Playstore Icon
Download Jar App
Personal Finance

ఖర్చు చేయాలనే కోరిక మీలో ఉందా? అయితే మీరు 'రివేంజ్ స్పెండింగ్' బాధితులు కావచ్చు. దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

December 29, 2022

తగ్గుతున్న కోవిడ్ కేసులు & వేగవంతమైన వ్యాక్సినేషన్‌తో, ఖర్చు తగ్గించుకోవడం ఎలాగో నేర్చుకోండి.. బాధ్యతాయుతంగా ఖర్చు చేయడంతో పాటు పరిస్థితులు దిగజారకుండా చూసుకోండి.

ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల  ప్రొడక్ట్ డిజైనర్ రిధి, ఆమె స్నేహితులతో కలిసి షాపింగ్ ఎంజాయ్ చేస్తూ , ట్రావెల్ చేస్తూ.. కలిసి భోజనం చేయడం వంటివి చేస్తుండేవారు.

కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి, ఆమె తన 'సాధారణ' జీవితాన్ని తిరిగి ప్రారంభించగలిగేలా అది అంతం కావాలని ఆమె ఆశించింది.

షాపింగ్ సెంటర్‌కు దగ్గరగానే నివశిస్తున్నప్పటికీ, ఆమె నెలల తరబడి షాపింగ్‌కు వెళ్లలేకపోయింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న గోవా యాత్రను కూడా పూర్తి చేయలేకపోయింది.

కరోనా రెండో వేవ్ తర్వాత వైరస్ వ్యాప్తి కాస్త తగ్గడంతో రిధి షాపింగ్ చేయడంతో పాటు నెల రోజులు సెలవులపై గోవాకు వెళ్లింది. ఇలా సరదాగా గడపడం కోసం ఆమె ఇన్నాళ్లుగా ఆదా చేసిన డబ్బును, సమయాన్ని వృథా చేసింది.

మీరు కూడా రిధిలా ఉంటే ఊహించండి? మీరు కూడా రివేంజ్ స్పెండర్‌గా మారుతారు.

కానీ చింతించకండి, మీరు మాత్రమే కాదు. మనలో చాలా మందికి అలాంటి ఆలోచన ఉంటుంది. ఆత్రుత లేదా ఉన్న పళంగా మన డబ్బు ఖర్చు చేయాలనే బలమైన కోరిక ఉంటుంది.

మనందరికీ -  లాక్‌డౌన్ సమయం చాలా కష్టంగా గడిచింది. అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి - ఎలా అంటే చాలా మంది నిరుద్యోగులుగా మారి స్వగ్రామాలకు చేరుకున్నారు.

స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద కూడా సామాజిక దూరం పాటించాల్సి వచ్చింది. 

ఇది దుస్తులు ధరించే మన ఆచారాలను మార్చేసింది - చాలా మంది ముఖాల్లో చిరునవ్వును తీసుకురాగల, ఉత్పాదక లేదా శక్తివంతం చేసే ఒక సాధారణ పని అది.

మనం గత రెండేళ్లుగా లాక్‌డౌన్‌లో ఉన్నాము. ఇళ్లకే పరిమితం అయ్యాం. దాదాపు చిరిగిన చొక్కాలు, పైజామాలతోనే జీవితాన్ని గడుపుతున్నాం.

మొదటిగా, మన దృష్టి అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం, అనుకోని పరిస్థితుల కోసం మనం చేయగలిగినంత పొదుపు చేయడంపై ఉండాలి.

అయితే, ఇప్పుడు కరోనా తగ్గడంతో, ప్రజలు తమ వాలెట్లను తెరిచి, గత రెండేళ్లుగా తాము వేటినైతే కోల్పోయారో వాటిలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

మనం కోవిడ్ సమయంలో కోల్పోయిన వాటిని ఒక ప్రతీకారం లెక్క భావించి ఇప్పుడు అనుభవించడానికి, కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. మామూలుగా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి సెలవు

ఇవ్వని మేనేజర్, మెట్రోలో మాస్క్ పెట్టుకోకుండా మీ ముఖం మీద దగ్గిన మీ అంకుల్ మీద కోపంగా ఉంటే ఇలాగే చేసే వాళ్లు.

మంచి రోజుల వచ్చాయి. ప్రతీకారంతో మన పర్పుకు రెక్కలు వచ్చాయి. ప్రజలు కసి తీరా డ్రెస్సులు ధరిస్తున్నారు, హీల్స్ వేసుకుంటున్నారు, ఉద్యోగులు కసితో ఉద్యోగాలు మానేస్తున్నారు. ట్రావెలర్స్ తమకు నచ్చిన చోటుకు వెళుతున్నారు.


రివేంజ్ స్పెండింగ్ అంటే ఏమిటి? ‍

రివేంజ్ స్పెండింగ్, ఒక్కమాటలో చెప్పాలంటే మీరు అనుకున్నవన్నీ సాధించాలని అనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా అవి సాధ్యం కాలేదు.

కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయడం. అంటే గతంలో మీ ఖర్చు చేయాలనుకున్న జాబితాలోని పనులకు సంబంధించి, గత సంవత్సరం వెళ్లాలనుకున్నా ట్రిప్పుల కోసం మీరు సెలవులు ప్లాన్ చేసుకోవడం లేదా మహమ్మారి తర్వాత మీ పాత సోఫా స్థానంలో కొత్త ఫర్నిచర్ కొనడానికి డబ్బులు పెట్టడం లాంటివి.

మహమ్మారి వల్ల ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులు, ఒత్తిడితో కూడిన అనుభవాల తర్వాత మనమందరం సరదాగా గడపాలని, బాధాకరమైన జ్ఞాపకాల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాం.

ఇప్పుడు మనలో చాలా మంది జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం అంటే నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం ద్వారా, మనం ఎదుర్కొన్న కష్టాలపై ప్రతీకారం తీర్చుకోవడమని ఆలోచిస్తున్నారు.

నిజానికి ఈ రివేంజ్ డ్రామా చైనాలో ప్రారంభమైంది. అక్కడ ఏప్రిల్ 7, 2020న, గ్వాంగ్‌జౌలోని హెర్మేస్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో రికార్డు స్థాయిలో $2.7 మిలియన్ల (సుమారు 17 కోట్లు) విక్రయాలు జరిగాయి.

బావోఫక్సింగ్ గ్జియోఫి (baofuxing xiaofei) లేదా "రివేంజ్ బైయింగ్" అని పిలువబడే ఈ సంఘటనను గూచీ, ప్రాడా, లూయిస్ విట్టన్, ఎస్టీ లాడర్ రికార్డ్ చేశాయి. దీంతో ఇది ప్రపంచమంతటా వ్యాపించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

ఢిల్లీలో కూడా చాలా మంది దుకాణదారులు ఎంపోరియో మాల్ ఎల్‌వి స్టోర్ వెలుపల 45 నిమిషాల పాటు క్యూలో నిల్చున్నారు. దీంతో గూచీ కస్టమర్లకు టోకెన్‌లు అందించారు.

తర్వాత రద్దీతో కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘనల కారణంగా నెలల తరబడి సరోజినీ, లజ్‌పత్, గఫార్ మార్కెట్లు అనేకసార్లు మూసివేయవలసి వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ 2021లో బైన్ సహకారంతో రూపొందించిన 'భారతదేశం ఆన్‌లైన్‌లో ఎలా షాపింగ్ చేస్తుంది' అనే నివేదిక ప్రకారం, 2021లో భారతీయ ఈ-కామర్స్ వ్యాపారం 25% వృద్ధి చెందింది. అయితే యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అంచనా ప్రకారం 2022లో భారతదేశ లగ్జరీ వస్తువుల మార్కెట్ విలువ 8.5 బిలియన్ డాలర్లు. ఇది 2021లో $6 బిలియన్లుగా ఉంది.

2020లో, మహిళా వినియోగదారులు పురుషుల కంటే 1.5-2 రెట్లు వేగంగా వృద్ధి చెందారు. కొత్త కస్టమర్ల వృద్ధిలో 80% మంది టైర్–2, చిన్న పట్టణాలే ఉన్నాయి.

ఫిక్కీ (FICCI), థ్రిల్లోఫిలియా చేసిన సర్వే నివేదిక ప్రకారం, ప్రజలు కోవిడ్ తర్వాత ప్రయాణాలు చేయాలనుకుంటే, గతంలో చేసిన దానికంటే రెండింతలు ఎక్కువ ప్రయాణాలు చేయాలని కోరుకున్నట్లు వెల్లడైంది.


ప్రజలు ఎందుకు ‘రివేంజ్ స్పెండ్’ చేస్తారు?

మరింత కావాలనే కోరిక కోసం.

ప్రజలు ఎవరిపై లేదా దేనిపై ప్రతీకారం తీర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? బహుశా లాక్‌డౌన్ పరిమితులు, ఆంక్షలతో కూడిన జీవితాన్ని గడపడం లేదా మంచి రిటైల్ థెరపీని కోల్పోవడం వంటివి కారణమని చెప్పవచ్చు.

మనం ఒక సంవత్సర కాలం పాటు ఇంటి లోపలే ఉండిపోయాం - ఈ సమయంలో ఖచ్చితంగా మనం నిరాశతో ఉన్నాం. కాబట్టి కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి కొంచెం ఎక్కువ ఖర్చు చేస్తాం.

ఇది క్లుప్తమైంది,ముఖ్యంగా మానసిక స్థితిపై ప్రభావం చూపించేది. మరోవైపు మహమ్మారి ప్రభావం డబ్బు విషయంలో అజాగ్రత్తకు దారితీస్తుంది.

మనలో చాలా మందికి భయంకరమైన పరిస్థితుల తర్వాత సంతృప్తినిచ్చే సమయం కావాలి. మహమ్మారి సృష్టించిన ప్రతికూలతల నేపథ్యంలో జీవితం చిన్నదని, అది ఒక్కసారి మాత్రమే ఉంటుందని అందరినీ నమ్మేలా చేసింది.

మింట్ యొక్క వార్తా కథనం ఈ రకమైన ఖర్చును "రియాక్టెన్స్ (reactance- ప్రతిస్పందన)" అని పిలువబడే మానసిక భావనకు సంబంధించినదని పేర్కొంది.

ప్రతిస్పందించడం అనేది వ్యక్తులు నిషేధించబడిన లేదా వారి నుంచి దూరంగా ఉంచిన వాటిపై మానసిక ప్రతిస్పందనను సూచిస్తుంది.

వారి స్వేచ్ఛకు లేదా ఎంపిక పరిమితం చేయబడిన వాటిపై ప్రజలు హద్దులు దాటి మరీ వాటిని మరింతగా విశ్వసిస్తారు.

ఇలాంటి ఆలోచనతో షాపింగ్ చేయడం, బయట భోజనం చేయడం, సినిమాలు చూడటం లేదా ప్రతీకారంతో ప్రయాణాలు చేయడం వంటి విలాసాలలో నిమగ్నమవ్వాలనే కోరిక పెరగడానికి దోహదం చేస్తుంది.

అదే కథనంలో బిహేవియరల్ ఎకనామిస్ట్, డైరెక్టర్ ఆశ్లేషా స్వామినాథన్, సబ్లిమినల్ ఐడియాస్, కోట్స్ ప్రకారంగా “లాక్‌డౌన్ సమయంలో ప్రజలు చాలా కాలం పాటు అనవసరమైన వస్తువులు లేదా లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయలేరు.

లాక్‌డౌన్‌కు ముందు వస్తువులను క్రమం తప్పకుండా కొనుగోలు చేసే అలవాటు వారికి ఉన్నట్లయితే, లాక్‌డౌన్ సమయంలో అనుభవించలేని కొనుగోలు ఆనందాన్ని(పాజిటివ్ ఎమోషన్) భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఈ సమయంలో వారు భావించవచ్చు. దీనికి కారణం అనుకూల సమయంలోనే అధికంగా ఖర్చు చేయాలనే భావన వారిలో ఉండవచ్చు.’’

కానీ, ఇప్పడు ఉన్న క్లిష్టమైన సమయాల్లో అలాంటి ఆలోచన మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి.


మీరు రివేంజ్ స్పెండింగ్ చేస్తున్నారా?

మీకు మీరే కింది ప్రశ్నలు వేసుకోండి:

  • మీరు మీ బడ్జెట్ లేదా డిమాండ్‌ను మించిపోతున్నారా?
  • మీరు మంచి ఆహారం, అత్యాధునిక దుస్తులు, ప్రయాణాలు, వినోదం, లగ్జరీ వస్తువుల వంటి విచక్షణతో కూడిన కేటగిరీలపై వెచ్చిస్తున్నారా?
  • మీ క్రెడిట్ కార్డ్ బకాయిలు పెరుగుతున్నాయా?
  • మీ బిల్లులు పేరుకుపోయాయా?
  • మీరు మీ వారితో చాలా ఎక్కువ బ్రంచ్‌ల కోసం బయటకు వెళ్తున్నారా?
  • మీరు ఇన్‎స్టాగ్రామ్ సిఫారసుల ఆధారంగా మరిన్ని అమెజాన్ ఆర్డర్‌లను పెడుతున్నారా?

వీటిలో చాలా వాటికి అవుననే సమాధానం వచ్చినట్లయితే, మీ ఖర్చు అనూహ్యంగా పెరిగిందనే వాస్తవాన్ని మీరు తప్పక గుర్తించాలి.

పెరుగుతున్న క్రెడిట్ కార్డ్ రుణం, డబ్బు అయిపోవడం, మీ నెలవారీ సగటు కంటే ఎక్కువ ఖర్చు చేయడం వంటివన్నీ మీ పరిమితికి మించిన రివేంజ్ స్పెండింగ్‌ను సూచిస్తున్నాయి.


రివేంజ్ స్పెండింగ్ తదనంతర పరిణామాలు ఏమిటి?

ఖర్చు చేయడం వల్ల మీకు స్వల్పకాలిక సంతృప్తి కలగవచ్చు. కానీ, మీ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం.

స్థిరమైన దానికంటే ఎక్కువ చేసే రివేంజ్ స్పెండింగ్ వల్ల దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకు దారి తీయవచ్చు.

మరోవైపు, మహమ్మారి తర్వాత చాలా మంది ఇప్పటికీ జీవితాన్ని సర్దుబాటు చేసుకుంటుండగా, చాలా మంది ఆదాయ కోతల బారినపడటం, నిరుద్యోగులుగా ఉన్నారు.

ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో, రివేంజ్ స్పెండింగ్ ఇప్పటికే ఉన్న సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ ఆలోచన "నేనేంటో మీకు చూపిస్తాను" అనే మనస్తత్వం ద్వారా ప్రేరేపించబడుతుంది. ఇది మీ ఆర్థిక, సంబంధాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతీ విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.

రివేంజ్ స్పెండింగ్‌తో ముడిపడి ఉన్న కొన్ని సాధారణ నష్టాలు ఇక్కడ ఉన్నాయి:


పొదుపు చేసే సామర్థ్యం తగ్గడం

రివేంజ్ స్పెండింగ్ పొదుపు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మీ పొదుపు శక్తిని కోల్పోవడం వలన మీరు అదనపు బిల్లులను కవర్ చేయడానికి అనవసరమైన రుణాలను కోరవలసి వస్తుంది. ఇది మీపై ఒత్తిడిని పెంచుతుంది.


అప్పులో కూరుకుపోతుండటం

రివేంజ్ స్పెండింగ్ యొక్క అత్యంత తీవ్రమైన పరిణామాలలో ఒకటి ఎదుగుదల లేని షాపర్​గా మారడం.

కొందరు వ్యక్తులు క్రెడిట్ కార్డ్‌లు లేదా వ్యక్తిగత రుణాల ద్వారా ఖర్చుల కోసం అదే పనిగా డబ్బు తీసుకోవడం కొనసాగిస్తుంటారు.

సులభంగా క్రెడిట్‌ని పొందడం వల్ల దీర్ఘకాలికంగా ఖర్చు చేసే వ్యక్తి అతని లేదా ఆమె ఆర్థిక లక్ష్యాలను ఉల్లంఘించడమే కాకుండా అప్పుల ఊబిలోకి జారుకునేలా ప్రోత్సహిస్తుంది.


ఆర్థిక లక్ష్యాల విషయంలో రాజీ

ఫైనాన్షియల్ ప్లానర్లు వివరించినట్లుగా, రివేంజ్ స్పెండింగ్ తరచుగా ఆర్థిక లక్ష్యాల విషయంలో రాజీ పడేలా దారి తీస్తుంది. ఇది వ్యక్తి యొక్క ఆర్థిక స్వేచ్ఛపై ప్రభావం చూపుతుంది.

రివేంజ్ స్పెండింగ్‎ను ఎలా నివారించాలి?

ఖర్చు చేయాలనే కోరికను నివారించాలంటే, ముందుగా ఆ ఆలోచన ఎక్కడ నుంచి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి.

రివేంజ్ స్పెండింగ్‌ అనేది భావోద్వేగంతో నడిచే ప్రవర్తన. ప్రస్తుత అనూహ్య సమయంలో ప్రజలను ఇది సురక్షితం అనే భావనలో ఉండేలా చేస్తుంది.

అనిశ్చితి భయాన్ని ప్రేరేపిస్తుంది, ఇది ఒక ప్రతికూల భావోద్వేగం. ప్రజలు మొత్తం మీద ప్రతికూల భావోద్వేగాలను తగ్గించే మార్గాలను ఎంచుకోవాలి.

ఎమోషనల్ డిమాండ్ భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వ కోరికపై ప్రభావం చూపుతుంది.

కొన్ని నెలలపాటు జాగ్రత్తగా సహేతుకంగా పొదుపు చేసిన తర్వాత (లేదా అయిష్టమైన పొదుపు, ఎక్కువ ఖర్చు చేయనందున మిగిలినవి) అవి స్వీయ-సౌలభ్యం కోసం లేదా మునుపటి సంవత్సరంలో మీరు వదులుకున్న ప్రతిదానికీ తిరిగి చెల్లించడం వంటి చర్యలకు దారితీయవచ్చు.

ఖర్చు చేయాలనే కోరికను నియంత్రించడానికి మీరు ఏమి చేయవచ్చు:

ప్రతిదానిని విశ్లేషించండి

మీరు బయటకు వెళ్లి ఆ వస్తువును మీ కార్ట్‌లో పెట్టుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - మీకు ఇప్పటికే అది ఉందా? మీరు దీన్ని ఎంత వరకు ఉపయోగిస్తారు?

మీరు ఉత్తమమైన డీల్ పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి మీరు ధరలను పోల్చి చూశారా? మీకు ప్రస్తుతం ఇది నిజంగా అవసరమా?

దీనికి మరో  ప్రత్యామ్నాయం ఉందా? కొనడం విలువైనదేనా? మీరు ఖర్చు చేసే ప్రతీ పైసా ముందు ఆలోచించండి.


మీ ఖర్చులను ట్రాక్ చేయండి

అన్నింటికన్నా ముందుగానే బడ్జెట్ నిర్ణయించండి. మీకు సరైనా బడ్జెట్ ఉంటే మీరు మీ ఖర్చులను ఖచ్చితంగా అదుపులో ఉంచుకోగలుగుతారు.

ప్రతీ రకమైన ఖర్చులకు కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం వల్ల మీరు తొందరపడి కొనుగోళ్లు చేయకుండా ఉండటానికి సహాయపడుతుంది.

ఇంకా మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారో మీరు అంచనా వేయగలరు. మనం బడ్జెట్ సహాయంతో ఖర్చులను ట్రాక్ చేయవచ్చు, అంచనా వేయవచ్చు.

ప్రతీ పైసా ఎక్కడ ఖర్చు చేయబడుతుందో నిర్ణయించడంలో కూడా ఇది మనకు సహాయపడుతుంది.

మీరు కొనుగోలు చేసినప్పుడు, ఏమి కొనుగోలు చేస్తున్నారో, దాని ధర ఎంత అని నోట్ చేసుకోండి.

నిజానికి మీ ఖర్చును క్రమం తప్పకుండా ట్రాక్ చేయడం వలన మీరు ఖర్చు చేసే రోజులు, ఖర్చు చేయడానికి మిమ్మల్ని ప్రలోభపెట్టే పరిస్థితులు, మీరు ఎక్కువ సమయం గడిపిన వెబ్‌సైట్ల వంటి నమూనాలను గుర్తించడంలో మీకు సహాయపడవచ్చు.

మనం వారం వారీ ఖర్చును జోడించినప్పుడు, అది ఎక్కువ షాపింగ్ చేయాలనే మన కోరికపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఖర్చులను ఆటోమెటిక్‌గా వర్గీకరించే స్మార్ట్‌ఫోన్ యాప్‌లను ఉపయోగించడం మీ ఖర్చులను ట్రాక్ చేసే విధానంలో ఒకటి.

చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు మీ ఖర్చులను ట్రాక్ చేస్తాయి. ఏ ఖర్చులు అవసరం లేదో, నివారించవచ్చో చూడటానికి మీరు ఒకసారి చెక్ చేయండి.

విండో షాపింగ్ చేయండి

మహమ్మారి తర్వాత మొదటిసారిగా మాల్ లేదా సూపర్ మార్కెట్‌ను సందర్శించినప్పుడు, విండో షాపింగ్ ప్రయత్నించండి.

మీ క్రెడిట్ కార్డ్‌లను ఇంట్లోనే ఉంచి కొద్ది మొత్తంలో నగదుతో షాపింగ్‌కు వెళ్లడం మంచిది.

మీరు డబ్బు లేకుండా విండో షాపింగ్ లేదా బ్రౌజ్ చేస్తే అనవసర ఖర్చుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మీరు అదే సమయంలో అనవసరమైన విషయాలపై డబ్బు ఖర్చు చేయరు.

అయితే, మీరు ఇప్పుడు మీ ఫోన్‌ను ఉపయోగించి కూడా చెల్లించవచ్చు. మీరు ఒంటరిగా వెళ్లకపోతే మీ ఫోన్‌ను కుటుంబ సభ్యులకు ఇవ్వండి.

మీరు ఏదైనా కొనుగోలు చేయాలని ఆలోచన వచ్చిన ప్రతీసారి మీరు మీ ఫోన్ కోసం అడగాలి. దీంతో అనవసర కొనుగోళ్లు చేయకుండా ఉండటానికి ఈ ఒక అదనపు దశ మీకు సహాయపడవచ్చు.


అతిగా వెళ్లకండి

మీరు అర్హులని భావించి మీ పొదుపులను ఊదరగొట్టకండి. మీరు  గత సంవత్సరం విహారయాత్ర కోసం కేటాయించిన డబ్బును వాటి కోసం ఖర్చు చేయకపోతే, ఈ సంవత్సరం (పరిస్థితులు అనుమతిస్తే) ట్రిప్ కోసం దాన్ని ఉపయోగించండి – అంతే కానీ మీ ట్రిప్ యొక్క కాలం, ఖర్చును రెట్టింపు చేయవద్దు. మీరు కోల్పోయిన వాటి కోసం ఈ సంవత్సరం రెట్టింపు సెలవులు తీసుకోవాలనే కోరికను ఆపుకోండి. ఎందుకంటే అలా చేస్తే మీ పొదుపు తగ్గుతుంది.

మనం ఎదుర్కొన్న అనుభవాలకు తగ్గట్టుగా, అత్యవసర పరిస్థితుల్లో నగదు నిల్వను ఉంచడం  చాలా కీలకం.


మీ ఫైనాన్స్‎లను ఆర్డర్‎లో ఉంచండి

మీరు చెల్లించని క్రెడిట్ కార్డ్ రుణాన్ని కలిగి ఉన్నట్లయితే,  తనఖాలో క్రెడిట్ కార్డ్ రుణాన్ని రీఫైనాన్స్ చేసి ఖర్చు చేస్తారు. అవి మరింత ఎక్కువ పేరుకు పోయినట్లయితే, మీ పొదుపు లక్ష్యాలు తక్కువగా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం కంటే షాపింగ్ చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. మీరు మీ వ్యక్తిగత లేదా ఆర్థిక స్థితికి హాని కలిగించేలా ఖర్చు చేస్తున్నారు.

మీ జీవితానికి మెరుగుపరిచే వస్తువులు లేదా అనుభవాలపై ఖర్చు చేయడం అనేది తెలివైన ఖర్చుగా భావించవచ్చు.

మీకు ముఖ్యమైన జీవిత లక్ష్యాల కోసం ఏకకాలంలో పొదుపు చేస్తూ, తెలివిగా ఖర్చు చేస్తే, మీరు వస్తువులను, అనుభవాలపై అప్పులు చేయకుండా వెచ్చించవచ్చు.

ఆ లక్ష్యాలు ఏమిటో మీకు తెలియకపోతే, మీరు బహుశా మీ డబ్బును వృథా చేస్తున్నారని అర్ధం.

హద్దులను నిర్ణయించుకోండి

క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై పరిమితులు సెట్ చేయడం ఇప్పుడు సులభం. మీ ఖర్చు అదుపు తప్పుతుందని మీరు అనుకుంటే, ఆ పరిమితిని తగ్గించండి.

ప్రీపెయిడ్ కార్డ్‌లను తీసివేయడం మరో ఆప్షన్. ఎంచుకునే నిర్ణయాన్ని మీ చేతిలో నుంచి ఇది తొలగిస్తుంది.

లాక్‌డౌన్‌లో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడం చాలా మందికి కష్టంగా అనిపించవచ్చు.

మీకు మీరుగా నియంత్రించుకోలేకపోతే, సమర్ధులైన ఆర్థిక సలహాదారులు మీరు రివేంజ్ స్పెండింగ్‌కు దూరంగా ఉండటానికి సహాయపడగలరు. అనవసర ఖర్చు ఈ రోజు ఆనందాన్ని ఇవ్వవచ్చు. కానీ రేపు మాత్రం బాధను కలిగిస్తుంది. 


యాక్టివిటీని సర్దుబాటు చేయండి

లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత, మీరు మీ కారులో ఏ మార్కెట్‌కు వెళ్లాలనే  విషయం పట్ల ఆకర్షితులు కావచ్చు.

అక్కడికి వెళ్లినప్పుడు మీరు ఖర్చు చేయడం దాదాపుగా ఖాయం.

ఈ యాక్టివిటీని మీరు బాగా కోల్పోయారు. ఇలా చేయడం మానవ సహజం. మీరు గత రెండు నెలలుగా అన్నింటికీ దూరంగా ఉన్నందుకు ఇలా చేస్తున్నారనే భావన మీ చేత ఇలా చేయిస్తుంది.

సమయం ఇవ్వండి. మొదటి రెండు రోజులు శారీరక శ్రమల వంటి విభిన్నమైన వాటిని ప్రయత్నించండి - నడక, పరుగు లేదా సైకిల్ తొక్కడం లాంటివి మీ విశ్రాంతి సమయాన్ని ఒక రోజులో గడపడానికి ఉత్తమ మార్గాలు.

ఈ విధమైన చర్యలు ప్రస్తుతానికి, మిమ్మల్ని రిటైలర్ల నుంచి దూరంగా ఉంచుతాయి. ఒకవేళ మీరు వెళ్లినప్పటికీ, ప్రలోభానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు ఖర్చు నిర్ణయాలను తీసుకోవడానికి మెరుగైన స్థితిలో ఉంటారు.


మీ ఆర్థిక నిర్ణయాలను పెంచుకోండి

లాక్‌డౌన్ సమయంలో, మీరు నిత్యావసరాలు, అవసరాలపై మాత్రమే వెచ్చించడం ద్వారా సరైన విధంగా జీవించగలిగారు.

ఇది మీకు మీ డబ్బు చేర్చడంతో పాటు మీ మునుపటి అనవసరమైన ఖర్చులు చాలా వరకు నివారించబడి ఉండవచ్చని గ్రహించడంలో సహాయపడింది.

క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టండి. మీ పొదుపు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టండి.

ఆ విధంగా, మీరు అతిగా వెచ్చించకుండా ప్రలోభానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. 


ఫోమో (FOMO)పై పోరాడండి

ఏదో కోల్పోతున్నారనే భయం (ఫోమో లేదా FOMO) మీరు డబ్బును ఎలా ఖర్చు చేస్తారనే దానిపై ప్రభావం చూపుతుంది. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఫైనాన్షియల్ ఫోమోతో వ్యవహరించడానికి ఈ 5 చిట్కాలను చూడండి.

అతిగా ఖర్చు చేయడాన్ని నివారించడానికి, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించండి. లేదా మీ సామర్థ్యానికి మించిన మార్గాల్లో ఖర్చు చేయాలని తోటివారి ఒత్తిడి చేస్తున్నారని మీరు భావిస్తే మీ సోషల్ మీడియా స్క్రీన్‌కు మీ సమయాన్ని పరిమితం చేయండి.

'30-రోజుల నియామానికి' కట్టుబడండి

ఈ నియమం చాలా సింపుల్: మీరు ఇష్టపడేదాన్ని కొనుగోలు చేయడానికి 30 రోజులు వేచి ఉండండి. మీరు 30 రోజుల తర్వాత కూడా ఆ వస్తువును కొనుగోలు చేయాలనుకుంటే ముందుకు కొనసాగండి.

అవసరం లేదని గ్రహించినట్లయితే మీ డబ్బు ఆదా అవుతుంది. ఆదా చేసిన డబ్బు ఖర్చు చేయని డబ్బుగా మిగిలిపోతుంది.

మీరు ఉద్వేగభరితమైన కొనుగోళ్లు చేస్తే, 30-రోజుల నియమం కాస్త ఆలస్యమైన సంతృప్తి గురించి మీకు బోధిస్తుంది. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది.


‘వద్దు’ అని చెప్పడం నేర్చుకోండి

అన్ని తెరుచుకున్నప్పుడు, ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చును పెంచకుండా దూరంగా ఉండటం కష్టం.

తోటివారి ఒత్తిడికి లొంగిపోకుండా ఉండటం ముఖ్యం - "వద్దు" అని చెప్పడం పూర్తిగా ఆమోదయోగ్యమైనది.

ఖర్చు పెట్టడానికి ముందు మీకు ఏ ఏ సామాజిక కార్యకలాపాలు ముఖ్యమో నిర్ణయించుకోండి. మీ బ్యాంకు అకౌంట్​కు, మీకు బ్రేక్ కావాలనుకున్నప్పుడు అలాంటి ఖర్చులకు ‘నో’ అని చెప్పండి.

సుదీర్ఘ కాలం పొదుపు, స్వీయ నియంత్రణ  తరువాత, ఎక్కువగా ఖర్చు చేయడం అనేది గతంలో కంటే టెంప్టింగ్​గా ఉంటుంది.

రివేంజ్ స్పెండింగ్ ఎల్లప్పుడూ ఆమోదయోగ్యమైన విషయం కానప్పటికీ, దాన్ని త్వరగా నియంత్రణలో తెచ్చుకోకపోతే, అది మీ ఆర్థిక వ్యవహారాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

బాగా అర్హత కలిగిన (కానీ ఇప్పటికీ కాస్త నవ్వుకునేలానే ) అధిక ఖర్చు కోసం ముందుకు సిద్ధం అవడం ద్వారా దీనిని నివారించండి.

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.