Playstore Icon
Download Jar App
Digital Gold

డిజిటల్ గోల్డ్​కు సంబంధించి 9 సాధారణమైన అపోహలు - జార్ యాప్

December 28, 2022

డిజిటల్ గోల్డ్ అనేది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక కొత్త మార్గం. అందుకే దీని విషయంలో చాలా అపోహలు తలెత్తుతాయి. కానీ అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం.

ఎన్నో ఏళ్లుగా బంగారానికి చాలా డిమాండ్, విలువ ఉంది. పైగా, అది ఎప్పటికీ తగ్గదు.

ఇప్పుడు మేము బంగారాన్ని కొనుగోలు చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నాం: డిజిటల్ గోల్డ్.. మీరు బంగారాన్ని కొనాలని చూస్తున్నట్లయితే ఇది సురక్షితమైన, అత్యంత అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపిక అని చెప్పవచ్చు.

మీరు కొనుగోలు చేసే ప్రతి గ్రాము బంగారానికి - ఆగ్​మోంట్​, MMTC - PAMP మరియు SafeGold - దేశంలోని ఈ మూడు గోల్డ్ బ్యాంకుల్లో మీ పేరు మీద 24 క్యారెట్ల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం నిల్వ చేయబడుతుంది.

యాప్‌లోని బటన్‌పై ఒక్క క్లిక్‌ చేసి, మీరు భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు, విక్రయించొచ్చు లేదా మీ ఇంటికి డెలివరీ చేయాలని కోరవచ్చు.

అంతేకాదు డిజిటల్ గోల్డ్ కోసం కనీసం ఇంత మొత్తంలో కొనాలన్న రూల్​ ఏమీ లేదు. మీరు ఒక్క రూపాయితో కూడా దీన్ని ప్రారంభించవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు.

కాకపోతే ఇలాంటిది ప్రజలకు కొత్త కాబట్టి డిజిటల్ గోల్డ్ గురించి అనేక అపోహలు, సందేహాలు ఉంటాయి.

మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడటానికి వాటిలో ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకుంందాం:‍

1. బంగారం ఖరీదైనది. బంగారంలో పొదుపు చేయాలంటే సంపన్నులు అయి ఉండాలి.

నిజం: అస్సలు కాదు! జార్ యాప్‌ను ఉపయోగించి డిజిటల్ గోల్డ్​ను ఒక్క రూపాయికే కొనవచ్చు. అవును, మీరు చదివింది నిజమే.

అందరూ అనుకున్నట్టు ‍చాలా మంది వ్యక్తులు బంగారాన్ని హోదాకు ప్రతీకగా భావిస్తారు. కానీ మీరు కూడా మీకు కావాల్సినంత డబ్బును దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు.

బంగారాన్ని తక్కువ ధరకు పొందొచ్చు. ఇది ఒక సమర్థమైన పెట్టుబడి. ఒకప్పుడు లభించని విలువైన లోహం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది.

2. ఆన్‌లైన్ బంగారం స్వచ్ఛమైన బంగారం కాదు.

నిజం: జార్‌లో డిజిటల్ గోల్డ్​ 99.5 శాతం 24 క్యారెట్ల స్వచ్ఛతతో ఉంటుంది. మీరు డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసేటప్పుడు Augmont Gold Ltd, SafeGold, and MMTC-PAMP India Pvt. Ltd. వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఆ బంగారాన్ని పొందండంలో మీకు సాయపడే మధ్యవర్తులు నుంచి కొనుగోలు చేస్తున్నారని గమనించండి. అంటే ఇది నిజమైనది, సురక్షితమైనది, మరియు స్వచ్ఛమైనదని అర్థం.

3. బంగారం పెట్టుబడి చాలా రిస్కుతో కూడుకున్నది.

నిజం: ప్రతి పెట్టుబడిలో కొంతమేర రిస్క్ అయితే ఉంటుంది. అలాగే దాని సొంత ప్రయోజనాలు, ప్రతికూలతలు కూడా ఉంటాయి. బంగారం విషయంలో కూడా అదే జరుగుతుంది. బంగారం  విషయానికి వస్తే స్టాక్‌లు, ఈక్విటీల వంటి ఇతర అస్థిరమైన పెట్టుబడుల కన్నా తక్కువ రిస్క్ ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.

బంగారం అనేది ఎల్లప్పుడూ డిమాండ్‌తో కూడుకున్న విలువైన సహజ వనరు. కనుక ఇదొక మంచి పెట్టుబడి. ద్రవ్యోల్బణం, నష్టం చేకూర్చే పెట్టుబడుల నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఇది సరైన మార్గం.

4. బంగారం అనేది గోల్డ్ ఓనర్​షిప్​కు సంబంధించిన పేపర్ సర్టిఫికేషన్.

నిజం: అది నిజం కాదు. మీరు చూడలేకపోయినప్పటికీ, మీరు నిజంగా బంగారాన్ని కలిగి ఉన్నట్టే. ఎంత కొన్నారో సంబంధం లేకుండా కొనుగోలు చేసిన బంగారం మొత్తాన్ని సురక్షితమైన, ఇన్సూర్ చేసిన ఖజానాలో భద్రంగా ఉంటుంది. వినియోగదారులు తమ బంగారం కొనుగోళ్లను ఏ క్షణంలోనైనా తీసుకోవచ్చు. దాన్ని డెలివరీ కూడా చేయించుకోవచ్చు.

5. బంగారం మంచి పెట్టుబడి కాదు. ఇది ఎలాంటి వడ్డీని తీసుకురాదు.

నిజం: నిజం దీనికి వ్యతిరేకం. చక్కటి ప్రణాళికతో బంగారంపై పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి.

బంగారాన్ని కొనడం అంటే ఒక రకంగా కరెన్సీని కలిగి ఉండటమే. ఇది రిస్కుతో కూడుకున్న స్టాక్ కొనుగోళ్లతో పోలిస్తే దాని భద్రతను పెంచుతుంది. మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేయడం, ద్రవ్యోల్బణం ప్రభావం పడకుండా పని చేయడం, అద్భుతమైన దీర్ఘకాలిక మూలధన రాబడిని అందించడంలో బంగారం మీకు సాయపడుతుంది.

వస్తువుల విక్రయంపై 20 శాతం పన్ను విధించిన తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాలతో పాటు అదనపు ప్రోత్సాహకాలు ఉంటాయి. (అవి 3 సంవత్సరాలవి అయినా కూడా) 

గత 92 ఏళ్లుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. బంగారం అంతర్లీనంగా విలువ కలిగి ఉంది. భారతదేశంలో బంగారం అనేది ఏటికేటికీ చాలా బలమైన రాబడి అందించడమే కాకుండా ఒక అద్భుతమైన ఆస్తి.

బంగారంతో సమానమైన రీసేల్ విలువ లేని వజ్రాలు లేదా ప్లాటినంతో పోలిస్తే బంగారం ఒక ఘనమైన ప్రత్యామ్నాయమైన పెట్టుబడిగా చెప్పుకోవచ్చు.

6. బంగారాన్ని కొనడం సంక్లిష్టమైనది. చాలా ఎక్కువ శ్రమతో కూడుకుంది.

నిజం: డిజిటల్ గోల్డ్ అనేది చాలా సులభం, అనుకూలమైంది. ప్రారంభించాలనుకుంటే ఒక ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్ బ్యాంకు ఖాతా లేదా యూపీఐ మాత్రమే అవసరం.

చాలా తక్కువ సమయంలోనే బంగారం మీ వద్దకు చేరుకుంటుంది. జార్ యాప్‌లో కేవైసీ అవసరం లేకుండానే 30 గ్రాముల వరకు డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేయొచ్చు.

ఇది ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువును కొనుగోలు చేసినట్టే. లావాదేవీ రూ. 2 లక్షలు మించిన పరిస్థితుల్లో మాత్రమే పాన్ కార్డు వివరాలు అవసరం అవుతాయి.

7. డిజిటల్ గోల్డ్ అసలైన బంగారంతో సమానం కాదు.

నిజం: అవును! మీ బంగారం బ్యాలెన్స్ 0.5 గ్రాములకు చేరుకుంటే అసలైన బంగారం (నాణేలు లేదా ఆభరణాలు)గా మార్చుకోవచ్చు.

జార్ యాప్‌ను ఉపయోగించి, మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా అసలైన బంగారంగా మార్చుకోవచ్చు. అలాగే ఏ సమయంలోనైనా మీ ఇంటికి డెలివరీ చేసుకోవచ్చు.

నిజానికి, అసలైన బంగారం కంటే ఇదే ఉత్తమం. మీరు మీ ఖర్చు చేయగలిగే సామర్థ్యాన్ని బట్టి ఆదా చేసుకోవచ్చు.

మీ బంగారం పూర్తిగా ఇన్సూరెన్స్ చేసిన లాకర్లలో నిల్వ చేయబడి ఉంటుంది. కాబట్టి దొంగతనం జరిగే ప్రమాదం కూడా ఉండదు.

8. ఈక్విటీల్లో దీర్ఘకాలిక రాబడులు ఉత్తమం.

నిజం: ఇది ఎల్లప్పుడూ కాదు. బంగారం తరచుగా వేరే వాటిని దాటేస్తుంది. మీరు గత ఐదు, పదేళ్లలో డేటాను తనిఖీ చేస్తే మీకు తెలుస్తుంది. క్రమం తప్పకుండా రాబడులు ఈక్విటీల కన్నా మెరుగ్గా ఉన్నాయనే విషయం అర్థం చేసుకోవచ్చు.

వాస్తవానికి బంగారంలో పొదుపు చేయడం వల్ల స్టాక్ మార్కెట్‌లో తలెత్తే భారీ ఒడిదుడుకుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంటుంది.

9. కనిపించని చార్జీలు, స్టోరేజీ ధరలు అధికంగా ఉంటాయి. 

నిజం: పారదర్శకతను జార్ గట్టిగా నమ్ముతుంది. మీరు జార్ యాప్‌ని ఉపయోగించి పెట్టుబడి పెడితే, మీరు స్వచ్ఛమైన అంటే 24 క్యారెట్ల బంగారంతో వ్యాపారం చేసినట్టే.

మీరు ఖర్చు చేసిన మొత్తం బంగారంలో పెట్టుబడి పెడుతారు. కొనుగోలు సమయంలో మీరు 3 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లించాల్సి వస్తుంది.

అదనపు చార్జీలు లేదా కనిపించని చార్జీలు అంటూ ఏమీ ఉండవు. అన్ని డిజిటల్ గోల్డ్‌లు హై-సెక్యూరిటీ వాల్ట్‌లలో ఉచితంగా దాచి ఉంచుతారు. మరియు పూర్తిగా ఇన్సూరెన్స్ చేయబడి ఉంటాయి.

డిజిటల్ గోల్డ్ గురించి మరింతగా ఇక్కడ చదవండి. భౌతిక బంగారం కంటే డిజిటల్ గోల్డ్ ఎలా మెరుగైనదో ఇక్కడ తెలుసుకోండి.

ఇప్పుడు మేం వాస్తవాలను మీ ముందు ఉంచాం.  డిజిటల్ గోల్డ్​ను ఒక్కసారి ప్రయత్నించడానికి కూడా మీరు అంగీకరించట్లేదా? ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. దీనికి 45 సెకన్లు, ఒక్క రూపాయి మాత్రమే అవసరం పడుతుంది.

జార్ కేవలం డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ మాత్రమే కాదు అంతకు మించి. ఇది మీరు డబ్బును ఆదా చేసుకోవడానికి మీకు సాయపడే ఆటోమేటిక్ పెట్టుబడి సాధనం. ఇంకేం మీ పొదుపును పెంచుకోండి ఇక.

జార్ యాప్‌తో వెంటనే డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి!

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.