Playstore Icon
Download Jar App
Digital Gold

బంగారంలో రోజూవారీగా పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు జార్ యాప్​తో ఎంతో సులభం. అదెలాగో తెలియజేసే ఇన్వెస్టర్ల గైడ్​.

December 27, 2022

బంగారు ఆభరణాలు అంటే కేవలం ఫ్యాషన్ యాక్సెసరీలు మాత్రమే కాదు. మనం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నపుడు మనకు ఆర్థిక భరోసాను కల్పించే పెట్టుబడులు కూడా.

అందుకే చాలామంది ఎంతో కాలంగా బంగారం మీద పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకున్నారు. బంగారం కొనుగోలు చేయడం కూడా ఒక రకమైన ఆర్థిక భద్రత కోసమే.

బంగారాన్ని మనం రెండు విధాలుగా దక్కించుకోవచ్చు. పేపర్ గోల్డ్, భౌతిక బంగారం. వీటిలో భౌతిక బంగారం అనేది ఆభరణాలు, నాణేలు, బంగారు కడ్డీలు మొదలగు రూపాల్లో మనకు లభిస్తుంది. పేపర్ గోల్డ్​ అనేది గోల్డ్​ ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్​లు (ETFs), సావరిన్ గోల్డ్​ బాండ్స్ (SGBs) రూపాల్లో మనకు లభిస్తుంది. అంతేకాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్​లు, డిజిటల్ గోల్డ్​ కూడా మనకు అందుబాటులో ఉంటుంది.

డిజిటల్ గోల్డ్​ ద్వారా కలిగే ప్రయోజనాలు, రిస్క్​లు, దానిపై పన్నులు ఇన్ఫోగ్రాఫిక్స్​ సాయంతో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్​ను పూర్తిగా చదవండి.

బంగారంలో ఎలా పెట్టుబడులు పెట్టాలో.. ఇక్కడ సవివరంగా ఉంది.

1. ఆభరణాలు

బంగారం చాలా విలువైనది. కానీ, బంగారు ఆభరణాల వలన మనకు భద్రతా పరమైన సమస్యలెన్నో వస్తాయి. బంగారాన్ని సురక్షితంగా భద్రపర్చేందుకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆభరణాల డిజైన్లు కూడా పాతవి అయిపోతాయి.

అంతేకాకుండా బంగారంపై తయారీ చార్జీలు, డెలివరీ చార్జీలు చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి. బంగారు ఆభరణాలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవే. ఒక్కో ఆభరణం తయారు చేసేందుకు తయారీదారులు బంగారం ధరలో 7 శాతం నుంచి 12 శాతం వరకు తీసుకుంటారు. (కొన్ని ప్రత్యేక ఆభరణాలకు 25 శాతం వరకు తయారీ చార్జీలు ఉంటాయి.) వాటిని తిరిగి కూడా చెల్లించరు.

ఈ ఖర్చులు మాత్రమే కాకుండా భద్రతా సమస్యలు ఎలాగూ ఉంటాయి.

2. బంగారు నాణేలు

ఆభరణాల దుకాణాలు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ పైనాన్షియల్ కంపెనీలు, పలు ఈ–కామర్స్ వెబ్​సైట్లు కూడా ప్రస్తుతం బంగారు నాణేలను విక్రయిస్తున్నాయి.

ఒకవైపు అశోక చక్ర, మరోవైపు మహాత్మాగాంధీ చిహ్నం ఉన్న బంగారు నాణేలను ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది.

5, 10 గ్రాముల బరువు​లో బంగారు నాణేలు ఉంటాయి. అంతేకాకుండా బంగారం కడ్డీలు 20 గ్రాముల వరకు ఉంటాయి.

మన దేశంలో లభించే బంగారు నాణేలు, బంగారం కడ్డీలు 24 క్యారెట్ల స్వచ్ఛతతో లభిస్తాయి. అంతేకాకుండా ఆగ్​మార్క్ 999 గుర్తు కూడా ఉంటుంది. వీటికి టాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ కూడా ఉంటుంది. వీటిని నకిలీ చేయలేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తారు.

అన్ని నాణేలు, బంగారు కడ్డీలు కూడా బీఐఎస్​ (BIS) మార్గదర్శకాల ప్రకారం హాల్​మార్క్ చేయబడతాయి. ఎంఎంటీసీ (MMTC) అధీకృత స్టోర్ల ద్వారా ఇవి పంపిణీ చేయబడతాయి. అంతేకాకుండా కొన్ని బ్యాంకుల బ్రాంచుల్లో, పోస్టాఫీసుల్లో కూడా లభిస్తాయి.

అయితే, ఇక్కడ కూడా భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి. 10 సంవత్సరాల కాలం తర్వాత వీటిని పాలిష్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఖర్చు పెరిగే ఆస్కారం ఉంటుంది.

3. గోల్డ్​ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)

గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (Gold ETF) ద్వారా డిజిటల్ గోల్డ్​ను (పేపర్) కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్నది.

బంగారం అనేది ఒక అండర్ లయింగ్ అసెట్. బంగారం క్రయవిక్రయాలు, కొనుగోలు ప్రక్రియ ఎన్​ఎస్​ఈ (NSE) లేదా బీఎస్​ఈ (BSE) లో జరుగుతుంది.

ఆభరణాలు, బంగారు కడ్డీలు, బంగారు నాణేల వంటి వాటితో ఉన్న ప్రారంభ ఖర్చులు తక్కువ. కావున ఇది గోల్డ్​ ఈటీఎఫ్​లకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది.

ఇందులో ఉన్న మరొక ప్రయోజనం ధర విషయంలో పారదర్శకత. భౌతిక బంగారం ధర అనేది బెంచ్​మార్క్​లా ఉంటుంది. బంగారం వాస్తవ ధరకు చాలా దగ్గరగా ఉంటుంది.

ఇందుకోసం మీకు కావాల్సిందల్లా స్టాక్ బ్రోకర్​తో ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్.

క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (SIP) ల ద్వారా రోజువారీగా పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. మీకు అవసరమయితే 1 గ్రాము బంగారాన్నైనా కొనుగోలు చేయొచ్చు.

ఎటువంటి ప్రవేశ ఖర్చులు, నిష్క్రమణ ఖర్చులు ఇక్కడ ఉండవు. కానీ ఇతర ఖర్చులు ఉంటాయి. అవేంటంటే...

1. ఎక్స్​పెన్స్ రేషియో (ఫండ్​ను మ్యానేజ్ చేయడం కోసం): ఈ ఖర్చు 1 శాతం వరకు ఉంటుంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్​తో పోల్చినపుడు ఇది చాలా తక్కువగా ఉంటుంది.

2. మీరు బంగారు ఈటీఎఫ్​లను కొనుగోలు చేసిన లేదా అమ్మిన ప్రతీసారి బ్రోకర్ చార్జీలు.

3. ట్రాకింగ్ విధానం సరికాదు. టెక్నికల్​గా దీని కోసం ఎటువంటి చార్జీలు లేకపోయినా మన రీఫండ్స్​పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ట్రాకింగ్ అనేది ప్రస్తుతం ఉన్న బంగారం ధరను ప్రభావితం చేయదు.

4. సావరిన్ గోల్డ్​ బాండ్స్ (SGBs)

మరో విధానంలో డిజిటల్ గోల్డ్​ను (పేపర్) సొంతం చేసుకునే మార్గం సావరిన్ గోల్డ్​ బాండ్స్​.

గ్రమ్స్ ఆఫ్ గోల్డ్​ సర్టిఫికెట్లను తప్పనిసరి చేస్తూ ఆర్​బీఐ (RBI) ఆదేశాలు జారీ చేసింది. మీకు ఎటువంటి చింతా లేకుండా ఈ బంగారంలో మీరు పెట్టుబడులు పెట్టొచ్చు.

ఈ సావరిన్ బాండ్లను ప్రభుత్వమే జారీ చేసినప్పటికీ ఎక్కువగా అందుబాటులో ఉండవు. ఇన్వెస్టర్లు సావరిన్ గోల్డ్​ బాండ్లను (SGBs) కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అప్పుడప్పుడూ అనుమతిస్తుంది.

ఈ ప్రక్రియను ప్రభుత్వం సాధారణంగా 2-3 నెలలకు ఒకసారి అనుమతిస్తుంది. దీనికి సంబంధించిన విండో వారం రోజుల పాటు ఓపెన్​గా ఉంటుంది.

సావరిన్ గోల్డ్​ బాండ్లు (SGB)లు 8 సంవత్సరాల కాలపరిమితితో ఉంటాయి. మనం కనుక మన పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే మాత్రం 5 సంవత్సరాల వరకు ఆగాల్సి ఉంటుంది.

మరి మీరు మొదటిసారి పెట్టుబడి పెడుతూ, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతూ ఉంటే, మీకు ఆర్థిక పరమైన పరిజ్ఞానం లేకపోతే ఎలా అని ఆలోచిస్తూ వెనుకాడుతున్నారా?

అయితే, చిన్న చిన్న పెట్టుబడుల ప్రణాళికలతో డిజిటల్ గోల్డ్​లో చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.

5. డిజిటల్ గోల్డ్

డిజిటల్ గోల్డ్ అనేది బంగారంపై పెట్టే పెట్టుబడులలో సురక్షితమైన మార్గం. పైగా చాలా పారదర్శకమైనది.

సాధారణంగా బంగారం ధరలలో ఉండే జిమ్మిక్కులు ఇక్కడ ఉండవు. చాలా పారదర్శకంగా ఉంటుంది. ఇన్వెస్టర్​ భౌతిక బంగారాన్ని తాకకుండానే సులభంగా ప్రపంచంలో ఎక్కడైనా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.

మీరు అనేక యాప్స్, వెబ్​సైట్లలో డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేయవచ్చు. కానీ మీరు కొన్న బంగారాన్ని నిల్వ చేసేందుకు కేవలం మూడు సంస్థలు మాత్రమే ఉంటాయి. అవి 1. ఆగ్​మాంట్ గోల్డ్​ లిమిటెడ్ 2. డిజిటల్ గోల్డ్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్- సేఫ్​ గోల్డ్​ 3. MMTC-PAMP ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

మీరు బంగారాన్ని ఆన్​లైన్ వేదికగా కొనుగోలు చేయడానికి, బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ఇది సులువైన మార్గం. పైగా ఖర్చు కూడా తక్కువే. ఇక్కడ మీరు ఎంత తక్కువ మొత్తంలో అయినా పెట్టుబడులు పెట్టవచ్చు. పైగా, ఎటువంటి స్టోరేజ్, రవాణా చార్జీలు ఉండవు.

దీనిలో మీకు కావాలనుకుంటే బంగారాన్ని భౌతిక రూపంలో ఇంటికి కూడా డెలివరీ చేస్తారు. ఇక్కడ మరో మంచి విషయం ఏమిటంటే... మీరు రూ. 1 నుంచి కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.

జార్ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టడం ఎలా?

జార్ అనేది ఆటోమేటిక్ ఇన్వెస్ట్​మెంట్ యాప్. మీరు ఆన్​లైన్ లావాదేవీలు చేశాక మిగిలే చిల్లరను ఈ యాప్ డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెడుతుంది.

ఈ ఆలోచన ఏదో చాలా బాగుంది కదూ. ఈ పెట్టుబడి ప్రమాదకరం కూడా కాదు. మీ జేబుపై ఎటువంటి ఆర్థిక భారాన్ని కూడా వేయదు.

మరి ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడే యాప్​ని డౌన్​లోడ్ చేసుకుని మీ ఇన్వెస్ట్​మెంట్ జర్నీని ప్రారంభించండి.

 

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.