ గడువును పొడిగించే అధికారం ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది.
ఈ కారణంగా మార్చి 31, 2021తో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరపు తుది గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించడం జరిగింది.
గడువు తేదీ లోపు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ తుది గడువు ముగిస్తే ఏం జరుగుతుంది?
ఒకవేళ మీరు తుది గడువు దాటిపోయినా మీరు లేట్/బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరానికి మూడు నెలల తర్వాత కూడా మీరు లేట్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ పైల్ చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31, 2021. దీన్ని మార్చి 31, 2022 వరకు పొడిగించడం జరిగింది.
ఇప్పుడు మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం అర్థమైంది కాబట్టి, ఆ ప్రక్రియను ప్రతీ సంవత్సరం గడువు లోపు పూర్తి చేయండి. (మీరు చట్టాన్ని అతిక్రమించాలని అనుకోవడం లేదు కదా?) మీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్స్ బలంగా, స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి
సరైన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి, సాయం అవసరమైతే నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడవద్దు.