Playstore Icon
Download Jar App
Digital Gold

అక్షయ తృతీయకు, బంగారానికి మధ్య గల సంబంధం ఏమిటి?

December 27, 2022

చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చూస్తారు కదా. ఎందుకై ఉంటుంది? కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు కదా. ఎందుకంటారు? అక్షయ తృతీయ పవిత్రమైన రోజు అని ప్రతీ ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు?

అఖా తీజ్​గా కూడా పిలవబడే అక్షయ తృతీయ.. బంగారం కొనుగోలుకు బాగా ప్రసిద్ధినొందింది.

భారతీయ క్యాలెండర్​ ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్షంలోని మూడో రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు.

హిందువుల ఇళ్లలో పవిత్రమైన, ఆనందకరమైన రోజుగా భావించే ఈ పండుగను మీరు జరుపుకొనే ఉంటారు. కనీసం, ఈ పండుగ సమయంలో మీడియాలో వచ్చే ఆభరణాల ప్రకటనల ద్వారానైనా మీరు దీని విశిష్టత గురించి తెలుసుకొనే ఉంటారు.

అక్షయ తృతీయను కొత్త ప్రారంభాలకు మంచిదిగా భావిస్తారు –– అది కొత్త కార్యక్రమం కావచ్చు, లేదా కొత్త నిర్మాణం కావచ్చు, లేదా కొత్త వ్యాపారం కూడా కావచ్చు.

ఈ రోజున ప్రారంభించే పని ఖచ్చితంగా పురోగతి సాధిస్తుందని, మార్గమధ్యలో తక్కువ అవాంతరాలు ఎదురవుతాయని అందరూ నమ్ముతారు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత:

ఈ ప్రత్యేకమైన రోజున...

●     శ్రీ మహా విష్ణువు యొక్క ఆరో అవతారంగా భావించే పరశురాముడు జన్మించాడు.

●     విఘ్నేశ్వరుడు, వేదవ్యాసుడు కలిసి మహాభారతాన్ని రాయడం ప్రారంభించారు.

●     ఇదే రోజున శ్రీకృష్ణుడు పాండవులకు ‘అక్షయ తృతీయ’ అనే పాత్రను అందించాడు. ఆ పాత్ర ప్రాముఖ్యత ఏంటంటే పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో అది వారు అడిగినంత ఆహారం ఇచ్చేది. ఎప్పటికీ ఖాళీ అయ్యేది కాదు.

●     గంగా నది స్వర్గం నుంచి భూమి మీదకు దిగి వచ్చింది. అన్నపూర్ణ దేవి జన్మించింది.

●     కుబేరుడు, లక్ష్మీదేవి మహాశివుడిని ప్రార్థించి, ఆయన ఆస్తిని, సంపదపై ఆధిపత్యాన్ని పొందారు.

●     జైనులకు సంబంధించి, వృషభనాథుడనే తీర్థంకరుడు ఏడాది పాటు కేవలం చెరుకు రసం మాత్రమే తాగి చేసిన ఉపవాస దీక్షను ముగించాడు. 

 

అక్షయ అంటే ఎప్పటికీ చావు లేనిదని అర్థం. అందుకే ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టమని, అనంత సిరి సంపదలు వస్తాయని అనేకమంది విశ్వసిస్తారు. 

ఈ ప్రత్యేకమైన రోజున బంగారం, వెండి, ఇతర ఆభరణాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆభరణాల దుకాణాల ముందు క్యూలలో నిల్చోవడం మీరు చూసే ఉంటారు.

ఈ రోజు దేశంలో జరిగే బంగారం క్రయవిక్రయాలు ఏడాది మొత్తంలోనే అత్యధికంగా ఉంటాయని మీకు తెలుసా. 

 

పెట్టుబడిగా పెట్టడానికి బంగారం ఎలా ఉంటుంది?

 

ఆర్థిక పరంగా చూసినట్లు అయితే, బంగారం అనేది భద్రతకు చిహ్నంగా, తక్కువ రిస్కు కలదిగా, తెలివైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది.

అక్షయ తృతీయ ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి బంగారం మీద పెట్టుబడులు పెట్టేందుకు ఈ పర్వదినం ఒక మంచి ఎంపిక.

 

ప్రస్తుతం భారతదేశంలో క్రయవిక్రయాలు జరిపే బంగారం అంతా దిగుబడి చేసుకుంటున్నదే. అంతేగాక, రోజురోజుకూ డాలర్​తో పోల్చుకుంటే రూపాయి విలువ తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుకుంటూ పోతున్నాయి. కాబట్టి బంగారంపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచిదని పలువురి అభిప్రాయం.

బంగారంపై పెట్టుబడి పెడితే ఏటా కనీసం 5 శాతం లాభం ఉంటుంది. కొన్ని సంవత్సరాల్లో ఇది పెరగొచ్చు, లేదా తగ్గొచ్చు.

 

ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి పోర్ట్​ఫోలియోలో కచ్చితంగా ఉండాల్సిన పెట్టుబడి ఎంపిక బంగారం. దీనిలో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం అంటూ ఏమీ ఉండదు.

ఏడాదిలో ఏ సమయంలోనైనా మీరు దీన్ని కొనుగోలు చేయొచ్చు. ఇది ద్రవ్యోల్బణం, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్​లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎదురయ్యే రిస్క్​ పరిస్థితులను తగ్గిస్తుంది.

ఒడిదొడుకుల మధ్య సాగే మార్కెట్లలో కూడా బంగారం మీద పెట్టుబడులు అద్భుతంగా పని చేస్తాయి. రిస్కు అంశాలను మెరుగుపర్చే సామర్థ్యం దీనికి ఉంది. వేరే పెట్టుబడులు నష్టాల ఊబిలో కూరుకుపోయినా, బంగారం మీద పెట్టిన పెట్టుబడులు మాత్రం లాభాలను తెస్తూనే ఉంటాయి.

 

ప్రస్తుతం కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఈ సమయంలో బయటకి వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేయడం అంత సురక్షితం కాదు. బంగారం షాపులలో ఉండే రద్దీ దృష్ట్యా బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలంటే ఎలా మరి? దీనికోసం మా దగ్గర ఒక మంచి సలహా ఉంది. బంగారమంటే బంగారమే కదా?

గతంలో మీరు బంగారాన్ని కేవలం భౌతిక రూపంలో మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉండేది (నగలు, నాణేలు, బంగారు కడ్డీలు మొదలగునవి). కానీ ఇప్పుడు మీరు డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

అవును. మరి మీరు డిజిటల్ గోల్డ్​ను ఎందుకు కొనుగోలు చేయకూడదు? నిజానికి, ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక బంగారం కంటే డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేసేందుకే మీరు మొగ్గు చూపాలి. ఎందుకంటారా? ఇక్కడ తెలుసుకోండి.

 

డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి?  

 

డిజిటల్ గోల్డ్ అనేది భౌతిక రూపంలో ఉండే బంగారానికి ఒక ప్రత్యామ్నాయం. ఇది మారకపు రేటు జిమ్మిక్కులు, మార్పులకు లోను కాదు. అంతేగాక, భౌతిక రూపంలోని బంగారాన్ని తాకాల్సిన అవసరం లేకుండానే ప్రపంచంలో ఎక్కడైనా ట్రేడ్​ చేసుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తుంది.

 

భారతదేశంలో, డిజిటల్​ గోల్డ్​ను అనేక యాప్స్, వెబ్​సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. కానీ, ఆ డిజిటల్ గోల్డ్​ను కేవలం 3 కంపెనీలు మాత్రమే భద్రపరుస్తాయి. అవి: ఆగ్​మాంట్ గోల్డ్ లిమిటెడ్, డిజిటల్ గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – సేఫ్ గోల్డ్, MMTC-PAMP ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

ఆన్​లైన్​లో బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా సురక్షితమైన, అనువైన, తక్కువ ఖర్చు అయ్యే మార్గం. అంతేగాక, దీనిలో మీరు స్టోరేజీ, రవాణా ఖర్చుల వంటివి ఏవీ కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

 

మీ అకౌంట్​లో వచ్చి చేరే ప్రతీ గ్రాము బంగారం కూడా మీకు దాన్ని అమ్మిన విక్రేత ద్వారా మీ పేరిట సురక్షితమైన వాల్ట్​లలో భౌతిక బంగారంతో నిల్వ చేయబడుతుంది. 

అంటే మీకు ఎటువంటి రిస్కు కూడా ఉండదన్న మాట. మీరు బంగారం కొనుగోలు చేసేందుకు ఉపయోగించిన యాప్ మాయమైపోయినా కూడా మీ బంగారం మాత్రం చాలా సురక్షితంగా ఉంటుంది! మీకు నచ్చినపుడు మీరు దాన్ని అమ్ముకొని బయటపడొచ్చు. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది కదా?

 

బంగారం కొనుగోలు చేసేందుకు అక్షయ తృతీయ మంచిదే అయినప్పటికీ, ఈ ప్రత్యేకమైన లోహాన్ని కొనేందుకు ఇదే సరైన సమయం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు.

ఏ సంవత్సరంలోనైనా మీరు దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారం మంచి పెట్టుబడి ఎంపిక అవుతుంది. అందుకే, ముందడుగు వేయండి. ఇప్పుడే, ఇక్కడే జార్ (Jar) యాప్​ని ఉపయోగించి బంగారం కొనుగోలు చేయండి.

 

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.