Buy Gold
Sell Gold
Daily Savings
Digital Gold
Instant Loan
Round-Off
Nek Jewellery
డిజిటల్ గోల్డ్ కొనాలని అనుకుంటున్నారా? దాని గురించి అనుమానాలు, సందేహాలు ఉన్నాయా? డిజిటల్ గోల్డ్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు జార్ యాప్‌లో చదవండి.
ఒక రూపాయికి బంగారం కొనడం సాధ్యమేనా? మామూలు నగల దుకాణాల్లో అది సాధ్యం కాదు. కానీ, మీరు ఆన్లైన్లో బంగారాన్ని డిజిటల్ రూపంలో ఒక రూపాయికి కూడా కొనవచ్చు
ఈ మధ్యకాలంలో బంగారానికి డిజిటల్ మార్కెట్ ఒక ప్రభంజనంగా మారింది. అది కొత్తరకం పెట్టుబడికి తెర లేపింది- అదే డిజిటల్ గోల్డ్.
భారతదేశంలో డిజిటల్ గోల్డ్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్. కానీ దాని గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
మేము ఇక్కడ జార్ యాప్‌లో డిజిటల్ గోల్డ్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు 8 సమాధానాలు చెప్తాము:
డిజిటల్ గోల్డ్ అనేది బంగారాన్ని నిజంగా మన చేతిలో పడేలా కాకుండా కొనే కొత్తరకం పద్ధతి.
కాబట్టి మీరు బంగారాన్ని కొనాలనుకుంటే ఇది మరింత సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చు అయ్యే ఎంపిక.
మీరు కొనే ప్రతీ గ్రాము బంగారానికి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం మీ పేరు మీద భారతదేశంలోని మూడు బంగారం బ్యాంకులలో ఏదో ఒకదానిలో భద్రపరచబడుతుంది - ఆ బంగారం బ్యాంకులు ఆగ్మోంట్, MMTC - PAMP మరియు సేఫ్గోల్డ్.
యాప్‌లో ఒక చిన్న బటన్‌ను క్లిక్ చేసి మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు లేదంటే నిజమైన బంగారం మీ ఇంటికి డెలివరీ చేయమని కోరవచ్చు.
అయితే అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే డిజిటల్ గోల్డ్ కొనడానికి కనీసం ఎంత పెట్టి కొనాలి అని నియమేమీ లేదు. మీరు ఒక్క రూపాయితో మొదలుపెట్టి ఇంకా పెంచుకుంటా వెళ్లవచ్చు.
డిజిటల్ గోల్డ్‌ను ఎవరైనా సరే ఏదైనా రిజిస్టర్డ్ యాప్ నుంచి గానీ, లేదంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి మధ్యవర్తిత్వ యాప్‌ల నుంచి గానీ కొనవచ్చు. జార్ యాప్ నుంచి ఒక్క రూపాయితో కూడా కొనవచ్చు.
NPCI, మార్కెట్‌లోని ప్రముఖ యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లచే మద్దతు పొందిన జార్ యాప్, మీ డబ్బును ఆటోమేటిక్‌గా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంది. ప్రతిరోజూ ఆదా చేసేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. జార్ యాప్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
కేవైసీ అవసరం లేకుండా కూడా, డిజిటల్ గోల్డ్‌ను కొనవచ్చు, కానీ ప్లాట్‌ఫారమ్‌ని బట్టి నిర్దిష్ట పరిమాణం వరకు మాత్రమే కొనగలం.
జార్ వంటి కొన్ని ప్రముఖ యాప్స్ కేవైసీ లేకుండా ₹50,000 వరకు బంగారం కొనే అవకాశం కల్పిస్తున్నాయి.
డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు.
● డిజిటల్ గోల్డ్‌ను ఎప్పుడైనా సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు. యాక్సెస్ కూడా ఎక్కువ.
● దీని లిక్విడిటీ చాలా ఎక్కువ. రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు, ఏడాదిలో 365 రోజులలో ఎప్పుడైనా, సెలవుల్లో కూడా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు.
● బంగారం ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టగా పరిగణించబడుతుంది. దీనిని రుణాల కోసం తాకట్టుగా కూడా ఉపయోగించవచ్చు.
● గత 92 సంవత్సరాలలో బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే వచ్చింది. భారతదేశంలో బంగారం సంప్రదాయబద్ధంగా ఎంతో విలువైంది. అంతేకాకుండా దీనికి అంతర్గతంగా ఎంతో గౌరవం ఉంది. పైగా, ఇదొక గొప్ప ఆస్తి.
డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే నష్టాలు
● దానివల్ల మీకు సంపాదన రాదు. అంటే మీ పెట్టుబడికి వడ్డీ రాదు.
● ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే డిజిటల్ గోల్డ్ ఆర్బీఐ లేదా సెబీ చట్టాలకు లోబడి ఉండదు.
● అనేక భాగస్వామ్య సైట్లలో, బంగారం మీద మొత్తం రూ. 2 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టగలము. ఇది కొంతమంది ఇన్వెస్టర్లకు ఇబ్బందిగా ఉండవచ్చు.
● మీ డిజిటల్ గోల్డ్‌ను డెలివరీ చేస్తున్నప్పుడు దానిని ఉంచుకోవడానికి హోల్డింగ్ బిజినెస్‌లు కొద్దిపాటి నిర్వహణా ఫీజులు వసూలు చేస్తాయి.
ఎన్నో ఇతర పెట్టుబడుల కంటే డిజిటల్ గోల్డ్ చాలా మంచి ఎంపిక. ఎందుకంటే దీనిని కొనడం ఎంత తేలిక.
ఇది మీరు బట్టలో, పిజ్జానో ఆర్డర్ చేసినంత తేలిక. మీరు చేయాల్సిందల్లా:
● జార్, పేటియం, కళ్యాణ్ జ్యుయలర్స్, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌కి వెళ్ళాలి.
● 'గోల్డ్ లాకర్/వాల్ట్' ఆప్షన్ ఎంచుకోండి.
● మీరు డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే అమౌంట్ ఎంటర్ చేయండి. డిజిటల్ గోల్డ్ ధర మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి నిర్ధిష్ట రేటుతో కొనుగోలు చేయవచ్చు లేదా నచ్చినంత పరిమాణంలో డిజిటల్ గోల్డ్ కొనవచ్చు.
● డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా మీ వాలెట్ నుండి పే చేయండి.
● ఆ వెంటనే, క్రెడిట్ అయిన బంగారం మొత్తం వెంటనే అప్డేట్ అవుతుంది, మీ డిజిటల్ గోల్డ్ 100% బీమా చేసిన ఖజానాలో చేరుతుంది.
● డిజిటల్ గోల్డ్‌ను తక్షణమే కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు. ఇన్వెస్టర్లు వాళ్లకు నచ్చిన విధంగా డిజిటల్ గోల్డ్‌ను బులియన్లు లేదా నాణేల రూపంలో పొందవచ్చు. చాలా మంది డిజిటల్ గోల్డ్ ఇంటర్మీడియేటరీలకు డెలివరీ పరిమితి ఉటుంది. ఆ పరిమితి దాటితే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
డిజిటల్ గోల్డ్ ఒక మంచి పెట్టుబడి ఎంపిక అని చెప్పడానికి ఎన్నో కారణాలున్నాయి:
● పెట్టుబడి పెట్టే డబ్బు: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం చాలా చౌక. ఒక్క రూపాయికి విలుఐన బంగారం కూడా కొనవచ్చు అమ్మవచ్చు.
● స్టోరేజ్, సేఫ్టీ: డిజిటల్ గోల్డ్‌కు స్టోరేజ్ లేదా సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బంది ఏమీ లేదు. మీ అకౌంట్లోని ప్రతి గ్రాము బంగారానికి సరిపోయే అసలైన బంగారం విక్రేత ద్వారా భద్రమైన వాల్ట్‌లలో మీ పేరుమీద భద్రపరచబడుతుంది. దీనివల్ల మీరు ఎప్పుడూ ప్రమాదం లేకుండా ఉంటారు.
● ఎక్కువ లిక్విడిటీ: బంగారం ఎక్కువ లిక్విడిటీ ఉండే కమోడిటీ. డిజిటల్ గోల్డ్‌ను ఎప్పుడైనా ఎక్కడైనా కొనవచ్చు, అమ్మవచ్చు. మీరు డీలర్లను కలవనక్కరలేదు, బంగారాన్ని ఒక సెక్యూర్డ్ గోల్డ్ అకౌంట్లో చాలా సంవత్సరాలు దాచనక్కర లేదు.
● ట్రేడింగ్: డిజిటల్ గోల్డ్‌ను కొన్ని చిన్న చిన్న స్టెప్పులతో సులువుగా ఆన్లైన్లో నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా కొనవచ్చు లేదా అమ్మవచ్చు. డబ్బులు నేరుగా మీ అకౌంట్లో లేదా మీ రిజిస్టర్డ్ వాలెట్లో వచ్చి చేరతాయి.
● వేరే ఫీజు లేమీలేకుండా స్వచ్ఛమైన బంగారం వస్తుంది: డిజిటల్ గోల్డ్ వల్ల మీరు స్వచ్ఛమైన బంగారాన్ని అంటే 24 క్యారెట్ల బంగారం కొనుక్కోవచ్చు. మీరు ఖర్చుపెట్టే డబ్బు మొత్తం బంగారమే కొంటారు. మీరు కేవలం 3% జీఎస్టీ చెల్లిస్తే చాలు.
● భద్రత: మీరు కొనే ప్రతీ గ్రాము బంగారానికి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని మీ పేరు మీద ఆగ్మోంట్, MMTC PAMP, సేఫ్గోల్డ్ అనే మూడు బంగారం బ్యాంకులలోని లాకర్లలో దాచి పెడతారు.
కాదు! డిజిటల్ గోల్డ్ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ లాగే మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది.
దాన్ని సురక్షితంగా బీమా చేసిన ఖజానాలో దాచి పెట్టి థర్డ్ పార్టీ ట్రస్టీ పర్యవేక్షిస్తుంటారు.
దీనివల్ల మీ స్మార్ట్ ఫోన్ పోయినా, లేదా అందుబాటులో లేకపోయినా కూడా మీ బంగారం ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుంది.
చాలా ఎక్కువ డబ్బుతో అసలైన బంగారాన్ని కొని పెట్టుబడి పెట్టలేని వారు ఎవరికైనా సరే డిజిటల్ గోల్డ్ ఒక మంచి ఎంపిక.
డిజిటల్ గోల్డ్ 99.9% స్వచ్ఛతతో లభిస్తుంది. జార్ యాప్‌తో ఒక రూపాయితో కూడా దీనిని కొనవచ్చు. దీనివల్ల కష్టపడి జాగ్రత్తగా దాచుకోవాలి అని భయం ఉండదు.
మీకు కేవలం మీ ఫోను, దానిలో జార్ యాప్ ఉంటే చాలు. Jar App మీకు ఆటో ఇన్వెస్టింగ్ కూడా సెటప్ చేసుకునే అవకాశం ఇస్తుంది.
కొన్న తేదీ నుంచి మూడు సంవత్సరాలలోపు మీ బంగారం (బంగారు ఆభరణాలు, డిజిటల్ గోల్డ్ లేదా నాణేలు ఏదైనా) అమ్మగా వచ్చే ఏ ఆదాయాలైనా స్వల్పకాలిక మూలధన లాభాలు (STCG) అవుతాయి.
ఇది మీ వార్షికాదాయంలో కలపబడుతుంది. మీ ఆదాయం వచ్చే అత్యధిక ఆదాయపు పన్ను బ్రాకెట్‌పై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మీ ఆభరణాలు, బంగారు నాణేలు లేదా డిజిటల్ గోల్డ్‌ను కొన్న తేదీ నుంచి మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత వచ్చే ఆదాయాలు, దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG)గా వర్గీకరించబడతాయి.
బంగారం అమ్మకంపై 20% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించబడుతుంది. ఒకవేళ దానికి అదనంగా సర్‌చార్జ్, విద్యా సెస్ కూడా ఉండవచ్చు.
భవిష్యత్తులో ఉపయోగించుకోవడం కోసం బంగారాన్ని దాచుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఎందుకంటే రోజులో ఏ సమయంలోనైనా అమ్మడం, కొనడం సులువు, డెలివరీ చేయడం కూడా ఎంతో సులువు.
డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయడానికి అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జార్ యాప్. ఇది మీరు ఆటోమేటిక్‌గా బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తుంది. మీ లావాదేవీల నుంచిడి ప్రతీరోజూ కొంత డబ్బు ఆదా చేసుకోవడానికి మీకు అవకాశం ఇచ్చి మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.
దీనిలో మీరు ఆటో పే ఫీచర్‌ని సెటప్ చేయవచ్చు లేదా ₹1 నుంచి మాన్యువల్‌గా పెట్టుబడి పెట్టవచ్చు. యాప్‌ను సెటప్ చేయడానికి 45 సెకన్లు మాత్రమే పడుతుంది.
జార్ యాప్ ఆటోమేటిక్‌గా మీ ఆన్లైన్ లావాదేవీల్లో మిగిలే చిల్లరను డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంది. మీరు భవిష్యత్తు కోసం డిజిటల్ గోల్డ్ పోర్ట్‌ఫోలియోను రూపొందించడానికి అవకాశం ఇస్తుంది.
జార్ యాప్‌తో మీ రోజువారీ సేవింగ్స్‌ను ఇప్పుడే ప్రారంభించండి. డిజిటల్ గోల్డ్ పెట్టుబడితో దాన్ని పెరగనివ్వండి.