Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
క్రెడిట్ కార్డుల గురించి మీరు అన్ని విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక గైడ్ ఇది. అవి పని చేసే విధానం నుంచి వాటిని జాగ్రత్తగా ఎలా వాడాలో కూడా తెలుసుకోండి.
మీరు పాఠశాల లేదా కళాశాల నుంచి బయటికి వచ్చాక క్రెడిట్ కార్డును వాడేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా?
ఇతర విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు. మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలను కూడా మీరే నిర్వహించుకోవాలి. పర్సనల్ ఫైనాన్స్‌ను సులభతరం చేసేందుకు అందుబాటులో ఉన్న టెక్నాలజీలను ఒకసారి చెక్ చేయండి.
మీరు క్రెడిట్ కార్డును పొందాలని నిర్ణయించుకుంటే అది మంచి నిర్ణయం. ఇది మీ పర్సనల్ ఫైనాన్స్‌కు ఒక మైలురాయి. కానీ క్రెడిట్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వ్యక్తులు బ్యాంకుల దగ్గరి నుంచి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోతే వారి క్రెడిట్ రేటింగ్ దారుణంగా దెబ్బతింటుంది. దీని గురించి ఇప్పటికే మీరు ఎక్కడో ఒక చోట విని ఉంటారు.
మీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించకపోతే మీకు నష్టం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.
చాలా మందికి క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలో దాని పేమెంట్ ఎలా చేయాలో తెలియదు. అందువల్ల వారి క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. కాబట్టే మేము జార్ యాప్‌లో క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగించాలనే దాని మీద ఒక గైడ్‌ను రూపొందించాం. ఈ గైడ్ సాయంతో మీరు క్రెడిట్ పేమెంట్స్ చేయడంలో, క్రెడిట్ కార్డును సక్రమంగా వాడటంలో హీరోగా మారుతారు.
అర్థం చేసుకోవడానికి కింది వాటిని చదవండి:
● క్రెడిట్ కార్డులు ఎలా పని చేస్తాయి?
● క్రెడిట్ కార్డుల్లో ఉండే సాధారణ రకాలు ఏంటి?
● క్రెడిట్ కార్డు వల్ల లాభనష్టాలు ఏమిటి?
● క్రెడిట్ కార్డును ఎలా ఎంచుకోవాలి?
● క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
● క్రెడిట్ కార్డును ఎలా బాధ్యతగా వాడాలి?
● మీకు నిజంగా క్రెడిట్ కార్డు అవసరమా?
ఇక్కడ మొదలు పెడదాం..
సింపుల్‌గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకు ఖాతా నుంచి తక్షణమే డబ్బులను తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు నచ్చిన వస్తువును మీరు కొనుగోలు చేసేలా అనుమతిస్తుంది. (ఒక రుణంలాగా)
బదులుగా మీరు ఇందుకు సంబంధించిన మొత్తాన్ని నెలకు ఒకసారి చెల్లించాలి. మీరు కనుక గడువు తేదీ లోపల చెల్లించడంలో విఫలమైతే మీరు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. (మీరు వాడుకున్న అమౌంట్‌ను బట్టి)
మీ ఆర్థిక సంస్థకు అవి లింక్ చేయబడవు. స్టోర్లు, ఫోన్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఎక్కడైనా సరే ఈ కార్డులను వాడుకోవచ్చు. డెబిట్ కార్డు లాగానే..
మీరు బ్యాంకు ఏటీఎం నుంచి నగదును కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.
సమీప భవిష్యత్‌లో రుణాలను పొందేందుకు ప్రజలు క్రెడిట్ కార్డులను పొందుతారు. వీటి ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
మీరు క్రెడిట్ కార్డును స్వీకరించి.. సకాలంలో వాటి బిల్లులను చెల్లిస్తే బ్యాంకులు మిమ్మల్ని బాధ్యతాయుతమైన వ్యక్తిగా భావిస్తాయి. (మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే)
వారు మీకు భవిష్యత్తులో తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు (ఇంటి కోసం రుణాల వంటివి). అంతేకాకుండా మీకు క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ప్రతి నెలా క్రెడిట్ కార్డు వినియోగదారుకు ఆ నెలలో క్రెడిట్ కార్డుతో చేసిన పేమెంట్ల వివరాలు (క్రెడిట్ కార్డు స్టేట్మెంట్) పంపించబడుతుంది.
కార్డు హోల్డర్ స్టేట్మెంట్ను పొందిన తర్వాత తప్పుగా భావించే ఏదైనా చార్జీలను సవాలు చేయవచ్చు.
కార్డు హోల్డర్ నిర్ధేశించిన సమయంలో మనం వాడిన అమౌంట్ నుంచి కొంతైనా చెల్లించాలి. లేకపోతే పూర్తి అమౌంట్ అయినా చెల్లించే సౌలభ్యం ఉంటుంది.
పూర్తిగా చెల్లించని పక్షంలో రుణదాత చేసిన బిల్లుపై వడ్డీని వసూలు చేస్తారు.
కార్డు హోల్డర్ అకౌంట్లో డబ్బులు ఉన్నంత కాలం క్రెడిట్ కార్డు సంస్థలు ఆటో పేమెంట్స్ లేదా ఆటో పే ఏర్పాటు చేసుకుంటాయి. దీంతో ఆలస్యంగా పేమెంట్ చేయడాన్ని నివారించవచ్చు.
ఈ వివరణ అర్థం అయ్యేందుకు ఒక ఉదాహరణను చూద్దాం...
ఆకాష్ అనే వ్యక్తికి రూ. 1,00,000 వరకు పరిమితి (లిమిట్) ఉన్న ఒక క్రెడిట్ కార్డు ఉంది. అతడికి ప్రతీ నెల 19వ తారీఖున స్టేట్మెంట్ వస్తుంది.
అతడు 3.35 శాతం నెలవారీ వడ్డీతో తదుపరి నెల 9వ తేదీన బిల్లును చెల్లించాల్సి ఉంటుంది.
అతని వద్ద రూ. 3,200 క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఉంది. అతడు అక్టోబర్ 5, 2020న తన క్రెడిట్ కార్డు బకాయిని పూర్తిగా చెల్లించాడు. అతడు కింద పేర్కొన్న వస్తువులను కొనుగోలు చేశాడు.
అతడి క్రెడిట్ కార్డు మీద వేసిన వడ్డీని కింది విధంగా లెక్కిస్తారు.
21 రోజులకు రూ. 3,200 (సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు) నెలకు 3.35 శాతం వడ్డీ= రూ. 75.04
10 రోజులకు రూ. 2,500 (సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు) నెలకు 3.35 శాతం వడ్డీ = రూ. 27.92
అందుకోసమే ఆకాష్ రూ. 102.96ని వడ్డీగా చెల్లించాలి. అతడి ఇంధన ఖర్చులు, భోజన ఖర్చులు, షాపింగ్ ఫైనాన్షియల్ జరిమానాల నుంచి మినహాయించబడతాయి. ఎందుకంటే ఓవర్ డ్యూ అమౌంట్‌ను అక్టోబర్ 5నే చెల్లించాడు.
మీ అవసరాలకు తగిన విధంగా మీ కార్డును కస్టమైజ్ చేసుకునే ఆప్షన్‌ను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు అందజేస్తాయి. అయితే మీరు అధికంగా ఖర్చు చేసి అప్పుల్లో కూరుకుపోకూడదు.
మీరు ఈ కార్డులను కలిగి ఉన్నట్లయితే మీరు అనేక రకాల ఆర్థిక పరమైన రివార్డులను పొందుతారు. మీరు భారతదేశంలో నివశిస్తున్నట్లయితే ఈ కింద మీరు పొందగల క్రెడిట్ కార్డు రకాలు ఉన్నాయి.
1. బేసిక్ క్రెడిట్ కార్డు
2. బిజినెస్ క్రెడిట్ కార్డు
3. స్టూడెంట్ క్రెడిట్ కార్డు
4. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు
5. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ క్రెడిట్ కార్డు
6. ట్రావెల్ క్రెడిట్ కార్డు
7. క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డు
8. ఫ్యూయల్ క్రెడిట్ కార్డు
9. ప్లాటినం క్రెడిట్ కార్డు
10. గోల్డ్ క్రెడిట్ కార్డు
11. సిల్వర్ క్రెడిట్ కార్డు
మీరు కనుక క్రెడిట్ కార్డుల వాడకానికి కొత్తయితే ఈ కార్డు మీకు బాగా పనిచేస్తుంది.
ఈ కార్డు ద్వారా మీ నెలవారీ ఆదాయం ఆధారంగా మీకు క్రెడిట్ పరిమితి విధిస్తారు. మీరు కొత్త క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు అప్పుల్లో కూరుకుపోవడం మంచిది కాదు.
బేసిక్ క్రెడిట్ కార్డులు మీరు ఖర్చు చేసిన అమౌంట్‌ను బట్టి ఎటువంటి క్రెడిట్ పరిమితిని పెంచవు.
బిజినెస్ క్రెడిట్ కార్డు అనేది ఒక కన్వెన్షనల్ క్రెడిట్ కార్డు మాదిరిగానే ఉంటుంది. ఇది బిజినెస్ లావాదేవీలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
మీకు పర్సనల్ క్రెడిట్ కార్డు ఉంటే మీ కంపెనీ పేరుతో బిజినెస్ క్రెడిట్ కార్డును కూడా కలిగి ఉండవచ్చు.
బిజినెస్ క్రెడిట్ కార్డులు మీ బిజినెస్ డబ్బును, వ్యక్తిగత డబ్బును వేర్వేరుగా ఉంచుతూ మీ రోజువారీ అవసరాలను తీర్చేందుకు సులభమైన మార్గం.
వ్యక్తిగత క్రెడిట్ కార్డు కలిగి ఉన్న దానికంటే అదనంగా ఈ బిజినెస్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను అందిస్తుంది.
బిజినెస్ క్రెడిట్ కార్డులతో బిజినెస్ యజమానులు తమ కంపెనీల కోసం కొనుగోళ్లను చేస్తారు.
అది ప్రింటర్ పేపర్ నుంచి ఆఫీసులోకి ఉపయోగపడే ఏదైనా వస్తువు కావొచ్చు.
మీ వ్యక్తిగత క్రెడిట్ కార్డును ఉపయోగించకుండా.. మీ సొంత డబ్బును ఖర్చు చేయకుండా, బిజినెస్ లోన్ తీసుకోకుండా ఉండేందుకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి.
స్టూడెంట్ క్రెడిట్ కార్డు అనేది కాలేజ్ స్టూడెంట్స్‌కే అందుబాటులో ఉంటుంది. వారికి ఎటువంటి ఆదాయ పరిమితి ఉండదు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డుకు 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ క్రెడిట్ కార్డులు 5 సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. మీ ఖర్చులను మేనేజ్ చేసుకునేందుకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు అనేది సాధారణంగా ఏవైనా నిర్దిష్టమైన స్టోర్లు, రిటైలర్లు జారీ చేసే క్రెడిట్ కార్డులు. కానీ ఈ కార్డులు కేవలం ఆ స్టోర్ వరకు మాత్రమే పని చేయకుండా మేజర్ క్రెడిట్ కార్డులైన వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard), లేదా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (American Express)తో కలిసి ఉంటాయి.
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుతో మీరు కొన్ని బ్రాండ్ల మీద కొనుగోళ్లు చేస్తే అదనపు తగ్గింపులు, రీఫండ్లు మీకు లభిస్తాయి.
సంప్రదాయ రిటైల్ ప్రైవేట్ లేబుల్స్‌తో ఉన్న కార్డుల కంటే ఇవి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. తక్కువ ఖర్చులను కలిగి ఉంటాయి. కొత్త కస్టమర్లను కూడా ఆమోదిస్తాయి.
బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ క్రెడిట్ కార్డు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ మీద చాలా కంపెనీలు 0 శాతం ప్రారంభ యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (APR) కలిగి ఉంటాయి.
0 శాతం యాన్యువల్ పర్సంటేజ్ రేట్‌తో (APR) నెలవారీ చెల్లింపు వడ్డీకి బదులుగా మీ పాత బకాయిల వైపు వెళ్తుంది. కావున మీరు పాత చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను వేగంగా చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.
మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసేవారైతే ట్రావెల్ క్రెడిట్ కార్డును ఉపయోగించి విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ చేస్తే ఎక్కువ రివార్డు పాయింట్లను పొందవచ్చు.
కొత్త ప్రయాణ బుకింగ్‌ల కోసం ఈ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం అనేక రకాల క్రెడిట్ కార్డు కంపెనీలు తమ కార్డులను వాడినందుకు రివార్డులను అందజేస్తున్నాయి.
మీ రుణం ఎంత పెద్దది, మీరు ఎంత తరుచుగా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారనే దానిని బట్టి క్యాష్‌బ్యాక్‌లు వస్తుంటాయి.
ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు క్యారియర్లకు కూడా ఉపయోగపడతాయి. ఫ్యూయల్ క్రెడిట్ కార్డులను మీ వాహనంలో ఇంధనం నింపుకొనేందుకు వాడితే మీరు ఎక్కువ డబ్బును ఆదా చేయవచ్చు. మీరు రోజూవారీగా ఇంధనం నింపుకోవడం వలన ఎక్కువ డబ్బును ఆదా చేయవచ్చు.
ఇందులో కూడా మీకు రివార్డు పాయింట్లు వస్తాయి. ఏడాది పొడవునా ఈ కార్డులను ఫ్యూయల్ కోసం ఉపయోగించడం వలన మీరు అధికంగా డబ్బును ఆదా చేసుకోవచ్చు.
ప్లాటినం క్రెడిట్ కార్డులను మంచి ఆదాయం ఉన్న వ్యక్తులకు జారీ చేస్తారు. సిల్వర్, గోల్డ్ క్రెడిట్ కార్డులతో పోల్చినపుడు ప్లాటినం క్రెడిట్ కార్డులు అధిక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో ఫీచర్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
ప్లాటినం క్రెడిట్ కార్డులు సాధారణంగా స్టేటస్ సింబల్‌గా ఉపయోగించబడతాయి. కానీ.. ప్రస్తుతం ఇవి సాధారణ వ్యక్తులకు కూడా అందుబాటులో ఉంటున్నాయి.
బంగారం రంగు క్రెడిట్ కార్డులను సగటు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే వినియోగదారులకు జారీ చేస్తారు. దీనిలో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్లతో పాటు ఓవర్ డ్రాఫ్ట్, వార్షిక ఫీజుల మాఫీ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
క్రెడిట్ కార్డులను మొదటగా ప్రవేశపెట్టిన 1950ల నుంచి సిల్వర్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి.
గోల్డ్, ప్లాటినం క్రెడిట్ కార్డుల కంటే కూడా సిల్వర్ కార్డులు ఎక్కువ ఖ్యాతిని గడించాయి. వీటిని సాధారణంగా ప్రాథమిక లేదా ప్రామాణిక క్రెడిట్ కార్డులుగా భావిస్తారు.
క్రెడిట్ కార్డును ఉపయోగించడం జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఖర్చు చేసేవారిని బాధ్యతగా కూడా ఉంచుతుంది.
క్రెడిట్ కార్డులను సక్రమంగా ఉపయోగించకపోతే మీరు అప్పులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టే వాటిని చాలా జాగ్రత్తగా వాడాలి. వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా అవసరం.
1. తీసుకెళ్లడం, ఉపయోగించడం తేలిక: ప్రీపెయిడ్ కార్డుల కంటే క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఆమోదిస్తారు. వాటిని ఎక్కడికైనా తీసుకుపోవడం చాలా తేలిక.
2. నగదు కంటే ఎక్కువ సురక్షితమైనది: క్రెడిట్ కార్డు అనేది నగదు కంటే ఎక్కువ సురక్షితమైనది. ఒకవేళ మీ కార్డు దొంగిలించబడినా లేదా ఎక్కడైనా పోయినా వెంటనే బ్యాంక్‌కు ఫోన్ చేసి దానిని బ్లాక్ చేయించే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు విషయంలో ఏదైనా మోసం జరిగితే మీకు డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
3. చాలా సురక్షితం: ఏదైనా క్రెడిట్ కార్డు ఫ్రాడ్ (మోసం) జరిగినప్పుడు కేవలం వినియోగదారుడు మాత్రమే బాధ్యత వహిస్తాడు.
4. అత్యవసర పరిస్థితుల్లో: క్రెడిట్ కార్డులు మీకు అదనపు ఆర్థిక భద్రతను కలిగిస్తాయి. ఏదైనా మీకు అత్యవసర పరిస్థితి వచ్చి మీ వద్ద డబ్బులు లేని పరిస్థితి వస్తే మీరు క్రెడిట్ కార్డుల మీద ఆధారపడవచ్చు.
5. ఉచితాలు: రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ అనేవి క్రెడిట్ కార్డు మీద సాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ వీటిని చూసి మాత్రమే క్రెడిట్ కార్డును ఎంచుకోకూడదు.
6. క్రెడిట్ స్కోరును పెంచుకునే అవకాశం: మీ క్రెడిట్ పరిమితి కంటే తక్కువగా వాడుకోవడం, ప్రతీ నెలా క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయడం వలన మీ క్రెడిట్ స్కోరు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒక్క పేమెంట్ మిస్ చేసినా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయడం అవసరం.
1. అధిక వడ్డీ చెల్లింపులు: మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని గడువు తేదీలోపు చెల్లించకపోతే మీరు అదనంగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. (మీరు 0 శాతం ప్రోగ్రాంలో లేకపోతే) ఈ వడ్డీ రేటు చాలా ఎక్కువ. ఇతర రకాల రుణాల కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డు సంస్థలు సంవత్సరానికి 24 శాతం నుంచి 45 శాతం వరకు వడ్డీని విధిస్తాయి.
2. అధిక రుసుములు: వడ్డీ మాత్రమే కాకుండా కొన్ని కార్డులు అదనపు రుసుములను కూడా వసూలు చేస్తాయి. మీరు మీ క్రెడిట్ పరిమితిని దాటిపోయినా లేదా వాడుకున్న డబ్బులను తిరిగి చెల్లించడంలో విఫలమైనా కానీ మీకు జరిమానాలు పడే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డును ఉపయోగించి నగదు విత్ డ్రా చేసుకుంటే అధిక వడ్డీ రేట్లు పడతాయి. కొన్ని రకాల క్రెడిట్ కార్డుల మీద నెలవారి చార్జీలు కూడా విధిస్తారు.
3. అప్పుల పాలయ్యే ప్రమాదం: అప్పుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక్క నెల పేమెంట్ చేయడం మర్చిపోయినా మీకు వడ్డీలు విపరీతంగా పడతాయి. అప్పుడు మీరు తొందరగా అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు క్రెడిట్ కార్డును వాడుతుంటే ప్రతీనెలా పేమెంట్లు చేయాలి.
4. మీ క్రెడిట్ స్కోరుకు ప్రమాదకారి: ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు పేమెంట్ చేయడం మర్చిపోయినా లేదా మీ క్రెడిట్ పరిమితిని దాటిపోయినా అది మీ క్రెడిట్ స్కోరును దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ఇది మీకు భవిష్యత్‌లో రుణాలు రాకుండా చేస్తుంది.
5. డిపాజిట్లు, ప్రీ ఆథరైజేషన్లు మీ క్రెడిట్ పరిమితిని తగ్గిస్తాయి: కొన్ని రకాల వ్యాపారాలు ముందుగానే మీ క్రెడిట్ కార్డు నుంచి ప్రీ ఆథరైజేషన్ తీసుకుంటాయి. మినీ బార్ వంటి వాటికి మీరు చెల్లించకపోతే అవి మీకు చార్జీలను విధించవచ్చు. అంతేకాకుండా మీ క్రెడిట్ పరిమితిలోని కొంత భాగాన్ని హోల్డ్‌లో కూడా ఉంచుతాయి. అప్పుడు మీరు ఆ క్రెడిట్ పరిమితిని ఉపయోగించుకోలేరు. వారు ఆంక్షలు ఎత్తేసినా కూడా మీరు ఆ క్రెడిట్ పరిమితిని కొన్ని రోజుల వరకు వాడుకోలేరు.
6. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఖర్చుతో కూడుకున్నది: విదేశాల్లో క్రెడిట్ కార్డును వాడటం చాలా ఖర్చుతో కూడుకున్నది. మీ కార్డును బట్టి చార్జీలు ఉంటాయి. కొన్ని క్రెడిట్ కార్డులు ప్రయాణికుల కోసం ఉంటాయి. కానీ మిగతా కార్డులలో మాత్రం చార్జీలు విపరీతంగా ఉంటాయి. మీరు విదేశాల్లో కార్డును ఏదైనా కొనుగోలు చేసేందుకు వాడినా లేదా నగదు విత్ డ్రా చేసుకునేందుకు వాడినా కానీ అధిక చార్జీలు పడతాయి. మీరు అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటపుడు అందుకు తగిన కార్డులనే ఉపయోగించండి.
అన్ని అవసరాల కోసం క్రెడిట్ కార్డులు ఉన్నాయి – రివార్డు పాయింట్లను కలెక్ట్ చేసుకోవడం నుంచి ట్రావెల్ ప్రివిలేజెస్‌ను పొందడం వరకు.
ఏవైతే ప్రయోజనాలను మీరు పొందాలని చూస్తున్నారో తెలుసుకోవడం ద్వారా వాటిని నెరవేర్చే కార్డును మీరు కనుగొంటారు. దీంతో క్రెడిట్ కార్డు లక్ష్యాలలో మొదటి స్టెప్ విజయవంతంగా పూర్తవుతుంది.
ఉత్తమ క్రెడిట్ కార్డును ఎంచుకోవడం కోసం ఎలా శోధించాలో ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి.
● మీరు ఎక్కడ ఎక్కువగా, ఎక్కడ తక్కువగా ఖర్చు చేస్తున్నారో మీ ఖర్చులను చెక్ చేసుకోండి.
● మీరు చేసే ఖర్చుల సరళి పట్ల చాలా నిజాయతీగా ఉండండి.
● క్రెడిట్ కార్డుల గురించి పూర్తిగా తెలుసుకుని మీరు ప్రయోజనం పొందాలని అని అనుకున్నపుడు ఉత్తమమైన వాటిని ఎంచుకోండి.
● మీ ఆర్థిక స్థితిని, మీరు ఈఎంఐలలో ఎంత మొత్తం అదనంగా చెల్లించాలో తెలుసుకోండి.
● మీరు మీ క్రెడిట్ కార్డు కోసం వార్షిక ఫీజు చెల్లించాలా వద్దా అని నిర్ణయించుకోండి.
● వివిధ రకాల ప్రకటనలను చూసి మోసపోకండి. మీరు సొంతంగా పరిశోధించి వివరాలను తెలుసుకోండి.
మీ సొంత పరిశోధన, పైన పేర్కొన్న విషయాల ఆధారంగా కొన్ని క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవచ్చు. మీ అర్హతను చూసుకుని వాటి కోసం దరఖాస్తు చేయండి.
మీరు క్రెడిట్ కార్డు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత దాని కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో చాలా మార్గాల్లో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు వీలుంది.
మీరు ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉంటే.. బ్యాంక్ వెబ్సైట్లో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే మీకు తెలిసిన బ్యాంక్‌తో మీ క్రెడిట్ కార్డు ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఇది చాలా మంచి ఎంపిక.
మీకు సేవింగ్స్ లేదా పే అకౌంట్ ఉన్న ఆర్థిక సంస్థ కావొచ్చు.
బ్యాంక్ వెబ్సైట్లో అప్లై క్రెడిట్ కార్డ్ అని ఉన్న చోట మీ వివరాలను పూరించి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు వెంటనే ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌ను ఉపయోగించండి.
మీకు నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్ కార్డే కావాలని అనుకున్నపుడు.. మీరు నేరుగా ఆ బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు ధ్రువీకరణ, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధ్రువీకరణ (పే స్లిప్స్) వంటివి మీ వద్ద ఒరిజినల్స్ ఉండేలా చూసుకోండి.
విజయవంతంగా దరఖాస్తు చేసేందుకు పైన పేర్కొన్న పత్రాలు మీకు చాలా అవసరం. బ్యాంక్ ఎంప్లాయ్ మీ లొకేషన్‌కు వచ్చి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో మీకు సహాయం చేస్తారు.
క్రెడిట్ కార్డును ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేయడం చాలా ఈజీ. మీరు రివార్డ్ పాయింట్లను పొందాలని చూసినా.. లేదా మీకు నగదును క్యారీ చేయడం ఇష్టం లేకపోయినా క్రెడిట్ కార్డుతో చెల్లించడం చాలా సులభంగానే ఉంటుంది.
మీ మిగతా క్రెడిట్ కార్డ్ వాడకపు ప్రవర్తన ఏమిటి? అది మీకు సహాయం చేస్తుందా? లేదా మీ క్రెడిట్ స్కోర్‌ను నాశనం చేస్తుందా?
మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను బాధ్యతాయుతంగా వినియోగించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం చాలా అవసరం. అందుకోసం మీరు ఆటోపే కానీ, రిమైండర్లను కానీ ఏర్పాటు చేసుకోండి. రెగ్యులర్‌గా పేమెంట్లు చేయడం అనేది చాలా అవసరం. ఇలా చేస్తే మీరు జరిమానాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (APR)ను కూడా జాగ్రత్తగా మెయింటేన్ చేయవచ్చు. క్రెడిట్ బిల్లులను సకాలంలో చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదం లేకపోలేదు.
క్రెడిట్ కార్డుతో ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీరు భరించగలిగినంత మాత్రమే ఖర్చు చేయండి. ఎక్కువగా ఖర్చు చేయడం మంచిది కాదు. కొంత మంది తమ క్రెడిట్ కార్డుతో ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు చేస్తారు. ఇంకా కొంత మంది తమ వద్ద రివార్డ్స్ కార్డు ఉందని చెప్పి పాయింట్ల కోసమని అధికంగా ఖర్చు చేస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. అధిక రుణం తీసుకోవడం వలన మీరు సంపాదించిన రివార్డ్ పాయింట్స్ రద్దయ్యే ప్రమాదం ఉంది.
రెగ్యులర్‌గా మీ క్రెడిట్ స్కోరును తనిఖీ చేయడం చాలా మంచి అలవాటు. ఇది మీకు ఆరోగ్యకరమైన క్రెడిట్ అలవాట్లను ఏర్పరుస్తుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ రిపోర్టును కూడా తరచూ తనిఖీ చేయండి. మీ పేరు మీద ఎటువంటి అనామక అకౌంట్లు లేకుండా చూసుకోండి.
ప్రతీసారి మీ క్రెడిట్ కార్డు పరిమితిని పూర్తిగా చెల్లించడం మంచి అలవాటు. మీరు కనుక పూర్తి చెల్లింపు చేయకపోతే మీకు వడ్డీ విధించబడుతుంది. (ప్రమోషన్లో భాగం కాకపోతే) మీరు అప్పుల్లో కూరుకుపోతారు. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
మీరు మీ కార్డులను ఎప్పుడూ మీ స్నేహితులకు ఇవ్వకండి. మీ కార్డును భద్రంగా ఉంచుకోండి. మీ కార్డు బాధ్యత పూర్తిగా మీదే. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీ కార్డు ఎక్కడైనా పోయినా లేదా దొంగిలించబడినా వెంటనే కార్డును జారీ చేసిన బ్యాంకుకు తెలియజేయండి. కార్డు మీ చేతికి వచ్చే వరకు కార్డును బ్లాక్ చేసి ఉంచండి.
మీ కార్డును మీరు వాడే విధానం గురించి చూసుకోండి. మీ కార్డుకు ఎంత పరిమితి ఉంది. మీరు ఎంత వాడారనే అంశాల మీద కూడా మీ క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. తక్కువ రేటులో వాడేందుకు మొగ్గు చూపండి. మీరు తక్కువ రేటులో వాడినప్పుడు జారీచేసేవారు కూడా నిశ్చింతగా ఉంటారు. మీరు మీ కార్డును గరిష్ట పరిమితి వరకు వాడుకుంటూ పోతే మీరు అప్పుల్లో పడే ప్రమాదం ఉంది. అప్పడు జారీచేసినవారు చింతిస్తారు.
మీ క్రెడిట్ కార్డు నెలవారీ స్టేట్మెంట్లను పరిశీలించడం వలన మీ అకౌంట్లో ఏదైనా మోసం జరిగితే ఇట్టే గుర్తించవచ్చు. క్రెడిట్ కార్డ్ కంపెనీ మోసాలను గుర్తించి మీకు తెలియజేస్తుంది. కానీ వారు గుర్తించని పక్షంలో మీరు తనిఖీ చేస్తే గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది.
నగదు అడ్వాన్స్‌లు మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టేస్తాయి. కావున నగదు అడ్వాన్స్‌లను తీసుకోవడం మంచిది కాదు. మీకు అత్యవసరంగా డబ్బు కనుక అవసరమైతే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్) తీసుకోవాలి. ఇది మంచి ఎంపిక.
క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత కార్డు అప్లికేషన్ ఆమోదం పొందుతుందా? లేదా అని మీరు ఆందోళన చెందడం సహజంగా జరుగుతుంది. మీరు ఎప్పుడు కార్డును తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీకు చాలా సహాయపడుతుంది.
మీరు ఈ నిర్ణయం తీసుకోవడంలో సహాయపడే కొన్ని పాయింట్లు ఇక్కడ ఉన్నాయి.
క్రెడిట్ కార్డు వాడటం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.
క్రెడిట్ స్కోరును మెరుగు పరుచుకోవడానికి కేవలం క్రెడిట్ కార్డు ఒక్కటే ఆప్షన్ కాదు. కానీ ఇది అత్యుత్తమమైనది. మీరు తరుచుగా మీ క్రెడిట్ కార్డును వాడుతూ.. సకాలంలో చెల్లింపులు చేసినట్లయితే మీ క్రెడిట్ స్కోర్ మెరుగు పడుతుంది.
క్రెడిట్ కార్డును తీసుకునేందుకు మీ ప్రధాన ఉద్దేశం ఇదే అయితే కొనుగోలు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీరు కొనుగోలు చేసిన మొత్తాన్ని సకాలంలో చెల్లించగలరా? లేదా అని సరి చూసుకోండి. రివార్డ్ పాయింట్లను సంపాదించుకోండి. క్రెడిట్ కార్డు కొనుగోళ్ల మీద మీకు క్యాష్‌బ్యాక్ అందుతుంది. మీరు పొందిన పాయింట్లను బ్యాంక్ డిపాజిట్లలా మార్చుకోవచ్చు.
ట్రావెల్, గిఫ్ట్ కార్డ్స్ వంటి వాటి కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే మీకు మరిన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి.
మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినప్పుడు మాత్రమే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వెళ్తుంది. అదే క్రెడిట్ కార్డుకు బదులుగా డెబిట్ కార్డును వాడినట్లైతే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు వెళ్లిపోతుంది. కాబట్టి పేమెంట్ల కోసం క్రెడిట్ కార్డును వాడటం మరింత సురక్షితం.
మీరు ఇలా ఆలోచిస్తే క్రెడిట్ కార్డును జాగ్రత్తగా చూసుకోవడం గురించి ఆలోచించండి.
మీకు ఎక్కువగా ఖర్చు చేసే అలవాటు ఉంటే క్రెడిట్ కార్డును ఉపయోగించకుండా.. డెబిట్ కార్డ్‌ను ఉపయోగించండి. ఈ అలవాటు మీకు మంచి చేస్తుంది. మీరు తిరిగి కట్టలేనంత రుణాన్ని క్రెడిట్ కార్డు నుంచి తీసుకోవడం మంచిది కాదు. మీ ఖర్చు సమస్యను తగ్గించుకునేందుకు డెబిట్ కార్డుకే కట్టుబడి ఉండండి.
మీరు ఎక్కువ కాలం క్రెడిట్ పేమెంట్ చేయకుండా ఉంటే మీకు ఎక్కువ వడ్డీ పడుతుంది. ఇది దీర్ఘకాలంలో పెద్ద మొత్తం అయ్యే ప్రమాదం కూడా ఉంది.
మీరు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోరును ఒకసారి తనిఖీ చేయండి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే కార్డు గురించి దరఖాస్తు చేయకపోవడమే మంచిది. చాలా కార్డుల కోసం దరఖాస్తు చేయడం కూడా మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
మొదటిసారిగా సొంత క్రెడిట్ కార్డును పొందడం ఒక అద్భుతమైన అనుభూతి. కానీ మీరు కార్డును పొందిన తర్వాత సమయానికి పేమెంట్స్ చేసే అలవాటును పెంపొందించుకోవాల్సి ఉంటుంది.
మీ ఖర్చులను ట్రాక్ చేస్తూ ఉండండి. అలాగే ప్రతీనెలా మీ క్రెడిట్ కార్డు బిల్లులను పూర్తిగా చెల్లించండి. క్రెడిట్ కార్డ్ తప్పులను విస్మరించండి.
క్రెడిట్ కార్డును వినియోగించడం, క్రెడిట్ స్కోరును పెంచుకోవడం వంటి విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.