Buy Gold
Sell Gold
Daily Savings
Digital Gold
Instant Loan
Round-Off
Nek Jewellery
ధనవంతుల అందించిన విలువైన ఆర్థిక చిట్కాలతో మీకు మీరు జ్ఞానోదయం చేసుకోండి. వాటిని మీ జీవితంలోనూ అమలుపరిచి ప్రయోజనాలు పొందండి.
కోటీశ్వరులుగా మారడం వెనుక రహస్యమేంటో తెలుసుకోవాలని మనమందరమూ అనుకుంటాము, కదా? ప్రపంచంలోని అత్యంత సంపన్నులు తమ డబ్బు గురించి ఎలా ఆలోచిస్తారో, దాని విషయంలో ఎలా ప్రవర్తిస్తారో, డబ్బును ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకోవాలని అనుకుంటాము.
మీ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా, మీరు ఎప్పుడైనా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. ఈ క్రమంలో ధనవంతులు అందించే వ్యక్తిగత ఆర్థిక సలహాలు ప్రతీ పరిస్థితిలోనూ ఉపయోగకరంగా ఉంటాయి.
కాబట్టి డబ్బు గురించి మీ దృక్పథాన్ని మార్చడానికి, దాన్ని ఈ సంపన్నులతో సర్దుబాటు చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి!
మీ వెల్త్ మేనేజర్‌ను అసూయపరిచే సంపన్న వ్యక్తుల నుండి కొన్ని జీవిత అనుభవాలు, ఆర్థిక చిట్కాలు తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?
మెక్సికోలో 73.3 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన అత్యంత ధనిక వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ హెలూ, ఒకసారి "సాధ్యమైనంత త్వరగా డబ్బును పక్కన పెట్టడం ప్రారంభించండి" అని ఉటంకించారు.
మీరు ఏ పని చేసినా కూడా, మీ డబ్బును పొదుపు చేయడం, మేనేజ్ చేయడం ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ జీవితం తరువాతి దశలో అంత బాగుంటారు.
ఆయన తన 12 సంవత్సరాల వయస్సులోనే ఓ మెక్సికన్ బ్యాంకులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. యుక్త వయస్సుకు వచ్చేసరికి తన తండ్రి కంపెనీలో పనిచేయడం ప్రారంభించారు. ప్రతీ వారం 200 పెసోలు సంపాదించారు.
వారెన్ బఫెట్, ప్రపంచ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఒకరు. ఆయన 1957లో $31,500 పెట్టి కొనుగోలు చేసిన ఇంట్లోనే ఇంకా నివసిస్తున్నారు. యువతకు ఆయన ఒక గొప్ప సలహా ఇచ్చారు - "మీ జీవితాన్ని మీలాగే సరళంగా జీవించండి." ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఒక ఫైనాన్షియల్ ట్రెడ్‌మిల్‌పై ఉన్నారు. ఇదేమీ పైకి వెళ్లే ఎస్కలేటర్ కాదు. కాబట్టి మీకు అవసరం లేని వస్తువులను ఎప్పుడూ వెంట పెట్టుకోకండి.
ఆయన 'మీ ప్యాషన్‌ని వెతకడం’'పై కూడా దృష్టిసారిస్తాడు. మీరు జీతం కోసం బానిసగా పనిచేస్తున్నప్పటికీ, మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి. దానికి కొంత సమయం కేటాయించండి అని ఆయన సూచించారు. విజయాన్ని సాధించడానికి ఇది ఉత్తమ పద్ధతుల్లో ఒకటి.
నేటి పోటీ సమాజంలో, మీరు చేసే పనిని మీరు ఆస్వాదించలేకపోతే, జాబ్ మార్కెట్, మార్కెట్ ప్లేస్ రెండింటిలోనూ మీకు ప్రతికూలంగానే ఉంటుంది.
మన వద్ద ఖర్చు చేయడానికి చాలా డబ్బు ఉన్నప్పటికీ మనం చేసే దానిలో కొంత వ్యయం అనవసరమైనదేనని ఐకియా సృష్టికర్త ఇంగ్వర్ కాంప్రాడ్ విశ్వసిస్తారు.
ఆయన అనేకమంది ఇతర ప్రపంచ కుబేరుల మాదిరిగా ప్రైవేట్ విమానంలో కాకుండా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించేందుకే ఇష్టపడతారు. పదేళ్ల కిందట కొనుక్కున్న వోల్వో కారునే వాడుతున్నారు.
"మాకు మెరిసే కార్లు, ఆకట్టుకునే టైటిల్స్, యూనిఫారాలు లేదా ఇతర స్టేటస్ సింబల్స్ అవసరం లేదు. మేము మా బలం, మా సంకల్పంపై ఆధారపడతాము!" అని కాంప్రాడ్ తన మెమోయిర్‌లో రాసుకున్నారు.
ఆయన ఫైనాన్స్ సలహా కోరికల నుండి అవసరాలను వేరు చేయడంపై దృష్టి పెడుతుంది.
చికాగోకు చెందిన బ్యాంకర్స్ లైఫ్ అండ్ క్యాజువాలిటీ కంపెనీ యొక్క ఏకైక వాటాదారు జాన్ డోనాల్డ్ మెక్ ఆర్థర్ 1978లో మరణించిన సమయంలో $1 బిలియన్ నికర విలువను కలిగి ఉన్నాడు (నేడు అది $3.7 బిలియన్లు).
మెక్ఆర్థర్ తన కెరీర్‌ను ఒకే కొనుగోలుతో ప్రారంభించాడు. తరువాత దాని చుట్టూ తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు.
హాలీవుడ్లో ఫ్లాష్, గ్లామర్ కాలం నడుస్తున్న సమయంలోనూ మెక్ఆర్థర్ వాటిని నిరాకరించి, సాధారణ జీవితాన్ని గడిపారు.
ఆయన తన జీవితంలో ఎప్పుడు కూడా లగ్జరీ జీవితాన్ని గడపలేదు. తనకు ప్రెస్ ఏజెంట్లు లేరు. కేవలం $25,000 వార్షిక బడ్జెట్‌పై ఆయన జీవించారు.
పొదుపుగా ఉండటం అనేది మంచి వ్యాపారవేత్తగా ఉండటానికి మరొక మార్గం." అనేది అతని ప్రసిద్ధ సూక్తులలో ఒకటి.
"తాత్కాలికంగా ఇతరుల డబ్బును ఉపయోగించుకోవడానికి డబ్బు చెల్లించడం మిమ్మల్ని పేదవారిని చేస్తుంది. అదే ఇతరులు తాత్కాలికంగా మీ డబ్బును వాడుకోవడానికి మీరు డబ్బు వసూలు చేయడం మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది" అని వాల్ స్ట్రీట్ మాజీ విశ్లేషకుడు స్టేసీ జాన్సన్ చెప్పారు.
మనుగడ కోసం తప్పనిసరి అయితే అప్పు నెగిటివ్ విషయం కాదని స్టేసీ అన్నారు. అయితే, దానిని నివారించేందుకు ఎక్కువ ప్రయత్నం చేయాలని ఆయన సిఫారసు చేశారు.
మీకు ఎంత తక్కువగా అప్పు ఉంటే, మీ ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా ఉంటుంది.
"చాలా కాలం క్రితం ఎవరో చెట్టు నాటినందున ఈ రోజు ఎవరో దాని నీడలో కూర్చున్నారు."
స్వల్పకాలిక, ఒడిదుడుకుల పెట్టుబడుల కంటే దీర్ఘకాలిక, స్థిరమైన పెట్టుబడులను ఇష్టపడతానని బెర్క్‌షైర్ హాత్వే సీఈవో వారెన్ బఫెట్ చెప్పే మరో కోట్‌లోని పాయింట్.
నిజమైన విలువ కంటే తక్కువ వ్యాల్యుయేషన్‌లో ఉన్న సంస్థల్లోనే ఆయన పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడిని ఎక్కువ కాలం పాటు అలాగే ఉంచుతారు... బహుశా ఎప్పటికీ.
విజయవంతంగా పెట్టుబడి పెట్టడం అనేది గెట్-రిచ్-క్విక్ ప్రోగ్రామ్ కాదని ఆయన సలహా ఇస్తారు. ట్రెండీ స్టాక్ పిక్స్, సరికొత్త స్టార్టప్‌లు, అసాధారణమైన భారీ లాభాలను వాగ్దానం చేసే షేడీ ఇన్వెస్ట్మెంట్ల గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తారు.
బ్రిటీష్ బిలియనీర్, వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, $4 బిలియన్ల నికర విలువ కలిగిన రిచర్డ్ బ్రాన్సన్, గతంలో ఒక లక్ష్యాల జాబితాను మాత్రమే కలిగి ఉన్నారు.
అవి అత్యంత వాస్తవికమైనవి కానప్పటికీ, ఆయన వాటిని సెట్ చేసి, వాటిని వెంబడించారు. తాను ఏర్పాటు చేసుకున్న లక్ష్య ఒక రోజుకు ఎక్కడికి దారితీస్తుందో అప్పుడు ఆయనకు తెలియదు.
ఈ రోజు, ఆయన అంతరిక్షం అంచు వరకు ఎగరగలిగాడు. ఇటీవల ఆయన 17 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టుకు ఒక సూచనాత్మక మైలురాయిని గుర్తించారు. అంతరిక్ష పర్యాటకంతో కొత్త యుగాన్ని ప్రారంభించారు.
తన లింక్డ్ఇన్ న్యూస్‌లెటర్‌లో, ఆయన "సందేహం కలిగినప్పుడల్లా, కలలు సరిగ్గా లేవని నాకు నేను గుర్తు చేసుకుంటాను" అని పేర్కొన్నారు.
బిల్ గేట్స్ ఎవరో తెలియని వారు ఎవరైనా ఉంటారా? మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన ఆయన నికర విలువ $150 బిలియన్లు ఉంటుంది. గొప్ప దాతగా కూడా ఆయన బాగా ప్రసిద్ధి చెందారు.
గేట్స్ ఇతర సంపన్నుల మాదిరిగానే, డబ్బును తరలించడానికి ఇష్టపడతారు, బ్యాంకులో వదిలివేయరు.
"మనం చాలా వరకు నగదు లేదా అలాంటి దేనినైనా కలిగి ఉన్న రక్షణాత్మక భంగిమలో లేము."
2019లో బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ "పెట్టుబడులలో నేను ఉపయోగించిన వ్యూహం ఈక్విటీలలో 60% మించి ఉండటమే" అని పేర్కొన్నారు.
ఆర్థిక ఆస్తులు, రియల్ ఎస్టేట్, కలెక్టిబుల్స్ యొక్క వైవిధ్యమైన మిశ్రమంలో ఉన్న ఆయన యొక్క విభిన్నమైన పెట్టుబడి పోర్ట్‌ఫోలియో ద్వారా ఆయన అదృష్టం రక్షించబడుతోంది.
పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రసిద్ధ ఆంగ్ల సామెత కూడా ఉంది - "మీరు మీ గుడ్లను అన్నింటినీ ఒకే బుట్టలో ఉంచకుండా చూసుకోండి."
ధనవంతులు ఎప్పుడు కూడా తమ మొత్తం పోర్ట్‌ఫోలియోను కేవలం ఒకటి లేదా రెండు స్టాక్‌లలో పెట్టుబడి పెట్టరు.
అందుకే అనేక ఆస్తులు, స్టాక్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ కలిగి ఉన్న వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం చాలా ముఖ్యం.
బిజినెస్ ఆస్తులు, రియల్ ఎస్టేట్, కలెక్టిబుల్స్ అన్నీ మీ పోర్ట్‌ఫోలియోలో భాగం కావచ్చు.
ధనవంతులు, విజయవంతమైన వ్యక్తులు తమ అనుభవాలతో మనకు చాలా బోధించగలరు. వీరిలో ప్రతి ఒక్కరూ మార్కెట్ల విషయంలో విద్యార్థిగా ఉండటంతో పాటు నాయకుడిగా కూడా ప్రసిద్ధి చెందారు.
మనమందరం జీవితంలో అమలు చేయడం, విఫలం కావడం, నేర్చుకోవడం ద్వారా ఎన్నో నేర్చుకుంటాం. డబ్బు విషయంలో మన ఉద్దేశం, మనం చేసే పనులే మనమేం సాధించగలమో నిర్ణయిస్తాయి. ఏది ఎంచుకోవాలనేది మన నిర్ణయమే.
ఇప్పుడు మీరు ప్రపంచ కుబేరుల అందజేసిన అత్యంత విలువైన ఆర్థిక సలహాలను తెలుసుకున్నారు. మరి వాటిని మీ జీవితంలో ఎలా అమలు చేయాలని అనుకుంటున్నారు?